'కొండను తవ్వి ఎలుకను పట్టారాయన' | congress leader shabbir ali slams KCR | Sakshi
Sakshi News home page

'కొండను తవ్వి ఎలుకను పట్టారాయన'

Published Thu, Apr 28 2016 2:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'కొండను తవ్వి ఎలుకను పట్టారాయన' - Sakshi

'కొండను తవ్వి ఎలుకను పట్టారాయన'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్య ఉంటే.. సీఎం కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా పార్టీ ప్లీనరీని ఘనంగా జరపడం దారుణమని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కరువు సహాయక చర్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎద్దేవా చేశారు. ప్లీనరీ ప్రజలకు భరోసా కల్పించకుండా పార్టీ కార్యకర్తలకు మాత్రం భరోసా ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ కు కాంగ్రెస్ నేతలకు కండువా కప్పే తీరిక ఉంది కానీ రాష్ట్రంలో కరువు తీర్చే తీరిక లేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement