కరువు పొంచి ఉంది: టీఆర్‌ఎస్ జిల్లా నేతలు | There have been a severe drought conditions in the district | Sakshi
Sakshi News home page

కరువు పొంచి ఉంది: టీఆర్‌ఎస్ జిల్లా నేతలు

Published Tue, Aug 26 2014 1:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కరువు పొంచి ఉంది: టీఆర్‌ఎస్ జిల్లా నేతలు - Sakshi

కరువు పొంచి ఉంది: టీఆర్‌ఎస్ జిల్లా నేతలు

సీఎంకు విన్నవించిన టీఆర్‌ఎస్ జిల్లా నేతలు

వరంగల్ : వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో కరువు నెలకొనే ప్రమాదం పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా టీఆర్‌ఎస్ నేతలు విన్నవించారు. సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎంను హైదరాబాద్‌లో సోమవారం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చందూలాల్, పార్టీ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. జిల్లాలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, దీని వల్ల రైతాంగం ఇబ్బందులపాలవుతున్నారని వివరించారు. వర్షాలు లేక ఎండుతున్నాయని, తాగునీటి సమస్య ఏర్పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement