పింఛన్ దారులకు ఇబ్బంది కలగనీయం | itala Rajinder about penssioners | Sakshi
Sakshi News home page

పింఛన్ దారులకు ఇబ్బంది కలగనీయం

Published Wed, Jan 18 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

పింఛన్ దారులకు ఇబ్బంది కలగనీయం

పింఛన్ దారులకు ఇబ్బంది కలగనీయం

రాష్ట్రంలో ఉద్యోగ పింఛన్  తీసుకుంటున్న 2.2 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడు వివేకానంద అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పింఛన్ దారులు ఏటా నవంబర్‌లో ట్రెజరీ లేదా బ్యాంకుల్లో వారి జీవిత ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుందని.. ఆయా చోట్లకు రాలేని స్థితిలో ఉన్న పింఛన్ దారుల వద్దకు ప్రభుత్వ సిబ్బందే వెళ్లి సర్టిఫికెట్‌ తీసుకుంటారని చెప్పారు.

వాయిదా తీర్మానాల తిరస్కరణ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్, 108 ఉద్యోగుల వేతనాల అంశంపై సున్నం రాజయ్య (సీపీఎం), ఎన్టీఆర్‌ వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలం టూ రేవంత్‌రెడ్డి(టీడీపీ)లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement