Srisailam Goud
-
ఓటమి భయంతోనే వివేకానంద దాడి
కుత్బుల్లాపూర్: ఓడిపోతామనే భయం, అసహ నంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద బీజే పీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓ న్యూస్ చానల్ నిర్వహించిన ఎన్నికల చర్చలో వివేకానంద, శ్రీశైలంగౌడ్ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శ్రీశైలంగౌడ్ను షాపూర్‌నగర్‌లోని నివాసంలో సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడు తున్నారని.. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. ’’పేరేమో వివేకానంద కానీ చేష్టలేమో ఔరంగజేబును తలపిస్తున్నా యని’ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శించారు. భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చినా పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్‌కు ఎందుకు భద్రత ఇవ్వడం లేదని నిలదీశారు. వివేకానందను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
ఎవరికీ భయపడేది లేదు..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తూప్రాన్: ‘ఎవరేమిటో మాకు తెలుసు... భయపెట్టిస్తే భయపడం...అందరి బ్యాక్గ్రాండ్ మా వద్ద ఉంది.. నీతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో అదీ తెలుసు’ అంటూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై మండిపడ్డారు. శనివారం తూప్రాన్ మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పంచాయతీలవారీగా సీసీ రోడ్ల కోసం మంజూరైన నిధుల వివరాలను గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు వివరించారు. ఈ నిధుల ద్వారా సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. అలాగే కార్యకర్తలను కలుపుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతుండగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీశైలంగౌడ్ సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చారు. కార్యకర్తలకు న్యాయం జరుగడంలేదని, నాయకులు పట్టించుకోవడంలేదని, తమకు కూడా పార్టీ తరఫున పనులు కేటాయించాలని డిమాండ్ చేయడంతో సమావేశంలో కొద్దిగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎంపీ, శ్రీశైలంగౌడ్ను హెచ్చరించారు. వెంటనే పోలీసులు శ్రీశైలంగౌడ్‌తో పాటు టీఆర్ఎస్ నేతలను బయటకు పంపించి వేశారు. -
వైఎస్సార్సీపీకి కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా
కుత్బుల్లాపూర్,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ గుడ్‌బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీ నిర్ణయం సరిగ్గాలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే పార్టీ వీడుతున్నానని, తనకు రాజకీయగురువు ఎప్పటికీ వైఎస్ రాజశేఖర్రెడ్డియేనని స్పష్టం చేశారు. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం.