IT park
-
హైదరాబాద్‌లో 450 కోట్ల రూపాయలతో భారీ ఐటీ పార్క్. ఏర్పాటుకు సిద్ధమైన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ. సింగపూర్‌లో తెలంగాణ ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం
-
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
విశాఖలో ఐటీ పార్క్, అదానీ డేటా సెంటర్ కు భూమిపూజ చేసిన సీఎం జగన్
-
విశాఖలో ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు
-
క్యాపిటాల్యాండ్ చేతికి ఐటీ పార్క్
న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ ద్వారా పుణేలోని ఐటీ పార్క్‌ను కొనుగోలు చేయనున్నట్లు క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ తాజాగా పేర్కొంది. ఎకో స్పేస్ ఐటీ పార్క్ ప్రయివేట్ లిమిటె ద్వారా ఇందుకు అసెండస్ ఐటీ పార్క్(పుణే)తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ ఐటీ సెజ్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి రూ. 1,350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ సెజ్ నాలుగు భవంతులతో మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్న ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ ఆస్తిలో దాదాపు 100 శాతం ఐటీ, ఐటీ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలకు లీజ్‌కిచ్చారు. వీటిలో ఇన్ఫోసిస్, సినెక్రాన్ టెక్నాలజీస్ తదితర కంపెనీలున్నాయి. కాగా.. అసెండస్ ఐటీ పార్క్ లో క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ 78.5 శాతం వాటా, భాగస్వామి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 21.5 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకోనున్నాయి. చదవండి: ముగ్గురు పిల్లలకు.. మూడు టార్గెట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ! -
మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది, ఎగబడుతున్న జనం!
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్ స్థల కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌హెచ్–44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటూ పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు. సాక్షి, హైదరాబాద్: ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్‌గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు మళ్లుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు. కనెక్టివిటీ బాగుంది.. హైదరాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్‌వ్యాలీ, నల్సార్‌తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు. కండ్లకోయలో సైబర్ టవర్స్‌ను మించి.. పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: అదిరే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ -
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నగర శివారు మేడ్చల్ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు తొలి అడుగుపడింది. 150కి పైగా కంపెనీల స్థాపన.. శివారుల్లో ఇప్పటికే గ్రీడ్ పాలసీలో భాగంగా ఉప్పల్ జెన్‌ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు స్థాపనకు పునాది రాయి పడింది. నగరానికి ఉత్తరం వైపు కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండు పార్కుల ఏర్పాటుతో 150కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. భూ పరిహారం సైతం చెల్లింపు... గ్రేటర్‌కు తూర్పు దిశలో ఘట్కేసర్ మండలం మాదారంలో త్వరలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కానుండటంతో... జిల్లా నిరుద్యోగ యువతలో ఉపాధిపై ఆశలు చిగురించాయి. ఈ పార్కు స్థాపనకు రైతుల అంగీకారంతో 226 ఎకరాల భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం వారికి చెల్లించాల్సిన భూ పరిహారాన్ని కూడా అందజేసింది. జిల్లా పరిశ్రమల శాఖ కూడా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు అన్నీ అనుమతులు ఇప్పించింది. భూ నిధి ఎక్కువే... నగర శివారు మేడ్చల్ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూనిధి ఉంది. జిల్లా పరిధిలో 66.8 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 65 కిలోమీటర్ల రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా పారిశ్రామికాధిపతులు భావిస్తున్నారు. రహదారుల సమీపంలో దాదాపు 10వేల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 6,084 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా 5వేల ఉద్యోగాలు మేడ్చల్ జిల్లాలో కరోనా కష్టకాలం (2021–22 ఆర్థిక సంవత్సరం)లో రూ34.95 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 685 పరిశ్రమలు ఏర్పడగా, 5,536 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీంతో పరోక్షంగా జిల్లాలో వందలాది మందికి ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపనతో 1.93 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో రూ.14,762 కోట్ల పెట్టుబడులతో 8,461 సూక్ష్మ, చిన్న, మధ్యతరహ, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తద్వారా 1,93,050 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. (క్లిక్: ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..) -
ఐటీ బాట పట్టిన హైదరాబాద్: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: ముత్యాల నగరం (సిటీ ఆఫ్ పెరల్స్) ఐటీ బాట పట్టింది. మహానగరంలో గత ఏడేళ్లుగా ఐటీ, అనుంబంధ రంగ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నగరం నలుచెరుగులా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కంకణం కట్టుకోవడంతో వందలాదిగా నూతన కంపెనీలు..వేలాది కొలువులు సిటీజన్లకు వరంగా మారాయి. తాజాగా కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ పార్క్‌తోపాటు.. ఇటీవలే జెన్‌పాక్ సంస్థ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని విస్తరించిన విషయం విదితమే. ఈ సంస్థ రాకతో కేవలం ఉప్పల్ ప్రాంతంలోనే ఏకంగా 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానుండడం విశేషం. నగర ఐటీ సెక్టార్లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల కొలువులకు అదనంగా రాబోయే రోజుల్లో మరో లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని ఆశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. వేగంగా విస్తరణ.. ► నార్త్ హైదరాబాద్ కింద పరిగణించే కండ్లకోయ పరిధిలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ► ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ► వెస్ట్ హైదరాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు నూతన ఐటీ పాలసీ దోహదం చేస్తుందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ► నార్త్‌సిటీ పరిధిలో మంచి యూనివర్సిటీలు, సమీపంలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు,అర్భన్పార్క్లు ఉండడం ఈప్రాంతంలో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంది. అగ్రశ్రేణి కంపెనీలకు కేరాఫ్.. ► ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. ► అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న, పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.28 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. హై..హై..ఐటీ.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నూతన కంపెనీల వెల్లువ తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఏటా రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల మార్కును దాటుతాయని ఐటీ వర్గాలు లెక్కలు వేస్తుండడం విశేషం. -
పుట్టపర్తిలో వైఎస్సార్ ఐటీ పార్క్
-
‘కరువు జిల్లా సర్వతోముఖాభివృద్ధి’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా ముద్రబడిన పాలమూరు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా తమ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ అర్బన్ మండలం దివిటిపల్లి వద్ద ఐటీ అండ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో రూ.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. పెద్దచెరువు వద్ద నెక్లెస్‌రోడ్డు నిర్మాణానికి మరో రూ.24 కోట్లు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐటీ పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ పార్కు ఏర్పాటు పాలమూరు చరిత్రలో లిఖించదగిన రోజని పేర్కొన్నారు. ఐటీ పార్కు వల్ల ప్రత్యక్షంగా 15వేల మందికి పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం వెంటనే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అభివృద్ధి నిరోధకంగా మారిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేలా పాలమూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేలా చూడాలని కోరారు. రూ.74కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శని వారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో రూ.30 కోట్లతో 41వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలకు సంబంధించి 215పనులను ఆర్అండ్బీ చౌర స్తాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పట్టణం లో వివిధ చౌరస్తాల్లో రూ.30కోట్లతో చేపట్టనున్న నూతన నిర్మాణాలను క్లాక్‌టవర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత పెద్ద చెరువును మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ పెద్ద చెరువులో బోట్ షికారు చేశారు. పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మాణంపై ఆరాతీసిన మంత్రి పనులకు రూ.24కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భారీ బందోబస్తు జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన భారీ బందో బస్తు నిర్వహించారు. అర్అండ్బీ అతిథిగృహం చౌరస్తా, క్లాక్‌టవర్, పెద్ద చెరువు ప్రాంతాల్లో ప్రత్యే క పోలీస్ బలగాలను మోహరించారు. పట్టణ డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షించారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. 30శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించి, తెలంగాణ మొదటి పీఆర్సీ జూలై నుంచి అమలుచేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్దరించడానికి అసెంబ్లీలో తీర్మా నించి కేంద్రానికి పంపాలని, జిల్లాలో వెల్నెస్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావు, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కేటీఆర్,లక్ష్మారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ -
మంగళగిరి ఐటీ పార్కులో అగ్నిప్రమాదం
-
కరీంనగర్లో ఐటీ పార్క్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం నగరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం స్థలాన్వేషణలో ఉన్నామని, నగరంలోనే ఏర్పాటుతో అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. మార్క్‌ఫెడ్ స్థలంలో ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కోరుతున్నారని, ఆ స్థలాన్ని తమకు ఎంత త్వరగా స్వాధీనపర్చితే అంత త్వరగా ఐటీ పార్కు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిగా మార్క్‌ఫెడ్‌కు వేరేప్రాంతంలో రెండింతల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ ఐటీ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీల్లోల్లో ఉద్యోగవకాశాలు కల్పన, కమ్యునికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి కరీంనగర్ సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలను ‘టాస్క్’ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. -
చెట్టుకు విషమిచ్చి చంపారు!
చెన్నై: తమిళనాడులోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన ప్రజలు ఇప్పుడు ఓ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వారి పోరాటం ఓ మర్రి చెట్టు గురించి. వందేళ్ల మర్రిచెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది. ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దాని ఊడలు ఒక్కొక్కటిగా ఎండిపోసాగాయి. మామూలుగానైతే చెట్టు వయసైపోయిందని భావించేవారు గానీ.. దానితో అనుబంధం ఉన్న చుట్టుపక్కలవారు మాత్రం అలా భావించలేదు. దాన్ని కావాలనే విషమిచ్చి ఎండిపోయేలా చేశారని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు. ఆ చెట్టు సరిగ్గా ఓ ఐటీ పార్క్‌కు ఎదురుగా ఉండటంతో.. అది అడ్డుగా ఉందని భావించి వారే దానిపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం -
ఏపీ ఐటీ పార్కు వాటాను విక్రయించనున్న ఎల్అండ్టీ
గన్నవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీ భాగస్వామ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్కులోని తన వాటాను వేరే సంస్థకు విక్రయించేందుకు ఎల్అండ్టీ సంస్థ సిద్ధమవుతోంది. యూకే ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌లో నడుస్తున్న గ్రీన్కో గ్రూపుకు 74శాతం వాటాను విక్రయించేందుకు ఇప్పటికే ఎల్అండ్టీ ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విక్రయ ప్రక్రియ పూర్తయితే డిసెంబరునాటికి ఐటీ పార్కు గ్రీన్కో చేతులోకి వెళుతుంది. ఈ పార్కు విలువ దాదాపు రూ. 100 కోట్లు వుండవచ్చని అంచనా. కోస్తా ప్రాంతంలోని ఐటీ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి నిర్మాణంలో ఉన్న జిల్లాజైలు స్థలాన్ని ఐటీ పార్కుకు కేటాయించారు. సుమారు 30 ఎకరాల్లో ఏపీఐఐసీ 26శాతం, ఎల్అండ్టీ 74శాతం భాగస్వామ్యంతో ఐదు టవర్లతో కూడిన ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టింది. 2009లో పూర్తయిన మొదటి టవర్ మేధాలో నాలుగు సంస్థలు మాత్రమే ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాయి. తర్వాతి కాలంలో ఇక్కడ్నుంచి ఐటీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇతర సంస్థలు ముందుకురాలేదు. విజయవాడ నగరంతో పోల్చితే ఇక్కడ అద్దెలు, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండడంతోపాటు 24 గంటల రవాణా సౌకర్యం లేకపోవడం ఓ కారణం. సుమారు 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మేధా టవర్‌లో కేవలం 20వేల చ.అ. విస్తీర్ణంలో ఐటీ సంస్థలు నడుస్తున్నాయి. మిగిలిన 1.60 చ.అ. ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో ఈ ఐటీ సెజ్‌లోని తన వాటాను విక్రయించేందుకు కొంత కాలంగా ఎల్అండ్టీ సంస్థ ప్రయత్నాలు సాగిస్తోంది. స్థానిక ఐటీ పార్కుతోపాటు వైజాగ్, హైదరాబాద్‌లోని ఎల్అండ్టీకి చెందిన ఐటీ సెజ్‌ల్లోని వాటాలను కూడా విక్రయించేందుకుగ్రీన్కో గ్రూపుతో ఎల్అండ్టీ పెద్ద మొత్తంలోనే డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. -
జిల్లాలో ఐటీ పార్కు
సాక్షి, ఏలూరు : ప్రతి జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యో చిస్తోందని రాష్ర్ట సమాచార, పౌరసంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. కలెక్టరేట్లో జిల్లా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. ప్రతి శాఖకు వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని, ఉద్యోగులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం 273 సేవలు అందిస్తున్నామన్నారు. సమాచార శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని తెలిపారు. మైనార్జీ సంక్షేమ శాఖ పనితీరుపై అసంతృప్తి జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ఆయా వర్గాలకు చేరవేయడంలో ఆ శాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయకపోతే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. జిల్లాలో సుమారు 900 ఎకరాల వక్ఫ్ భూములుండగా 665 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు గుర్తించామన్నారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసి, తహసీల్దార్లతో విచారణ చేరుుంచి నెలలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. విదేశాల్లో పనిచేసే జిల్లా వాసుల వివరాల సేకరణ వివిధ దేశాల్లో పనిచేసేందుకు జిల్లా నుంచి వెళ్లిన కార్మికుల వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. దళారుల చేతుల్లో మోసపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. కొవ్వలిలో మసీదులకు సంబంధించిన భూములకు లభించే కౌలును ఇతరులు అనుభవిస్తున్నట్టు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిటీ వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ప్రజాప్రతినిధులతో మంత్రి స్థానిక జెడ్పీ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవటం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించకూడదని, ప్రజాప్రతినిధుల సిఫార్సులు పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా అని మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మంత్రి పీతల సుజాత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శాసన మండలి విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయడు, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెన్షన్ల భారం రూ.3 వేల కోట్లు పింఛను మొత్తాన్ని వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500కు పెంచటం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.3వేల కోట్ల భారం పడనుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. కోటి మంది రైతులకు ఒక్కో రైతుకు రూ.1.50 లక్షల రుణమాఫీని మూడు దశల్లో అమలు చేస్తామన్నారు. డ్వాక్రా గ్రూఫు మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.7,800 కోట్లతో రుణమాఫీతో పాటు ఇసుక రీచ్‌ల నిర్వహణను అప్పగిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ సరఫరాను గాడిన పెట్టామని, వచ్చే ఏడాది నుంచి కోతలు ఉండవని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి మొత్తం పెంచుతాం ప్రస్తుతం రూ.1 కోటి ఉన్న జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.2.50 లక్షల వరకూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా వారు వైద్య సేవలు పొందేందుకు హెల్త్ కార్డులు మం జూరు చేస్తామన్నారు. అర్హులైన పా త్రికేయులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పీఆర్వో కార్యాల యం ఏర్పాటు చేయాలని, ఏలూరు డీపీఆర్వో కార్యాలయానికి మినీ బస్, జీప్ సమకూర్చాలని పాత్రికేయులు మంత్రిని కోరారు. -
రాజయోగం
విజయవాడ : నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో వేసిన పునాది రాయి నేడు ఆంధ్ర రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. గన్నవరం ప్రాంత అభివృద్ధి కోసం 2006లో కేసరపల్లి వద్ద ఐటీ పార్కు(మేధ) నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి గన్నవరం ప్రాంతం దశ తిరిగింది. బీడు భూములు బంగారు గనులుగా మారాయి. ఇప్పుడు తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న మేధా టవర్‌లో రాష్ట్రస్థాయి కార్యాలయాలు కొన్ని కొలువుదీరనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి కార్యాలయాలు ఐటీ పార్కులో ఖాళీగా ఉన్న టవర్లలో ఏర్పాటుచేయడం వల్ల గన్నవరం ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ పార్కుకు వేసిన పునాదిరాయితో గన్నవరం ప్రాంతం దినదినాభివృద్ధి చెందిందని ప్రజలు ఆయన్ను స్మరించుకుంటున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన సెంట్రల్ జైలు నిర్మాణాన్ని నిలిపివేసి వైఎస్ ఐటీపార్కు నిర్మించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఐటీ పార్కు వల్ల వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని శంకుస్థాపన సమయంలో వైఎస్సార్ చెప్పారని, ఆయన మాటలు నిజమవుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. బంగారు గనులుగా గన్నవరం భూములు ఐటీ పార్కు ఏర్పాటుకు ముందు గన్నవరం ప్రాంతంలో భూములు తొండ గుడ్లు పెట్టేందుకు కూడా పనికిరాకుండా మరుగున పడి ఉండేవి. అయితే 2006 నుంచి భూముల విలువలు అమాంతం పెరిగాయి. గన్నవరం, కేసరపల్లి, సావారిగూడెం, కొండపావులూరు, గోపవరపుగూడెం, ముస్తాబాద, సూరంపల్లి గ్రామాల్లో భూముల ధరలు వంద రెట్లు పెరిగాయి. గన్నవరం నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు భూముల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులు తమ పొలాలను, స్థలాలను అధిక రే ట్లకు విక్రయించి అప్పుల ఊబి నుంచి బయటపడ్డామని సంబరపడుతున్నారు. -
రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్వేర్ పార్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు పార్కులున్నాయి. త్వరలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విజయవాడలో పార్కు అందుబాటులోకి రానుంది. దీని తర్వాత వైజాగ్, తిరుపతితోపాటు ఇతర నగరాల్లో పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) డెరైక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ బుధవారమిక్కడ తెలిపారు. ఇట్స్‌ఏపీ 22వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 పార్కులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని, ఇందులో విజయవాడ ఒకటని చెప్పారు. మొత్తంగా సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఎస్టీపీఐ పార్కుల్లో 10 వేల ఐటీ కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో 3,750 కంపెనీలు ఎగుమతులు చేస్తున్నాయి. 2012-13లో ఈ కంపెనీల ఎగుమతుల విలువ రూ.2.51 లక్షల కోట్లు. వృద్ధి 10 శాతముంది. ఇంటర్నెట్ ఉచితం..: వైజాగ్, కాకినాడ, విజయవాడ, వరంగల్, తిరుపతి నగరాల్లోని ఇంక్యుబేషన్ సెంటర్లలో ఏర్పాటయ్యే నూతన కంపెనీలకు ఏడాదిపాటు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఆరు నెలలపాటు అద్దె కట్టనక్కరలేదని చెప్పారు. ఆ తర్వాత ఆరు నెలల కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన అద్దెలో సగం చెల్లిస్తే చాలని పేర్కొన్నారు. కాగా, 23 విభాగాల్లో ఇట్స్‌ఏపీ అవార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ విభాగం కార్యదర్శి సంజయ్ జాజు, రిసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీష్ రెడ్డి, ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్ వి.రాజన్న మాట్లాడారు. -
ఐటీపార్క్‌పై మరో ముందడుగు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో ఐటీపార్క్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌లో అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నగర శివార్లలో ఉన్న మార్క్‌ఫెడ్ భూమి ఇందుకు అనుకూలంగా ఉంటుందని జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ స్థలాన్ని ఐటీపార్క్‌కు కేటాయించేందుకు మార్క్‌ఫెడ్ నిరాకరిస్తున్నట్టు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో ఐటీపార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇందుకోసం వివిధ చోట్ల స్థలపరిశీలన చేశారు. చివరకు సిరిసిల్ల రోడ్డులో ఉన్న పదెకరాల మార్క్‌ఫెడ్ స్థలంలో ఐటీపార్క్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని భావించారు. ఈ మే రకు జిల్లా అధికారులు 1050 సర్వే నంబర్లోని పదెకరాల నాలుగు గుంటల భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలతోపాటు సం బంధిత అంశాలపై చర్చించేందుకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మా ర్క్‌ఫెడ్ ఈ స్థలంలో గోదాములు నిర్మించాలని భావిస్తున్నందున ఐటీ పార్క్‌కు కేటాయించడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మార్క్‌ఫెడ్ గోదాముల కోసం అవసరమైన స్థలాన్ని మరోచోట కేటాయిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చినట్టు తెలిసిం ది. ఈ స మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి టక్కర్, మార్క్‌ఫెడ్ ఎండీ దినకరబాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలను, మార్క్‌ఫెడ్ అభిప్రాయాలను ప్రభు త్వ ప్రధానకార్యదర్శి పరిశీలిస్తారని, ఐటీపార్క్ స్థలంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టుందని ఇన్చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు.