జోగిపేట ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే.. | Case Has Been Registered Against Oxford School In Jogipet | Sakshi
Sakshi News home page

జోగిపేట ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే..

Published Sun, Jun 25 2023 10:52 AM | Last Updated on Sun, Jun 25 2023 10:52 AM

Case Has Been Registered Against Oxford School In Jogipet - Sakshi

సాక్షి, సంగారెడ్డి: జోగిపేటలోని ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌పై కేసు నమోదు అయ్యింది. ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో అధిక ఫీజులు, బుక్స్‌ విక్రయిస్తున్నారని డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విద్యార్థి స​ంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేశాయి. 

ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాలలో ఎంఈవో కృష్ణ ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే, స్కూల్‌ను తనిఖీ చేయడానికి వచ్చిన ఎంఈవోతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో స్కూల్‌ నిర్వాహకుడు వేణుపై ఎంఈవో జోగిపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్‌.. ఆ 70 మంది పరిస్థితేంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement