జర్మన్‌ సమావేశానికి కేటీఆర్‌కు ఆహ్వానం | Invitation to KTR for German Conference | Sakshi
Sakshi News home page

జర్మన్‌ సమావేశానికి కేటీఆర్‌కు ఆహ్వానం

Published Mon, Feb 19 2018 1:47 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Invitation to KTR for German Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జర్మన్‌ ఏషియా పసిఫిక్‌ బిజినెస్‌ ఆసోసియేషన్‌ 98వ సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును ఆ సంస్థ ఆహ్వానించింది. జర్మనీలోని హంబర్గ్‌లో మార్చ్‌ 2న జరగనున్న ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు వివరించాలని కోరింది. ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే వ్యాపార వాణిజ్య అవకాశాలను చర్చించే ఈ సమావేశానికి సుమారు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకు లు, దౌత్యవేత్తలు హాజరవుతారని అసోసియేషన్‌ తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలుచేస్తున్న సంక్షేమ, ఆర్థిక విధానాలపై జర్మన్‌ వ్యాపార వర్గాలకు ఆసక్తి ఉందని, అందుకే ఈ అంశంపై చర్చించేందుకు తమ దేశంలోని అగ్ర వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ సమావేశంతో తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని అసోసియేషన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రత్యేక అహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement