- దుర్భాషలాడుతూ కొట్టిన టీఆర్‌ఎస్ కార్యకర్త
- కోనాయమాకులలో ఉద్రిక్తత
గీసుకొండ : మండలంలోని కోనాయమాకుల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల మాజీ కన్వీనర్ డోలె చిన్నిపై టీఆర్‌ఎస్ కార్యకర్త దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి 8 గంటలకు జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగింది. బాధితుల కథనం ప్రకారం.. కోనాయమాకుల లోని తన ఇంటి ముందు డోలె చిన్ని నిలబడ్డాడు.
అక్కడికి గీసు కొండకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యురాలు వీరగోని కవిత భర్త రాజ్‌కుమార్ అనుచరుడు కంకనాల మల్లేశం అక్కడికి చేరుకున్నాడు. కవితను ఎంపీపీ కాకుండా చేశా చేశా వని, శాయంపేట ఎంపీటీసీ సభ్యురాలు ముంత కళావతిని టీడీపీ క్యాంపునకు తరలించావంటూ చిన్నిని దుర్భాషలాడాడు.
అక్కడ ఉన్న ఇతరులు కొందరు మల్లేశంను శాంతింపజేసి పంపించారు. మళ్లీ కొంతసేపటికి వచ్చిన అతడు.. చిన్ని, అతడి కుటుంబ సభ్యు లపై దాడికి దిగాడు. దీంతో వారు గీసుకొండ సీఐ శ్రీనివాస్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. సీఐ అక్కడికి వచ్చేలోగానే రాజ్‌కుమార్ వచ్చి.. చిన్నిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈలోగా వచ్చిన సీఐ ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. కాగా, తన కు మల్లేశం, రాజ్‌కుమార్‌తో ప్రాణభయం ఉందని, రక్షణ కల్పిం చాలని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పొన్నాల దృష్టికి...
ఈ సంఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి బాధితులు వివరించిననట్లు సమా చారం.
తమపై కక్ష ఎందుకు?
టీఆర్‌ఎస్ మచ్చాపురం ఎంపీటీసీ, కొండా వర్గానికి చెందిన శా యంపేట ఎంపీటీసీని టీడీపీ వారు క్యాంపునకు తీసుకెళ్తే.. తమపై దాడి చేయడం ఏమిటని డోలె చిన్ని ప్రశ్నించారు. శాయం పేట ఎంపీటీసీ భర్త ముంత రాజయ్య ఎక్కడున్నాడో చెప్పాలని టీఆర్‌ఎస్ నాయకుడొకరు తనకు ఫోన్ చేశారని, తెలియదని స్పష్టం చేశానని చెప్పారు. రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి.. తన అను చరుడే నాపై దాడి చేశాడని చెబితే.. సంబంధం లేదని చెప్పి తిరిగి తనను దుర్భాషలాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇరుపక్షాల ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.