కాంగ్రెస్‌VSబీఆర్‌ఎస్‌..సిద్దిపేటలో హైటెన్షన్‌ | Harishrao Tweet On His Camp Office Attacked By Congress Workers | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌VSబీఆర్‌ఎస్‌..సిద్దిపేటలో హైటెన్షన్‌

Aug 17 2024 9:37 AM | Updated on Aug 17 2024 12:18 PM

Harishrao Tweet On His Camp Office Attacked By Congress Workers

సాక్షి,హైదరాబాద్‌: సిద్దిపేట పట్టణంలో శనివారం(ఆగస్టు17) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు ఆఫీసుపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. దాడిని నిరసిస్తూ క్యాంప్‌ఆఫీస్‌ముందు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. 

హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చింపివేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పోటీగా నగరంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి.  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీసింది.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీస్తోంది. దీంతో పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్‌..

తన సిద్దిపేట క్యాంప్‌ఆఫీస్‌పై శుక్రవారం(ఆగస్టు16) అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement