TRS activist
-
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి.. బీజేపీ నేతల తెలంగాణ భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు. అలాగే నిజామాబాద్, ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్ నివాసాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఎంపీ నివాసంపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి సమయంలో ఎంపీ అమ్మ ఇంట్లోనే ఉన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోతున్నారనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా?
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో 'చాలు మోదీ, చంపకు మోదీ' అంటూ పలు చోట్ల బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ ఏర్పాటు చేయటం కలకలం రేపింది. యూపీ ప్రయాగ్ రాజ్ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్ పోలీస్ లైన్‌కు సమీపంలో శనివారం 'బై బై మోదీ' అంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన కోలోనెల్‌గంజ్ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్, కార్యక్రమ నిర్వహకుడు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మద్దతుదారు అది ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టయిన వారిలో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అభేయ్ కుమార్ సింగ్, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్ కేసరి, కాంట్రాక్టర్ రాజేశ్ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్ ధర్మేంద్రలుగా గుర్తించారు. కోలేనెల్‌గంజ్ డిప్యూటీ ఎస్పీ అజీత్ సింగ్ చౌహాన్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ' ప్రధాని మోదీపై వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసిన ఐదుగురిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అరెస్ట్ చేశాం. తెలంగాణలోని సికింద్రబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు ఆధ్వర్యంలో ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జులై 8-9 తేదీల మధ్య రాత్రి బెలి రోడ్డులో దీనిని ఏర్పాటు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని తెలిపారు. ఈ వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు చెప్పారు డిప్యూటీ ఎస్పీ అజిత్ సింగ్. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. జులై 7న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సైతం ఇలాంటి పోస్టర్లే వెలిచాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారయన్నారు. టీఆర్ఎస్ మద్దతుదారు సాయి.. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై ఆరా తీసినట్లు విచారణలో తేలిందన్నారు అజిత్ సింగ్. ఆయా ప్రాంతాల వివరాలు ఆర్గనైజర్ పంపించగా.. బెలి రోడ్డులో ఏర్పాటు చేయాలని, అందుకు రూ.10వేలు సైతం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాయి డైహార్డ్ ఫ్యాన్‌గా చెప్పుకొచ్చారు. ఇదీ చూడండి: టోల్గేట్ వద్ద 'ది గ్రేట్ ఖలీ' హల్చల్.. సిబ్బందిపై పంచ్‌లు! -
నాకు పదవి ఇవ్వాల్సిందే..
పంజగుట్ట(హైదరాబాద్): ‘టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. రూ.కోట్లు పార్టీ అభివృద్ధికి ఖర్చు చేశా.. కానీ ఇప్పటివరకు ఏ నాయకుడు నన్ను గుర్తించలేదు.. ఏ పదవీ ఇయ్యలేదు.. వెంటనే నాకు ఏదో ఓ పదవి ఇవ్వాలి’అని కోరుతూ టీఆర్ఎస్ నాయకుడు ఒకరు సోమవారం ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని అతన్ని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నాగపురం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ముదిరాజ్ 2001 నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. కానీ, పార్టీ నుంచి తనకు ఎలాంటి లబ్ధి చేకూరకపోగా ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12:15గం.కు ప్రగతిభవన్ ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి సాయంత్రం వరకు దీక్ష చేయడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు. -
మహిళా కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి
సాక్షి, ఖమ్మం : బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన ఘటన శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద భూపాలపల్లి జిల్లాకు చెందిన డీఎస్పీ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ కార్యాలయం చేరుకొనే సమయంలో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహాంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్నపై పుష్పగుచ్ఛంతో దాడి చేశాడు. దీంతో పుష్పగుచ్ఛం వెనుకవైపు ఉన్న కర్ర కానిస్టేబుల్ తలకు బలంగా తగలడంతో బిగ్గరగా రోదించింది. అక్కడే ఉన్న డీఎస్పీ సంపత్‌కుమార్ వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేయటంతో టూటౌన్ సీఐ గోపి అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (చదవండి: మహిళతో పరిచయం నిండు ప్రాణాన్ని బలితీసింది.) -
కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్‌రావు
-
కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి మనస్తాపం చెందిన పార్టీ కార్యకర్త స్వామి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు కొనయిపల్లికి వెళ్లి స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. అంత్యక్రియల అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని, సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. ‘టీఆర్ఎస్ కార్తకర్త మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి. సహనం కోల్పోవద్దు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందని కాపాడుకుంటుంది. రాజకీయం లో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి.. కానీ అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నాను. స్వామి చాలా చురుకైన కార్యకర్త, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడు. రాత్రి బవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త. స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుంది. ఈ రోజు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించాం. భవిష్యత్తు లో కూడా స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఎంతో భవిష్యత్ ఉంది. ఎన్నో ఎన్నికల్లో గెలిచాం. కొన్ని సందర్భాలలో ఓటమిని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ఎవ్వరు ఆందోళన చెందొద్దు. గెలిచినప్పుడు పొంగిపోవద్దు.. ఓడినప్పుడు కుంగిపోవద్దు. సమన్వయం ముదుకు వెళ్దాం’ అని హరీశ్‌రావు అన్నారు. -
మహాంకాళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
కామారెడ్డి(నిజామాబాద్): బైక్ ర్యాలీలో పాల్గొని ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మహంకాళి(55) కుటుంబాన్ని ఐటీ మంత్రి కే. తారక రామారావు పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా దొనకొండ మండలం బీబీపేటలోని మహాంకాళి ఇంటికి మంత్రి వెళ్లారు. వివరాలు..జిల్లాలో మంత్రి శనివారం చేపట్టిన బైక్ యాత్రలో మహంకాళి పాల్గొన్నాడు. ర్యాలీలో బైక్‌పై వెళ్తుండగా అతని జారీ పడ్డాడు. ఈ క్రమంలో కొన్ని బైక్‌లు అతనిపై నుంచి వెళ్లాయి. దీంతో గాయపడిన అతన్ని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం అతని అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో మంత్రి సోమవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి మహంకాళి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ తరపున రూ. 5 లక్షల ఎక్స్గ్రేషయాను మంత్రి అందించారు. -
ఎవరికీ భయపడేది లేదు..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తూప్రాన్: ‘ఎవరేమిటో మాకు తెలుసు... భయపెట్టిస్తే భయపడం...అందరి బ్యాక్గ్రాండ్ మా వద్ద ఉంది.. నీతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో అదీ తెలుసు’ అంటూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై మండిపడ్డారు. శనివారం తూప్రాన్ మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పంచాయతీలవారీగా సీసీ రోడ్ల కోసం మంజూరైన నిధుల వివరాలను గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు వివరించారు. ఈ నిధుల ద్వారా సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. అలాగే కార్యకర్తలను కలుపుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతుండగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీశైలంగౌడ్ సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చారు. కార్యకర్తలకు న్యాయం జరుగడంలేదని, నాయకులు పట్టించుకోవడంలేదని, తమకు కూడా పార్టీ తరఫున పనులు కేటాయించాలని డిమాండ్ చేయడంతో సమావేశంలో కొద్దిగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎంపీ, శ్రీశైలంగౌడ్ను హెచ్చరించారు. వెంటనే పోలీసులు శ్రీశైలంగౌడ్‌తో పాటు టీఆర్ఎస్ నేతలను బయటకు పంపించి వేశారు. -
పాత కక్షలతోనే
నూతనకల్ : చిన్నపాటి ఘర్షణ చినికి.. చినికి గాలివానలా మారి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. నూతన్‌కల్ మండలం మద్దిరాల గ్రామంలో టీడీపీ వర్గీయులచే దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. పాతకక్షలను మనసులో పెట్టుకునే ఉమేష్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన భూతం శంభయ్య, ఉమేష్‌లు తమ స్నేహితుడైన భూతం లింగరాజు ఇంట్లో మంగళవారం రాత్రి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలో లింగరాజుకు అతడి తమ్ముడు ఫోన్ చేయగా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఇంటి ఎదురుగా ఉన్న టీడీపీ కార్యకర్త భూతం వెంకన్న అలియాస్ చలం నీ ఇంట్లో ఎవరూ ఉన్నారని లింగరాజును అడిగాడు. ఉమేష్(25), శంభయ్య టీవీ చూస్తున్నారని పేర్కొన్నాడు. వారిని బయటికి పంపించాలని, లేకుం టే గొడవలు జరుగుతాయని వెంకన్న హెచ్చరిస్తూ లింగరాజు వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నాడు. దీంతో భయాందోళనకు గురైన లింగరాజు ఇంట్లోకి వెళ్లి టీవీ చూస్తున్న వారిని బయటకి పంపించాడు. ఇంటికి వెళ్తున్న శంభయ్యను భూతం లింగయ్య మరికొందరు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు వదలాయిం చుకుని పారిపోయాడు. వెనుకే ఉన్న ఉమేష్‌ను టీడీపీకి చెందిన వడ్డెనం యతిరాజారావుతో పాటు మరికొంద రు కలిసి పట్టుకున్నారు. అతడిని చర్చి సమీపంలోకి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది, మరణాయుధాలతో దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఉమేష్‌ను స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడు. వైరానికి ఆనాడే బీజం టీఆర్ఎస్ ప్రభుత్వం వైభవంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో టీడీపీ, అధికారపార్టీ కార్యకర్తల మధ్య వైరానికి బీజం పడినట్టు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను నిమజ్జనం చేసే చోట టీఆర్ఎస్ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డీజే ఏర్పాటు చేయడంతో పాటు తమ పార్టీ నేతల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వీరితో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ఫ్లెక్సీల విషయంలో గొడవపడి ఒకరి ఫ్లెక్సీని మరొకరు తొలగించుకున్నా రు. దీంతో గత అక్టోబర్ 10వ తేదీన టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ మండల నాయకుడు యతిరాజారావుపై దాడి చేశారు. ఈ కేసులో ఉమేష్ ఏ3 నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి గ్రామంలో రాజకీయ వైరం బలపడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గియులు ఉమేష్‌పై దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. జీవనోపాధికి వరంగల్‌కు.. మృతుడు ఉమేష్ జీవనోపాధి కోసం వరంగల్ జిల్లా చిన్ననాగారం గ్రామానికి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వలసవెళ్లాడు. మృతుడి మేనమామ, బావ ఆత్మకూర్ (ఎస్) మండల పాత సూర్యాపేట గ్రామం తన్నీరు ఉపేందర్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇదే క్రమంలో దసరా పండగకు వచ్చి టీడీపీ వర్గీయులతో ఘర్షణ పడి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం మద్దిరాలకు చేరుకుని హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంత్రి పరామర్శ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందిన ఉమేష్ కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఉమేష్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఘటన గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు. మృ తుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో పోలీసుల బందోబస్తు ఉమేష్ మృతితో గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి స్నేహితుడు భూతం శంభ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి సీఐ ఎం.రాజాగంగరాం పర్యవేక్షణలో ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ ఎస్కె.రషీద్ ఆధ్వర్యంలో హాలియా సీఐ పార్థసారథి, అర్వపల్లి, తిరుమలగిరి ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
కరువు పొంచి ఉంది: టీఆర్ఎస్ జిల్లా నేతలు
సీఎంకు విన్నవించిన టీఆర్ఎస్ జిల్లా నేతలు వరంగల్ : వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో కరువు నెలకొనే ప్రమాదం పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా టీఆర్ఎస్ నేతలు విన్నవించారు. సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎంను హైదరాబాద్‌లో సోమవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చందూలాల్, పార్టీ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. జిల్లాలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, దీని వల్ల రైతాంగం ఇబ్బందులపాలవుతున్నారని వివరించారు. వర్షాలు లేక ఎండుతున్నాయని, తాగునీటి సమస్య ఏర్పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
కాంగ్రెస్ నాయకుడిపై దాడి
దుర్భాషలాడుతూ కొట్టిన టీఆర్ఎస్ కార్యకర్త కోనాయమాకులలో ఉద్రిక్తత గీసుకొండ : మండలంలోని కోనాయమాకుల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల మాజీ కన్వీనర్ డోలె చిన్నిపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి 8 గంటలకు జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగింది. బాధితుల కథనం ప్రకారం.. కోనాయమాకుల లోని తన ఇంటి ముందు డోలె చిన్ని నిలబడ్డాడు. అక్కడికి గీసు కొండకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యురాలు వీరగోని కవిత భర్త రాజ్‌కుమార్ అనుచరుడు కంకనాల మల్లేశం అక్కడికి చేరుకున్నాడు. కవితను ఎంపీపీ కాకుండా చేశా చేశా వని, శాయంపేట ఎంపీటీసీ సభ్యురాలు ముంత కళావతిని టీడీపీ క్యాంపునకు తరలించావంటూ చిన్నిని దుర్భాషలాడాడు. అక్కడ ఉన్న ఇతరులు కొందరు మల్లేశంను శాంతింపజేసి పంపించారు. మళ్లీ కొంతసేపటికి వచ్చిన అతడు.. చిన్ని, అతడి కుటుంబ సభ్యు లపై దాడికి దిగాడు. దీంతో వారు గీసుకొండ సీఐ శ్రీనివాస్‌కు ఫోన్లో సమాచారం అందించారు. సీఐ అక్కడికి వచ్చేలోగానే రాజ్‌కుమార్ వచ్చి.. చిన్నిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈలోగా వచ్చిన సీఐ ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. కాగా, తన కు మల్లేశం, రాజ్‌కుమార్‌తో ప్రాణభయం ఉందని, రక్షణ కల్పిం చాలని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొన్నాల దృష్టికి... ఈ సంఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి బాధితులు వివరించిననట్లు సమా చారం. తమపై కక్ష ఎందుకు? టీఆర్ఎస్ మచ్చాపురం ఎంపీటీసీ, కొండా వర్గానికి చెందిన శా యంపేట ఎంపీటీసీని టీడీపీ వారు క్యాంపునకు తీసుకెళ్తే.. తమపై దాడి చేయడం ఏమిటని డోలె చిన్ని ప్రశ్నించారు. శాయం పేట ఎంపీటీసీ భర్త ముంత రాజయ్య ఎక్కడున్నాడో చెప్పాలని టీఆర్ఎస్ నాయకుడొకరు తనకు ఫోన్ చేశారని, తెలియదని స్పష్టం చేశానని చెప్పారు. రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి.. తన అను చరుడే నాపై దాడి చేశాడని చెబితే.. సంబంధం లేదని చెప్పి తిరిగి తనను దుర్భాషలాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇరుపక్షాల ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.