‘తెలంగాణ’ ఫలితాలు మొదలయ్యాయి: ఈటల
సాక్షి, హైదరాబాద్: విమర్శకుల దిమ్మ తిరిగేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదన్న విమర్శకుల నోటికి జలకళతో నిండిన మిషన్ కాకతీయ చెరువులే తాళం వేశాయన్నారు. గురువారం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగెశోభ ఆధ్వర్యంలో పలువురు రైతులు మంత్రిని కలిశారు.
నారాయణపూర్ రిజర్వాయర్ పైప్‌లైన్ ద్వారా గంగాధర, రామడుగు, చొప్పదండి, కొడిమెల మండలాల్లోని 12 చెరువుల్లో నీళ్లు నింపాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈటల, ఈనెల 23న మంత్రి హరీశ్‌తో కలసి చొప్పదండికి వస్తానన్నారు. రాష్ట్ర అవతరణ ఫలితాలు మొదలయ్యాన్నారు.