సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌లో ఐటీపార్క్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌లో అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నగర శివార్లలో ఉన్న మార్క్‌ఫెడ్ భూమి ఇందుకు అనుకూలంగా ఉంటుందని జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ స్థలాన్ని ఐటీపార్క్‌కు కేటాయించేందుకు మార్క్‌ఫెడ్ నిరాకరిస్తున్నట్టు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో ఐటీపార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇందుకోసం వివిధ చోట్ల స్థలపరిశీలన చేశారు. చివరకు సిరిసిల్ల రోడ్డులో ఉన్న పదెకరాల మార్క్‌ఫెడ్ స్థలంలో ఐటీపార్క్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని భావించారు. ఈ మే రకు జిల్లా అధికారులు 1050 సర్వే నంబర్‌లోని పదెకరాల నాలుగు గుంటల భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ ప్రతిపాదనలతోపాటు సం బంధిత అంశాలపై చర్చించేందుకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మా ర్క్‌ఫెడ్ ఈ స్థలంలో గోదాములు నిర్మించాలని భావిస్తున్నందున ఐటీ పార్క్‌కు కేటాయించడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మార్క్‌ఫెడ్ గోదాముల కోసం అవసరమైన స్థలాన్ని మరోచోట కేటాయిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చినట్టు తెలిసిం ది. ఈ స మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి టక్కర్, మార్క్‌ఫెడ్ ఎండీ దినకరబాబు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలను, మార్క్‌ఫెడ్ అభిప్రాయాలను ప్రభు త్వ ప్రధానకార్యదర్శి పరిశీలిస్తారని, ఐటీపార్క్ స్థలంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టుందని ఇన్‌చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు.
ఐటీపార్క్‌పై మరో ముందడుగు
Published Tue, Dec 3 2013 4:31 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
Advertisement
Advertisement