రూ.కోటితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం | MLA Camp office to construct in Jogipet | Sakshi
Sakshi News home page

రూ.కోటితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

Published Mon, Jun 20 2016 4:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

MLA Camp office to construct in Jogipet

జోగిపేట (మెదక్) :  మెదక్ జిల్లా జోగిపేటలోని తహశీల్దార్ గెస్ట్‌హౌస్ భవనం.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మారబోతోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక కాలేజీ రోడ్డులోని 1.20 ఎకరాల స్థలంలో ఉన్న పురాతన తహసీల్దారు గెస్ట్‌హౌస్‌ను నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ శిథిల భవనాన్ని కూలగొట్టి రూ.కోటితో కొత్తగా డబుల్ ఫ్లోర్ భవనం నిర్మించనున్నారు. ఈ మేరకు ఉన్నత అధికారులకు నివేదిక పంపారు. రెండు మూడు నెలల్లో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు సోమావారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement