Itala Rajinder
-
ప్రతీ మొక్కను బతికించాలి..
► పక్కా ప్రణాళికతో హరితహారం ► మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ► గతానుభవాలు పునరావృతం కాకూడదు ► 50 శాతం బతికితే మొక్కకు 5 రూపాయలు ► నిధుల విషయంలో రాజీలేదు.. ► అటవీశాఖదే పెద్దన్న పాత్ర ► 12న లక్ష మొక్కలతో హరితహారం ప్రారంభం ► అధికారులతో సమీక్షించిన మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్ రెండేళ్లలో పట్టణాల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 శాతం మొక్కలు బతికాయి.. అందుకే ముఖ్యమంత్రి పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మండలస్థాయిలోనూ మొక్కల లెక్కలు పక్కాగా రావడం లేదు. పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పక్కా ప్రణాళికలు రూపొందించుకుని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటి ని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలి. – జోగురామన్న, అటవీశాఖ మంత్రి గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలి. ఈ ఏడాది వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలి. జిల్లాలో ఎన్ని మొక్కలు పెట్టామని కాదు.. ఎన్ని బతికాయన్నదే ముఖ్యం. మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంఖ్య కో సం, ఫొటోలకు ఫోజుల కోసం కాకుండా మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే అంతా సిద్ధం కావాలి. – ఈటల రాజేందర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సాక్షి, కరీంనగర్/కరీంనగర్‌సిటీ: ముఖ్యమంత్రి మానసపుత్రికగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో విజ యవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. సో మవారం కరీంనగర్ కలెక్టరేట్లో మూడో విడత హరితహారం అమలుపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొక్కల నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 12న కరీంనగర్‌కు రానున్నట్లు వెల్లడించారు. ఆ రోజు కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంతో హరితహారాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మూడో విడతగా 1.10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతోపాటు కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే ప్రణాళికలు, పనుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెం డేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొదటి సంవత్సరంలో 16 కోట్లు, రెండో సం వత్సరంలో 32 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. అందులో 67 శాతమే రక్షించుకున్నామని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడో విడత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని తెలిపా రు. పాఠశాలలో మొక్కల నిర్వహణకు ఉపాధిహామీ నిధులిస్తామని స్పష్టం చేసినప్పటికీ విద్యాశాఖ విని యోగించడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మొక్కల నిర్వహణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రతీ శాఖ ద్వారా నాటే మొక్కల నిర్వహణకు నిధులున్నాయని తెలిపారు. మండల స్థాయి నుంచే మొక్కల లెక్కలు పక్కాగా తెలియడం లేదని, అది పునరావృతం కాకుండా సమగ్ర నివేదికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్ని ఇళ్లున్నాయి? ఎన్ని కిలోమీటర్ల రోడ్లు? సంస్థలు? అందులో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు? గతంలో తీసుకున్నదెంత? ఇప్పుడెంత? అనే సమగ్ర వివరాలతో ముందుకుపోవాలన్నారు. ఎంపీడీవోలు మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆమ్లెట్ గ్రామాలకు కూడా హరితరక్షణ కమిటీ బాధ్యతలు అప్పగించాలన్నారు. రోడ్డు వెడల్పు, పైపులైన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి పనులు పూర్తయిన రోడ్ల వద్దనే మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో కూడా హరితరక్షణ కమిటీలను బలోపేతం చేస్తున్నామని, అందుకు తగిన నిధులను, నీటి వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు ఆకుపచ్చని పరిసరాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాటిన మొక్కల రక్షణకు నిధుల కొరత లేదని, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. మండలస్థాయిలోనే ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మొక్కలు బతికితే ఉపాధిహామీ కింద ప్రతీ మొక్కకు నెలకు రూ.5 చొప్పున అందజేస్తామన్నారు. జిల్లాలో గుట్టలు, ప్రభుత్వ స్థలంలో నీటి కోసం బోర్లతో నీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తామన్నారు. హరితహారంలో అటవీశాఖ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటితే 100 కోట్ల మొక్కలు అటవీశాఖ ద్వారా నాటామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారం ప్రతిష్టాత్మకం..: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చే పట్టిందన్నారు. ఈ ఏడాది హరితహారం గొప్పగా ఉం టుందన్నారు. హరితహారానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని, నిధుల విషయంలో రాజీలేదని స్ప ష్టం చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రతి మొక్కనూ కాపాడుకునేలా ముందుకు పోవాలని సూచించారు. ఎల్ఎండీ డ్యాం, శ్మశానవాటికలు, రోడ్లు, దేవాలయాలు, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వద్ద విరివిగా మొక్కలు నాటవచ్చన్నారు. రెండేళ్ల క్రితమున్న భూములు ఇప్పుడూ ఉన్నాయన్నారు. నగరంలోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలోని ఖాళీస్థలంలో ట్రీగార్డుల బదులు ట్రీగార్డుల బదులు ప్రహరీ నిర్మిస్తే కొన్ని వేల మొక్కలు బతికించే అవకాశముందని, అందుకు తగిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. లెక్కలే ఉన్నాయి గాని మొ క్కలు లేని అనుభవాలు ఎదురయ్యాయన్నారు. రెండేళ్లలో ఆశించినంత సాధించలేకపోయామన్నారు. గత ప్ర భుత్వాలకు భిన్నంగా సం క్షేమంతో పాటు హరితహారా న్ని ప్రాధాన్యతగా తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. నిరంతర సమీక్షలతో బాధ్యతాయుతంగా కృషి చేయాలని, కార్పొరేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దుతామన్నా రు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధి కారుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హ రితహారం విజయవంతం కావాలన్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే ఝా, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మ ద్, నగర పాలక సంస్థ కమిషనర్ శశాంక, హరితహారం స్పెషలాఫీసర్ ఆంజనేయులు, ఏసీపీ జె.రామారావు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, డీఈవో రాజీవ్, డీపీవో నారాయణరావు, జైలు సూపరింటెండెంట్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజన, ఎక్సైజ్ ఈఎస్ శంకర య్య, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులున్నారు. -
జీఎస్టీతో మనకు లాభమే
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల వెల్లడి ♦ పన్ను వాటా పెరుగుతుందని ఆశిస్తున్నాం ♦ నష్టపోయే రాష్ట్రాలకు ఐదేళ్లపాటు కేంద్రం పరిహారం ♦ మన ప్రయోజనాలు, ఆదాయానికి గండి పడకుండా చూస్తున్నాం ♦ మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు ♦ వస్తు సేవల పన్ను బిల్లుకు అసెంబ్లీ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఒక దేశం ఒకే పన్ను నినాదంతో అమల్లోకి తెస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, ఆదాయానికి గండి పడకుండా తదనుగుణంగా స్పందిస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పన్ను విధానం పారదర్శకంగా ఉంటుందని, కొత్త విధానం వల్ల రాష్ట్రం కోల్పోయే ఆదాయం మొత్తాన్ని ఐదేళ్లపాటు కేంద్రం పరిహారం రూపంలో రీయింబర్స్ చేస్తుందని శాసనసభలో వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రానికి లాభమేనన్నారు. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందన్నారు. వస్తు సేవల పన్ను బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఈటల జీఎస్టీ స్వరూప స్వభావాలను సభ ముందుంచారు. జీఎస్టీ స్లాబ్‌లపై ఇంకా స్పష్టత లేదు వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను ఉండదని, మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో ఉండవని చెప్పారు. ప్రత్యక్ష పన్ను అయిన ఆదాయపు పన్ను జీఎస్టీ పరిధిలోకి రాదని, పరోక్ష పన్ను అయినప్పటికీ కస్టమ్స్ సుంకం కూడా దీని పరిధిలో ఉండదన్నారు. సామాన్యుడిపై భారం పడకుండా పన్ను విధానం ఉండాలని, పన్ను విధింపు ప్రాక్టి కల్గా ఉండాలని పలు సందర్భాల్లో నిర్వహిం చిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో తెలంగాణ పక్షాన గట్టిగా వాణిని వినిపించామన్నారు. ఇప్పుడు అదే పంథాలో పన్ను విధానం ఉంటుందని ఆశిస్తున్నామ న్నారు. అయితే జీఎస్టీలో ఏ వస్తువు ఏ పన్ను స్లాబ్ పరిధిలో ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రావా ల్సి ఉందని ఈటల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వస్తువులపై విధిస్తున్న వ్యాట్, దానికి అనుబంధంగా ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ సుంకం కలిపి ఆ మొత్తం ఏ స్లాబ్‌కు చేరువలో ఉందో చూసి అందులో చేరుస్తారని తెలిపారు. ఉత్పత్తి కంటే వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రం అయినందున జీఎస్టీలో తెలంగాణకు ఎక్కువ పన్ను మొత్తం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే హైదరాబాద్‌లో సేవల రంగం వాటా ఎక్కువగా ఉన్నందున ఆ రూపంలో ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. కొత్త పన్ను విధానం వల్ల ఎగవేతలకు బ్రేక్ పడి ఆదాయం పెరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రపం చంలో 196 దేశాలకుగాను ఇప్పటికే 160 దేశాలు ఈ పన్ను విధానాన్ని అవలంబిస్తు న్నాయని సభ దృష్టికి తెచ్చారు. రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీలోకి తేవాలి: చిన్నారెడ్డి పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం భారీ ఆదాయాన్ని తెచ్చేపెట్టేదిగా మారనున్నం దున దాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్‌తోపాటు విద్యుత్ విషయంలో పన్ను విధింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవటానికి కారణ మేంటని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్ పక్షాన ఆయన చర్చలో పాల్గొ న్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు పన్ను విధింపుల్లో రకరకాల స్లాబులెందుకని ప్రశ్నించారు. భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తారంటున్నారని, దానిపై స్పష్టత కావాల న్నారు. విలాసవంతమైన ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులను పెద్ద స్లాబ్‌లోకి చేర్చి సామాన్యులు వాడే వస్తువులను తక్కువ పన్ను స్లాబ్‌లోకి మార్చాలని కోరారు. -
మీ హయాంలో ఒక్కరికైనా సాయమందిందా?
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ఈటల ⇒ అలాగని నిరూపిస్తే రాజీనామా చేస్తా ⇒ కాంగ్రెస్‌కు మరో పదేళ్లు భవిష్యత్తుండదు ⇒ ఆ తరహాలో సంక్షేమ పాలన అందిస్తం ⇒ కులవృత్తులను కించపరుస్తున్న విపక్షాలు ⇒ మోటార్లు కాలిపోయినా, చివరి పొలాలకు నీరందకున్నా ముక్కు నేలకు రాస్తా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో ఒక్క కుటుంబానికైనా రూ.5 లక్షల ఆర్థిక ప్రయోజనం కలిగించినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సవాలు విసిరారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఎస్సీలకు భూ పంపిణీ కోసం కాంగ్రెస్ పాలనలో రూ.76 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.406 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి భూముల కొనుగోలు కోసం రూ.15 నుంచి 20 లక్షలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిది’’ అని చెప్పారు. ‘‘ఏడాదిలోనే బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటుంటే ముక్కు నేలకు రాస్త. కరెంట్ మోటార్లు కాలిపోయినా, చివరి పొలాలకు కరెంట్ రాకపోయినా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం’’ అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అంకెలు పట్టుకుని ఆరోపణలు చెయ్యొద్దు.. ఆచరణలో జరుగుతున్న పనులను చూడాలంటూ హితవు పలికారు. వికలాంగులకూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. నాయకులకు సోయి ఉండాలె అభివృద్ధి, సంక్షేమ కార్యకమాలతో కాంగ్రెస్‌కు మరో పదేళ్లు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని ఈటల అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలే తప్ప కులాలను కించపరుస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. గొర్రెలు, మేకలు, పందులు అంటూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తద్వారా కులవృత్తులను కించపరిచేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు. తాను కోళ్ల ఫామ్ నడిపిన స్థాయి నుంచి ఆర్థికమంత్రిగా ఎదిగానన్నారు. ‘‘విపక్షాలు ఆరోపణలు, లెక్కలతో ప్రజలను నమ్మించజూస్తున్నయి. కానీప్రజలు తెలివైనవారు. ఎవరేం చేశారో తేల్చేది వారే. నేతలంటే కేవలం విమర్శలు చేయడం కాదు. సమస్యల పరిష్కార బాధ్యత ఉందనే సోయి ఉండాలి. లేదంటే ప్రమాదం. మూడేళ్లలోనే దేశ చిత్రపటంపై గొప్ప రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నదని చెప్పగలిగినం. ప్రభుత్వం తెచ్చిన 350 జీవోలను అమలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. మా ప్రభుత్వానికి మానవత్వముంది. ఉత్తర్వులపై కంటే ప్రజలపై నమ్మకముంది. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్య బారిన పడ్డ రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర ఇస్తే మా ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తున్నది. ప్రకృతి వైపరీత్యంతో మరణిస్తే రూ.5 లక్షలిస్తున్నం. బడ్జెట్ నిధులు మొత్తం ఖర్చు కాలేదంటున్నరు. ఛత్తీస్‌గఢ్, హరియాణా, కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ 79–86 శాతం మధ్యే ఖర్చు చేశాయి. చివరకు కేంద్రంలోనూ అంతే’’ అని వివరించారు. రెండున్నరేళ్లలో 42 వేల మందికి ఉద్యోగాలిచ్చామన్నారు. రాబోయే రెండేళ్లలో మరో 60 వేల ఉద్యోగాలు ఇస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. పీసీ సర్కార్ బడ్జెట్: షబ్బీర్ అలీ తామెవరినీ కించపరచలేదని విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. పందుల పెంపకానికి ఆధునిక ఫాంలను ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే సూచించామన్నారు. ‘‘ప్రజల నమ్మకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసింది. బడ్జెట్ పీసీ సర్కార్ మ్యాజిక్‌లా ఉంది. అల్లావుద్దీన్ అద్భుత బడ్జెట్ అయితే తప్ప రూ.1.49 లక్షల కోట్లను వ్యయం చేయలేరు. జెన్కో ద్వారా ఒక్క మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారు. మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్లలో 48– 60 శాతమే ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చనిపోయిన వారికి అంబులెన్సులకు దిక్కు లేదు గానీ గొర్రెలకు ఏమైనా అయితే అంబులెన్సుల్లో తీసుకెళతామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. డీఎస్సీ, గురుకుల టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేశారు. పిల్లీ ఎలుక ఆటాడుతున్నారు. పలు పంటలకు ధర లేదు. అక్షరాస్యతలో దేశంలోనే చివరి స్థానంలో ఉంది’’ అన్నారు. చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శాసన మండలిని ఈనెల 24వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
బహిరంగ చర్చకు భయమెందుకు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలకు పాల్పడకుంటే బహి రంగ చర్చకు రావడానికి మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో పేదల కడుపులు కొట్టినందుకు ప్రైవేటు సంస్థల నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కనీసం రూ.150 కోట్లు ముడుపులు అందాయని ఒక ప్రకటనలో ఆరోపించారు. జేవీ ప్రాజెక్టులో మంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వస్తుందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖలో చక్కెర, కందిపప్పు, బియ్యం కొనుగోలులో మంత్రి ఈటల రాజేందర్‌కు రూ.వందల కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. బహిరంగంగా హోల్‌సేల్ మార్కెట్లో ఉన్న ధర కంటే ఎక్కువ ధరను చెల్లించి మూడేళ్లుగా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు సప్లయర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. నిజాయితీకి మారుపేరని, నిప్పు అని చెప్పుకుంటున్న ఈటలకు ముడుపులు అందకుంటే చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. కళాధర్‌రావు అనే రిటైర్డు అధికారితో ఈటల కమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, చర్చకు వస్తే అన్నింటినీ నిరూపిస్తానని సవాల్ చేశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పించుకునే చిల్లరమల్లర ప్రయత్నాలు చేయకుండా, బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ
⇒ గొర్రెలు, మత్స్యరంగాల అభివృద్ధి ఉపసంఘం సిఫారసు ⇒ 4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 4 లక్షల కుటుంబాలకు రూ. 5 వేల కోట్లతో 75 శాతం సబ్సిడీపై 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని గొర్రెలు, మత్స్యరంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో రెండోసారి సమావేశమైంది. ఈ ఉపసంఘంలో మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశానికి జూపల్లి మినహా సభ్యులంతా హాజర య్యారు. సభ్యులు పలు అంశాలపై చర్చించి ముఖ్యమంత్రికి సమర్పించనున్న నివేదికలో ఈ మేరకు సిఫారసు చేయనున్నారు. రాష్ట్రంలో 4 లక్షల యాదవ, కురుమ కుటుం బాలు ఉండగా... ఇందులో 2 లక్షల కుటుం బాలకు ఈ ఏడాది 20+1(20 గొర్రెలు, 1 గొర్రెపోతు) చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. మిగిలిన 2 లక్షల కుటుంబాలకు వచ్చే ఏడాది పంపిణీ చేయాలని సూచించిం ది. లబ్ధిదారులు గొర్రెల పెంపకం సొసైటీల్లో సభ్యత్వం కలిగి ఉండాలని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి గొర్రెల ను కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ప్రాంతంలోనే గొర్రెలకు ఇన్సూరెన్స్ ట్యాగ్ వేస్తారు. కిలోల లెక్కన ధరను నిర్ణయించా లని... లబ్ధిదారుల ఎంపికకు సరైన మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలవాలని ఉపసంఘం స్పష్టంచేసింది. టెండర్‌ను దక్కించుకున్న వారే లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలను సరఫరా చేస్తారు. ఒక్కొక్క యూనిట్ ధర రూ. 1.25 లక్షలు. అసలు గొర్రెలు లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. మత్స్యశాఖపై జరిగిన చర్చలో భాగంగా సభ్యత్వ నమోదు... ఇతర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవ ర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల త్యాగాలు మరువలేనివి
అమర జవాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఈటలకమలాపూర్(హుజురాబాద్) : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా సేవచేస్తున్న సైనికులను, దేశం కోసం చేమటోడ్చుతున్న రైతన్నను మనం గౌరవించుకోవాలన్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన కూస కరుణాకర్ ఆర్మీలో పని చేస్తూ గతేడాది పాముకాటుకు గురై మృతి చెందగా శుక్రవారం మర్రిపల్లిగూడెంలో ఆయన ప్రథమ వర్ధంతి నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కరుణాకర్ విగ్రహాన్ని మంత్రి ఈటల ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సైనికులకు తగిన గౌరవం కల్పిస్తోందన్నారు. గతంలో సైన్యంలోకి వెళ్లేందుకు యువత వెనుకాడేవారని, ఇప్పటి యువతలో చాలా మార్పువచ్చిందని, దేశం కోసం ఆర్మీలో చేరేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారన్నారు. కరుణాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సిన సహాయం ఇప్పటి వరకు ఇవ్వలేదని మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన సైనికుల ఆధ్వర్యంలో 15 మంది పేదలకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు. ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ నవీన్ మార్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, సర్పంచ్ పొరండ్ల రజని, ఎంపీటీసీ కవిత, జమ్మికుంట నగర పంచాయతీ చైర్మన్ రామస్వామి, ఏఎంసీ చైర్మన్ శ్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ప్రభాకర్, రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అయిలయ్య, మోహన్, సంపత్, వెంకట్‌రెడ్డి, గ్యాలంటరీ అవార్డు గ్రహీత మల్లయ్య, జవాన్లు రావుల మహేశ్, కాసూరి తిరుపతి, దువ్వ రాజు, కరుణాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
పింఛన్ దారులకు ఇబ్బంది కలగనీయం
రాష్ట్రంలో ఉద్యోగ పింఛన్ తీసుకుంటున్న 2.2 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పింఛన్ దారులు ఏటా నవంబర్‌లో ట్రెజరీ లేదా బ్యాంకుల్లో వారి జీవిత ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుందని.. ఆయా చోట్లకు రాలేని స్థితిలో ఉన్న పింఛన్ దారుల వద్దకు ప్రభుత్వ సిబ్బందే వెళ్లి సర్టిఫికెట్ తీసుకుంటారని చెప్పారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్, 108 ఉద్యోగుల వేతనాల అంశంపై సున్నం రాజయ్య (సీపీఎం), ఎన్టీఆర్ వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలం టూ రేవంత్‌రెడ్డి(టీడీపీ)లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. -
దళిత జాతిని అవమానిస్తున్న సీఎం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని పొడిగించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానపర్చారని, ఇది దళిత జాతికి జరిగిన అవ మానంగా భావిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం సూర్యాపేటలో విలేక రులతో మాట్లాడుతూ పదవీ కాలాన్నీ కేంద్రం పొడిగించలేదన్న మంత్రి ఈటల రాజేందర్ ప్రకటనపై వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఇది దద్దమ్మ ప్రకటనగా అభివర్ణించారు. సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు అంశంపై ప్రతిపక్షాలు నిలదీస్తాయని సీఎం అసెంబ్లీకి హాజరు కాలేదని ఆరోపించారు. -
కళాకారులపై వరాల జల్లు
►డిమాండ్ల పరిష్కారానికి మంత్రి చందూలాల్ హామీ ►మళ్లీ ప్రజా కళారూపాలే బెటర్ అనే రోజొస్తుంది: ఈటల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాకా రులపై సాంస్కృతిక, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ వరాల జల్లు కురిపిం చారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధుల అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాది రాష్ట్రంలోని కళాకారులందరికి గుర్తింపు కార్డులు అందజేస్తామని.. ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పి స్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిం చేందుకు కన్ సెషన్ బస్‌పాస్ లతో పాటు అన్ని పథకాల్లో భాగస్వామ్యం కల్పి స్తామని హామీ ఇచ్చారు. జానపద కళాకారుల సంఘం కోర్కెలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మయ్యేందుకు కృషి చేస్తామనని చెప్పారు. సభను ప్రారంభించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లా డుతూ.. తెలంగాణ గడ్డపై జరిగిన అనేక కార్యక్రమాలకు ఆట – పాటనే స్ఫూర్తి అన్నారు. ఎప్పటికైనా మళ్లీ ఓ రోజు ఈ సినిమాలు, సీరియల్స్ చూడలే మురా బాబు.. ప్రజాకళారూపాలే బెటర్ అని ప్రజలు ఆలోచించే రోజు వస్తుందన్నారు. వృత్తి కళాకారులకు ఉపాధి చూపించాల్సిన అవసరం ఎం తైనా ఉందని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. కళాకారులందరికి ఉద్యోగాలు సాధ్యం కాదని.. ఉపాధి కల్పించే బాధ్యత భుజాన వేసుకుంటామ న్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు డాక్టర్ కేవీ రమణాచారి, టూరిజం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. సదస్సులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం
నుమాయిష్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జి బిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పా టు చేసిన 77వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన–2017కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంత రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...మన ఉత్పత్తులకు మనమే ప్రచారం కల్పించా లన్న ఉద్దేశంతో 77 సంవత్సరాల క్రితం నుమాయిష్ ప్రారంభమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే అన్ని రకాల వస్తువులను ఈ నుమాయి ష్లో ప్రదర్శిస్తారని, ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లలోనూ ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రతి ఒక్క రూ ప్రోత్సహించాలని కోరారు. ప్రజలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తున్న నుమాయిష్‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. 45 రోజులలో రూ.100 కోట్ల వ్యాపారం చేయడమే లక్ష్యమని, వచ్చే ఆదాయంతో పేద, మధ్య తరగతి యువతకు ఉన్నత విద్యను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పటిష్ట భద్రత: ఈటల నుమాయిష్‌కు మైదానమంతా సీసీ కెమెరా లతో నిఘాపెట్టామని పోలీసులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తెలిపారు. నుమాయిష్ ను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం మొబై ల్ ఏటీఎంలను ప్రారంభించి నుమాయిష్ లో ఏర్పాటు చేసిన రైల్లో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో కలసి ఎగ్జిబిషన్‌ను సంద ర్శించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డి. రాంచందర్‌రావు, గౌరవ కార్యదర్శి ఆదిత్యా మార్గం, సంయు క్త కార్యదర్శి జి.వి. రంగారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సొసైటీ ప్రతినిధులు డి. గంగాధర్, వనం వీరేందర్, హరినాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం నిఘా
► రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ► కరీంనగర్లో బ్లూకోట్స్ బృందాలు ప్రారంభం కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కోసం బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కరీంనగర్ కమిషనరేట్‌కు కేటారుుంచిన 40 బ్లూకోట్స్ ద్విచక్ర వాహనాలను మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా తాను ఎక్కువ జీవోలు, ఎక్కువ నిధులు, సౌకర్యాలు కల్పించిన ఏకై క శాఖ పోలీస్శాఖనేనని తెలిపారు. భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుంచి పెట్టబడులు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సింగపూర్ తరహా పోలీస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కరీంనగర్ రేంజ్ ఇన్చార్జి డీఐజీ రవివర్మ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లూకోట్స్ ఏర్పాటుతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. నేరాల నియంత్రణ : సీపీ కమలాసన్‌రెడ్డి బ్లూ కోట్స్ బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బ్లూకోట్స్ బృందాల పనితీరు వివరిస్తూ.. నేరాల నియంత్రణ, ముందస్తు చర్యలు తీసుకోవడం, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 58 మంది కానిస్టేబుళ్లు, 58 మంది హోంగార్డులను కలిపి 40 బ్లూకోట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరు బ్లూ కలర్ రేడియం కోట్స్ ధరించి ప్రత్యేకంగా తయారు చేసిన బైక్‌లపై తిరుగుతూ పరిస్థితులను అదుపులో ఉంచుతారన్నారు. వీరి వెంట బైక్, వాటికి జీపీఎస్ట్రాకర్, వీడియో కెమెరా, టార్చిలైట్ ఉంటుందని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, గంగాధర, రామడుగు, చిగురుమామిడి, గన్నేరువరం, హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, కేశవపట్నం, ఇల్లందకుంట, వీణవంక పోలీస్స్టేషన్లలో వీరు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. డయల్ 100 కాల్స్‌కు సైతం స్పందించి సంఘటన ప్రాంతానికి పది నిమిషాల్లోపు చేరుకుంటారని తెలిపారు. కరీంనగర్లో 20 షీటీం బృందాలను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకూ 43 మందికి కౌన్సిలింగ్ నిర్వహించగా నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా నేరాలకు పాల్పడని 43 మంది రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్ తొలగించామని కొత్తగా 53 మందిపై రౌడీషీట్స్, సస్పెక్ట్‌షీట్స్ తెరిచినట్లు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమరుు బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఎంపీపీ వాసాల రమేశ్, ఏసీపీలు రామారావు, రవీందర్‌రెడ్డి, సి.ప్రభాకర్, ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, బ్లూకోట్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎంఆర్ నిబంధనల సడలింపు!
► పౌరసరఫరాల శాఖ అధికారుల భేటీలో మంత్రి ఈటల నిర్ణయం ► మిల్లర్లకు చివరి అవకాశం సాక్షి , హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను అత్యధికంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణ యానికి వచ్చింది. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వినియోగిస్తున్న సర్కారు వీటికి అవసరమైన వడ్లను స్టేట్ పూల్ నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందు కోసం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిబం ధనలను స్వల్పంగా సడలించాలను కుం టోంది. ఈ మేరకు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం సచివాలంయలో పౌర సరఫరాలశాఖ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణను తక్కువ సమయంలో పూర్తి చేయడానికి మిల్లర్లకు కూడా చివరి అవకాశం ఇద్దామని ఈటల ఈ భేటీలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పొరపాట్లకు తావివ్వకుండా సీఎంఆర్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. గతంలో అక్రమ దందాలకు పాల్పడిన మిల్లర్లు, రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసిన మిల్లర్లకు సంబంధించిన కేసుల తీవ్రతనుబట్టి సీఎంఆర్ కోసం ధాన్యం ఇవ్వకూడదని నిర్ణరుుంచారు. స్టాకులో తేడాలు, సీఎంఆర్ బకారుుల తది తరాలపై నమోదైన కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లకు ఈసారికి సీఎంఆర్‌లో ధాన్యం ఇవ్వాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రారం భమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించేలా, రైతులకు ధాన్యం సొమ్ము సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈటల ఆదేశిం చారు. రేషన్ షాపుల్లో ఈ-పాస్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థారుులో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉప్పు కొరత లేదని, 900 మెట్రిక్ టన్నుల ఉప్పు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యావస రాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వ్యాపా రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. -
పేదల వస్తువులపై పన్ను భారం ఉండొద్దు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయం: ఈటల సాక్షి, న్యూఢిల్లీ: పేదలు వాడే వస్తువులపై అధిక పన్ను భారం ఉండొద్దని దాదాపు అన్ని రాష్ట్రాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4వ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గకుండా ఉండే పద్ధతులు, నష్టపరిహారం అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాల్లో గతంలో 5 శాతం వ్యాట్ ఉన్న అన్ని వస్తువులపై జీఎస్టీలో యథాతథంగా 5 శాతం పన్నులు విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు.9 నుంచి 15 శాతం మధ్య పన్ను ఉన్న వస్తువులపై 12 శాతం పన్నులు వసూలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదించిందన్నారు. బంగారం, వజ్రాలు మినహా అన్ని వస్తువులపై పన్ను 5, 12, 18, 28 శాతాలుగా విధించడానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. గతంలో 40 నుంచి 45 శాతం పన్ను ఉన్న వస్తువులపై జీఎస్టీ ద్వారా 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించినందున రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని సమకూర్చేందుకు ఆ వస్తువులపై సెస్ విధించి నష్టాన్ని కొంత మేర భర్తీ చేయాలని నిర్ణయించారని చెప్పారు. పొగాకు సంబంధిత వస్తువులపై పన్ను శాతం తగ్గించాలని నిర్ణయించినందున వాటిపై కూడా సెస్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’ ఫలితాలు మొదలయ్యాయి: ఈటల
సాక్షి, హైదరాబాద్: విమర్శకుల దిమ్మ తిరిగేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదన్న విమర్శకుల నోటికి జలకళతో నిండిన మిషన్ కాకతీయ చెరువులే తాళం వేశాయన్నారు. గురువారం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగెశోభ ఆధ్వర్యంలో పలువురు రైతులు మంత్రిని కలిశారు. నారాయణపూర్ రిజర్వాయర్ పైప్‌లైన్ ద్వారా గంగాధర, రామడుగు, చొప్పదండి, కొడిమెల మండలాల్లోని 12 చెరువుల్లో నీళ్లు నింపాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈటల, ఈనెల 23న మంత్రి హరీశ్‌తో కలసి చొప్పదండికి వస్తానన్నారు. రాష్ట్ర అవతరణ ఫలితాలు మొదలయ్యాన్నారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోలు
మంత్రి ఈటల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం లెవీని రద్దు చేసినా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాలు నెలకొల్పుతోందని చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1,510, గ్రేడ్-2ధాన్యానికి రూ.1,470 కనీస మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కమిషనర్ సీవీ ఆనంద్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. అనంతరం మం త్రి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం తీసుకున్న మిల్లర్లు 45 రోజుల్లోనే బియ్యాన్ని ఇచ్చేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దాదాపు రూ.400 కోట్ల విలువైన బియ్యం రికవరీకి నోటీసులు జారీ చేశామన్నారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఈటల హెచ్చరించారు. బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టుకు తరలించే బ్రోకర్లున్నారని, మిల్లర్ల పేరుతో బ్రోకర్లుగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. రేషన్ కార్డులు బియ్యానికి మాత్రమే.. రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమేనని, స్కాలర్షిప్పులు, ఆరోగ్యశ్రీ పథకాలకు ఉద్దేశించినవి కావని ఈటల స్పష్టం చేశారు. బియ్యం అక్కర్లేనివారు కార్డులను సరెండర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ, డీలర్లకు కమీషన్ పెంపు, ఈ పాస్ మిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించినట్లు వివరించారు. -
కరీంనగర్లో ఐటీ పార్క్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం నగరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం స్థలాన్వేషణలో ఉన్నామని, నగరంలోనే ఏర్పాటుతో అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. మార్క్‌ఫెడ్ స్థలంలో ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కోరుతున్నారని, ఆ స్థలాన్ని తమకు ఎంత త్వరగా స్వాధీనపర్చితే అంత త్వరగా ఐటీ పార్కు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిగా మార్క్‌ఫెడ్‌కు వేరేప్రాంతంలో రెండింతల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ ఐటీ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీల్లోల్లో ఉద్యోగవకాశాలు కల్పన, కమ్యునికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి కరీంనగర్ సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలను ‘టాస్క్’ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. -
విడిపోతే ఏమవుతామోనని భయపడ్డాం: టీజీ
కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోతే తాము ఏమవుతామోననే భయం ఉండేదని, ఇప్పుడా భయం లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్)రాష్ట్ర తృతీయ మహాసభల్లో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు సిని మా సన్నివేశాలలాంటివన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏదైనా నష్టం జరుగుతుందని తాను సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించానని తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యూక తెలుగువాళ్లమంతా ఒక్కటేననే భావన ఏర్పడడం హర్షణీయమన్నారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం గా ముందుకు సాగుతోందని అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. సమావేశంలో ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళిగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కందిపప్పు టెండర్లపై కదిలిన సర్కార్
- తక్కువ ధరలకే కోట్ చేసేలా మిల్లర్లతో చర్చలు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు సరఫరా చేసే రాయితీ కందిపప్పు సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వచ్చే మూడు నెలల కాలానికి పప్పు సేకరణ, తక్కువ ధరకే టెండర్లు వేసేలా దాల్ మిల్లర్లతో చర్చలు ఆరంభించింది. మంగ ళవారం రాష్ట్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్, పౌర సరఫరాల శాఖ కమీషనర్ రజత్‌కుమార్‌లు దాల్ మిల్లర్లతో సచివాలయంలో చర్చలు జరిపారు. రెండు, మూడు రోజుల్లో కందిపప్పు టెండర్లు పిలువనున్న నేపథ్యంలో మంత్రి మిల్లర్లతో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంతో పోలిస్తే కంది సాగు విస్తీర్ణం పెరగడం, మార్కెట్లో ధర తగ్గిన దృష్ట్యా తక్కువ ధరలకే టెండర్ కోట్ చేసి ప్రభుత్వానికి సహకరించేలా మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. సరైన సమయానికి పప్పు అందించడంతో మిల్లర్లు విఫలమవుతున్నందున ప్రస్తుత టెండర్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నిర్నయం చేసినట్లు మంత్రి వారికి వివరించినట్లుగా తెలిసింది. ఇదే సందర్భంగా..ప్రభుత్వం నిరుపేదలకు రాయితీతో కూడిన పప్పును ఇస్తున్నందున మిల్లర్లు ప్రభుత్వానికి సరసమైన ధరకు పప్పు అందివ్వాలని కోరారు. ధర విషయంలో మిల్లర్లు ఆలోచించి నిర్ణయం చేయాలని విన్నవించారు. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోకల్ క్వాలిటీని సరఫరా చేయాలని సూచించారు. నాసిరకం పప్పును సరఫరాచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు అందాల్సిన పప్పును పక్కదారి పట్టించినా, రీ సైక్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఈటల ను నిలదీసిన పత్తిరైతులు
మంత్రి ఈటెలకు రైతుల నిరసన సెగ తగిలింది. కరీంనగర్ లో పర్యటిస్తున్న మంత్రిని పత్తి రైతులు నిలదీశారు. జమ్మికుంట మార్కెట్ యార్డుకు వచ్చిన మంత్రిని వారు ఘెరావ్ చేశారు. మా గోడు మీకు పట్టదా అంటూ నిలదీశారు. అనంతరం రైతులు ఆందోళనకు దిగారు.