మహాంకాళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ | ktr Visitation to mahankalies family | Sakshi
Sakshi News home page

మహాంకాళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

Published Mon, Feb 23 2015 8:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

మహాంకాళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

మహాంకాళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

కామారెడ్డి(నిజామాబాద్): బైక్ ర్యాలీలో పాల్గొని ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త మహంకాళి(55) కుటుంబాన్ని ఐటీ మంత్రి కే. తారక రామారావు పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా దొనకొండ మండలం బీబీపేటలోని మహాంకాళి ఇంటికి మంత్రి వెళ్లారు. వివరాలు..జిల్లాలో మంత్రి శనివారం చేపట్టిన బైక్ యాత్రలో మహంకాళి పాల్గొన్నాడు. ర్యాలీలో బైక్‌పై వెళ్తుండగా అతని జారీ పడ్డాడు. ఈ క్రమంలో కొన్ని బైక్‌లు అతనిపై నుంచి వెళ్లాయి. దీంతో గాయపడిన అతన్ని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం అతని అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో మంత్రి సోమవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి మహంకాళి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషయాను మంత్రి అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement