అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం
నుమాయిష్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జి బిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పా టు చేసిన 77వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన–2017కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంత రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...మన ఉత్పత్తులకు మనమే ప్రచారం కల్పించా లన్న ఉద్దేశంతో 77 సంవత్సరాల క్రితం నుమాయిష్ ప్రారంభమైందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే అన్ని రకాల వస్తువులను ఈ నుమాయి ష్‌లో ప్రదర్శిస్తారని, ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లలోనూ ఆన్‌లైన్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రతి ఒక్క రూ ప్రోత్సహించాలని కోరారు. ప్రజలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తున్న నుమాయిష్‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. 45 రోజులలో రూ.100 కోట్ల వ్యాపారం చేయడమే లక్ష్యమని, వచ్చే ఆదాయంతో పేద, మధ్య తరగతి యువతకు ఉన్నత విద్యను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
పటిష్ట భద్రత: ఈటల
నుమాయిష్‌కు మైదానమంతా సీసీ కెమెరా లతో నిఘాపెట్టామని పోలీసులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తెలిపారు. నుమాయిష్ ను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం మొబై ల్ ఏటీఎంలను ప్రారంభించి నుమాయిష్ లో ఏర్పాటు చేసిన రైల్లో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో కలసి ఎగ్జిబిషన్‌ను సంద ర్శించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డి. రాంచందర్‌రావు, గౌరవ కార్యదర్శి ఆదిత్యా మార్గం, సంయు క్త కార్యదర్శి జి.వి. రంగారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సొసైటీ ప్రతినిధులు డి. గంగాధర్, వనం వీరేందర్, హరినాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.