సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధించాలని గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ సూచించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అధునాతన విద్యాబోధనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గురువారం ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయు లు విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. పదోతరగతిలో 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులకు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నగదు, ప్రశంసా పత్రాలు మంత్రి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment