హిమాచల్: బీజేపీ నేత, ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం(హిమాచల్ ప్రదేశ్)లో ఆర్థికపరమైన సంక్షోభం నెలకొన్నదని ఆమె ఆరోపించారు. దీనిని దేశమంతా గమనిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పైనుంచి డబ్బులు వచ్చేవని, అవి సోనియా రిలీఫ్ ఫండ్‌కు చేరేవని కంగనా ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకల పేర్లను ప్రస్తావించకుండా వారి బాల్యం అద్భుతంగా గడిచిందని కంగనా పేర్కొన్నారు. అయితే తన బాల్యాన్ని 15 సంవత్సరాల వయస్సులోనే లాక్కున్నారని, చిన్నప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించానని తెలిపారు. తాను కాలేజీ వయసులో ఉన్నప్పుడు తన వయసులోని అమ్మాయిలు ప్రేమలేఖలు రాసుకునేవారని, తాను మాత్రం స్క్రిప్ట్‌లు రాయడం ప్రారంభించానని కంగనా పేర్కొన్నారు.
వారి బాల్యం (రాహుల్, ప్రియాంక) 50 ఏళ్లు కొనసాగుతుందని, తన బాల్యం 15 ఏళ్లు కూడా కొనసాగలేదని కంగనా వాపోయారు. నాటి రోజుల్లోనే తాను దేశ క్షేమం కోసం ఆలోచించడం ప్రారంభించానని అన్నారు. మండి జిల్లాలోని గోహర్‌కు వచ్చిన ఆమె.. తాను తుక్డే గ్యాంగ్‌తో ఒంటరిగా పోరాడిన విషయం అందరికీ తెలుసన్నారు. తాను కష్టాలను భరిస్తూ, దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంటానని, దేశంలోని ఆడపిల్లల రక్షణ కోసం మాట్లాడతానని కంగనా పేర్కొన్నారు.
ఇది కూడా చడవండి: యాచకులను నియంత్రించండి.. పాక్‌కు సౌదీ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment