
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు. అలాగే నిజామాబాద్, ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్ నివాసాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.
కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్‌ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఎంపీ నివాసంపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి సమయంలో ఎంపీ అమ్మ ఇంట్లోనే ఉన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోతున్నారనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment