
కుత్బుల్లాపూర్: ఓడిపోతామనే భయం, అసహ నంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద బీజే పీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓ న్యూస్ చానల్ నిర్వహించిన ఎన్నికల చర్చలో వివేకానంద, శ్రీశైలంగౌడ్ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శ్రీశైలంగౌడ్‌ను షాపూర్‌నగర్‌లోని నివాసంలో సంజయ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ బీఆర్‌ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడు తున్నారని.. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. ’’పేరేమో వివేకానంద కానీ చేష్టలేమో ఔరంగజేబును తలపిస్తున్నా యని’ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శించారు. భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చినా పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని సంజయ్ ప్రశ్నించారు.
బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్‌కు ఎందుకు భద్రత ఇవ్వడం లేదని నిలదీశారు. వివేకానందను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment