MLA Camp Office
-
కాంగ్రెస్VSబీఆర్ఎస్..సిద్దిపేటలో హైటెన్షన్
సాక్షి,హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలో శనివారం(ఆగస్టు17) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు ఆఫీసుపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. దాడిని నిరసిస్తూ క్యాంప్‌ఆఫీస్‌ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపివేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీసింది.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీస్తోంది. దీంతో పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్..తన సిద్దిపేట క్యాంప్‌ఆఫీస్‌పై శుక్రవారం(ఆగస్టు16) అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ లో వింత శబ్దాలు
-
‘రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ’
సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో త్వరలోనే రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ స్థాపించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జిల్లాలో 28 ఎకరాల్లో యాంటీ క్యాన్సర్ మిర్చిని పండించేందుకు ప్రభుత్వ భూమి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ పండే మిర్చిని క్యాన్సర్ నిరోధక ముందుల్లో ఉపయోగిస్తారని తెలిపారు. శుక్రవారమిక్కడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... మహబూబాబాద్ ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉండేదని..సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రస్తుతం జిల్లా స్థాయికి చేరిందన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తాము మాత్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, సీఎంను ఒప్పించి మరిన్ని నిధులు జిల్లాకు తీసుకువస్తామని తెలిపారు. ‘మహబూబాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతా. కూరగాయల మార్కెట్ ప్రత్యేకంగా నిర్మించుకుందాం. అదే విధంగా మెడికల్ కాలేజీ, నూతన ఆస్పత్రి నిర్మిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోంది. మరో నెల రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపుదల చేసి అందిస్తున్నాం. 57 ఏండ్ల వయోపరిమితి గల వారికి కూడా వచ్చే నెల నుంచి పెన్షన్ అందిస్తాం. పార్టీలో పని చేసిన, చేస్తున్న సీనియర్ నాయకులను టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అదుకుంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
నిర్లక్ష్యం
సాక్షి, మెదక్ : పొరుగు జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తి కావచ్చాయి. మెదక్ జిల్లాలో మాత్రం క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ జిల్లాలో ఉన్నదే రెండు నియోజకవర్గాలు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూ ర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయిం చడంలో ఆర్‌ఆండ్‌బీ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు బహిరంగగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నియోజకవర్గ కేం ద్రాల్లో జీప్లస్ వన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. 2016లో ఒక్కో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయిం చింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేలను కలిసేందుకు వీలుగా క్యాంపు కార్యాలయాలను డిజైన్ చేయించారు. ఈ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక చాంబర్‌తోపాటు నాలుగు గదులు, హాల్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మించనున్నారు. ప్రభుత్వం మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి 2016 డిసెంబర్ నెలలో నిధులు కేటాయించింది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలు సందర్భాల్లో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంకా పిల్లర్ల దశలోనే.. డిప్యూటీ స్పీకర్ నివాసం మెదక్ పట్టణంలో ఉంది. నియోజకవర్గ ప్రజలను ఆమె ప్రస్తుతం అక్కడే కలుస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారితో సమావేశమయ్యేందుకు అనువైన వసతులు అక్కడ లేవు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం త్వరగా పూర్తయితే అక్కడే అధికారులు, ప్రజలను కలవవచ్చని ఆమె భావిస్తున్నారు. అయితే క్యాంపు ఆఫీసు నిర్మాణం పనులు ఎంతకూ పూర్తి కాలేదు. పట్టణ ప్రధాన రహదారి పక్కన ఫారెస్టు రేంజ్ ఆఫీస్ సమీపంలో ఈ క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉన్నాయి. పనులు పూర్తి అయ్యేందుకు మరో 8 నెలలకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటివరకు ఎన్నికలు వస్తే నిర్మా ణం పనులు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. నర్సాపూర్‌లో పూర్తి కాని పనులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులు సైతం ఇంకా పూర్తి కాలేదు. నర్సాపూర్‌లోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఎంపీపీ ఇంటి నిర్మాణం చేపడుతుండగా ఆ భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆసక్తి చూపారు. దీంతో ఆర్అండ్బీ అధికారులు ఎంపీపీ క్వార్టర్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనంగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. మొత్తం రూ.70 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
⇒ రాష్ట్రంలో మొదటిది ప్రారంభించిన తుమ్మల ⇒ హాజరైన కడియం, చందూలాల్ పరకాల: రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తో ఈ క్యాంపు కార్యాలయాలను నిర్మించా రు. కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రద్ధ తీసుకొని రూ.69 లక్షల ఖర్చుతో నివాసం, కార్యాలయ భవన పనులను ఐదు నెలల్లోనే పూర్తి చేయించారు. 2,800 గజాల స్థలంలోని 4,530 చదరపు అడుగుల్లో అధునాతన సౌకర్యాలతో భవనా న్ని రెండంతస్తుల్లో నిర్మించారు. కార్యక్ర మంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మదుసుదనాచారి, పర్యాటక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం బాగుందని కొనియా డారు. ఇలాంటి భవనాలనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యాలకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెలు, మేకల పెంపకదారుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోటితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలోని తహశీల్దార్ గెస్ట్‌హౌస్ భవనం.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మారబోతోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక కాలేజీ రోడ్డులోని 1.20 ఎకరాల స్థలంలో ఉన్న పురాతన తహసీల్దారు గెస్ట్‌హౌస్‌ను నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ శిథిల భవనాన్ని కూలగొట్టి రూ.కోటితో కొత్తగా డబుల్ ఫ్లోర్ భవనం నిర్మించనున్నారు. ఈ మేరకు ఉన్నత అధికారులకు నివేదిక పంపారు. రెండు మూడు నెలల్లో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు సోమావారం తెలిపారు.