కరీంనగర్ జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం నగరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం స్థలాన్వేషణలో ఉన్నామని, నగరంలోనే ఏర్పాటుతో అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. మార్క్‌ఫెడ్ స్థలంలో ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కోరుతున్నారని, ఆ స్థలాన్ని తమకు ఎంత త్వరగా స్వాధీనపర్చితే అంత త్వరగా ఐటీ పార్కు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిగా మార్క్‌ఫెడ్‌కు వేరేప్రాంతంలో రెండింతల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ ఐటీ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీల్లోల్లో ఉద్యోగవకాశాలు కల్పన, కమ్యునికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి కరీంనగర్ సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలను ‘టాస్క్’ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
కరీంనగర్‌లో ఐటీ పార్క్
Published Wed, Aug 17 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
Advertisement
Advertisement