Oxford
-
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, సంగారెడ్డి: జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు అయ్యింది. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజులు, బుక్స్ విక్రయిస్తున్నారని డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విద్యార్థి సంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాలలో ఎంఈవో కృష్ణ ఆక్స్ఫర్డ్ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, స్కూల్‌ను తనిఖీ చేయడానికి వచ్చిన ఎంఈవోతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో స్కూల్ నిర్వాహకుడు వేణుపై ఎంఈవో జోగిపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
కరోనా దెబ్బకు తగ్గిన జీడీపీ వృద్ది రేటు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2021 వృద్ధి విషయంలో తొలి అంచనాలకు కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ వరుసలో ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణ సంస్థ-ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ చేరింది. 2021లో భారత్ స్థూల దేశీయోత్పత్తి 10.2 శాతానికి పరిమితం అవుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. క్రితం అంచనాలు 11.8 శాతాన్ని ఈ మేరకు దిగువముఖంగా సవరిస్తున్నట్లు తెలిపింది. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో దేశంలో పెరిగిన వైద్య సంబంధ సవాళ్లు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగకపోవడం, మహమ్మారి కరోనా నియంత్రణలో ప్రభుత్వ వ్యూహంలో లోపాలు తమ తాజా అంచనాల సవరణకు కారణమని వివరించింది. ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ పేర్కొన్న మరిన్ని విశేషాలు చూస్తే... భారత్ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్‌లేని పరిస్థితి నెలకొంది. స్వల్ప కాలంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి పది రోజులకూ మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. మరి కొన్ని సంస్థల అంచనాలు... అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 2021లో భారత్ వృద్ధిని 12.5 శాతం వరకూ అంచనావేస్తోంది. ఏప్రిల్ నుంచీ ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా 10.5 శాతంగా ఉంది. 2020–21 ఎకనమిక్ సర్వే 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 11 శాతంగా పేర్కొంది. సెకండ్‌వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆయా అంచనాల వృద్ధి సవరణ కూడా చోటుచేసుకునే వీలుంది. 10 శాతంలోపే వృద్ధి! కోవిడ్ 19 తాజా కేసుల పెరుగుదల, ఫలితంగా స్థానిక లాక్డౌన్ల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 10 శాతం దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వ చర్యలు, ప్రజల ప్రతిస్పందనల ఆధారంగా వ్యవస్థలో డిమాండ్, సరఫరాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. 2020 దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పోలి్చతే రాష్ట్రాల తాజా ఆంక్షల వల్ల వ్యవసాయం, మైనింగ్, తయారీ, యుటిలిటీ, నిర్మాణ రంగాలపై కొంత తక్కువ ప్రభావమే ఉండే వీలుంది. - ఎస్సీ గార్గ్, మాజీ ఫైనాన్స్ కార్యదర్శి నెల లాక్‌డౌన్‌తో జీడీపీకి 2 శాతం నష్టం స్థానిక లాక్డౌన్ల వల్ల మహమ్మారి కరోనా కట్టడి అనుకున్నంత స్థాయిలో జరక్కపోవచ్చు. సెకండ్‌వేవ్ కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీకి 100 నుంచి 200 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఎకానమీకి భారీ నష్టం వాటిల్లే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్లు విధించకపోవచ్చు. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం మే, జూన్ నెలల్లో ఉచిత ఆహార ధాన్యాల సరఫరా వంటి సహాయక చర్యలను ముమ్మరం చేసే వీలుంది. - ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్థా గడ్వానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్-భారత్ ఆర్థికవేత్తలు చదవండి: వేతన జీవులూ.. జర జాగ్రత్త! -
వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకం
న్యూఢిల్లీ: వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకమని.. పెరిగిపోతున్న కరోనా కేసులు ఆర్థిక రికవరీకి సవాళ్లను తీసుకురావచ్చని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేసింది. ఇప్పటి వరకు చూస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగానే ఉందంటూ.. అయినప్పటికీ భారత విధాన కర్తలు నిర్లక్ష్యానికి ఏ కొంచెం కూడా అవకాశం ఇవ్వరాదని పేర్కొంది. కఠిన లాక్డౌన్లను విధించే విషయంలో రాష్ట్రాలు పునరాలోచిస్తుండడడంతో ఆర్థిక ప్రభావం గతేడాది ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి కావాల్సిన స్థాయిలో భారత్‌లో టీకాల కార్యక్రమం నడవడం లేదని అభిప్రాయపడింది. ఆరోగ్య పరిస్థితులు మరింత దారుణంగా మారి, కఠినమైన నియంత్రణలను అమలైతే కనుక 2021 సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థపై తమ అంచనాలు ప్రభావితం కావొచ్చని పేర్కొంది. -
ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి
లండన్: యూకేలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది. మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమందిలో ఏదో ఒక దుష్ప్రభావం కనిపించడం సాధారణంగా జరిగేదేనని ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, నిర్భయంగా అందరూ టీకా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. రక్తం గడ్డ కట్టే సమస్య కేవలం ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చిందా లేదా వారిలో మరేమైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుపుతోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లోని పుణేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో భారత్‌లో ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు కనిపించలేదు. -
ఆధార్, నారీ శక్తి, సంవాద్.. ఇప్పుడు ఆత్మనిర్భరత
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. దీని ప్రభావంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకులాయి. దీంతో అన్ని దేశాల్లోలాగానే భారత్‌లో ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం కోవిడ్–19 రికవరీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజిపై ప్రధాని మోడీ ప్రసంగింస్తూ..‘ఆత్మనిర్భరత’ అనే పదాన్ని నొక్కిపలికారు. అప్పటినుంచి ఈ పదం జనం నోళ్లలో తెగ నానుతోంది. ఇది గుర్తించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంగ్వేజ్ నిపుణుల సలహా ప్యానల్ ఆత్మనిర్భరత పదాన్ని హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్–2020గా ఎంపిక చేసింది. ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ లేదా స్వావలంబన (స్వయం ప్రతిపత్తి) అని అర్థం. ఏటా బాగా ప్రాచుర్యం పొందిన, కొత్తగా వాడుకలోకి వచ్చిన పదాలను ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తుంది. తాజాగా ఆక్స్ఫర్డ్ హిందీ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్–2020 పదంగా ‘ఆత్మనిర్భరత’ను ప్రకటించింది. ఆత్మనిర్భరత అనేది కేవలం పదం మాత్రమే కాదని, గతేడాది దేశ నైతిక, మానసిక స్థైర్యాన్ని ప్రతిబించిందని ప్యానెల్ వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోని కోట్ల మంది ప్రజలు కొత్త కొత్త జీవన విధానాలను అలవర్చుకోవాల్సి వచ్చింది. 2020కి ముందు కన్నా ఇప్పుడు వ్యక్తిగత స్వాలంబన పెరిగింది. ఆన్లైన్ క్లాస్‌లు, వర్క్‌ఫ్రం హోం, ఆరోగ్యంపై శ్రద్ధ, సొంతంగా వంట చేసుకుని రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టిమళ్లడం, ఇంట్లో పనులను అందరూ కలిసి చేయడం, ఇంట్లోని ఆత్మీయుల కోసం సమయం కేటాయించడం వంటి అనేక అంశాల్లో సెల్ఫ్ రిలయన్స్ బాగా పెరిగిందని లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ క్రితికా అగర్వాల్ చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా బయోటెక్నాలజీ విభాగం ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారాన్ని హైలెట్ చేస్తూ..కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను రాజ్‌పథ్‌లో శకటాల ప్రదర్శనలో ఉంచింది. దీని ద్వారా కూడా ఆత్మనిర్భరతకు మరింత గుర్తింపు వచ్చింది. కాగా హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గతంలో ఆధార్ (2017), నారీ శక్తి(2018), సంవిధాన్(2019)లు ఎంపికయ్యాయి. -
కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) మెడికల్ సూపరింటెండెంట్‌ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని పేర్కొంది. ఆర్ఎంఎల్లో కోవిషీల్డ్ కాకుండా కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కోవాగ్జిన్ విషయంలో అన్ని ట్రయల్స్ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్ విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తయ్యాయని గుర్తుచేసింది. కోవాగ్జిన్‌తో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్లనే దుష్భ్రభావాలు తలెత్తినట్లు తేలితే దాని తయారీదారు భారత్ బయోటెక్ నష్టపరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. -
హైదరాబాద్ టీకాకు ఓకే
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్సీఓ(కేంద్ర ఔషధాల ప్రమాణిక నియంత్రణ సంస్థ) నియమించిన నిపుణుల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. టీకాకు సంబంధించి కంపెనీ సమర్పించిన ట్రయిల్స్ డేటాను పరిశీలించిన అనంతరం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ టీకా భారత్‌లో వినియోగానికి ఆమోదముద్ర సంపాదించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కోవాగ్జిన్ రెండు దశల ట్రయిల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండిటిలో సత్ఫలితాలు వచ్చినందున టీకా అత్యవసర వినియోగానికి నిపుణులు అంగీకారం తెలిపారు. ఫేజ్3 ట్రయిల్స్ కొనసాగించమని సూచించారు. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ ఈ టీకాను రూపొందించింది. కోవాగ్జిన్ వినియోగానుమతుల కోసం భారత్ బయోటెక్ గతనెల 7న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్ వినియోగంపై డీసీజీఐ అంతిమ ఆమోదం తెలపాల్సిఉంది. మరోవైపు కాడిలా రూపొందిస్తున్న టీకాపై ఫేజ్ 3 ట్రయిల్స్ జరపవచ్చని కూడా నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. తర్వాతేంటి? టీకాల వినియోగానికి డీసీజీఐ పచ్చజండా చూపిన అనంతరం ఆయా కంపెనీలు తమ టీకాను మార్కెట్లో ఆథరైజ్ చేసేందుకు, భారీగా ఉత్పత్తి చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాతే మార్కెట్లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది. ఒక వ్యాధికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు కొన్ని ఔషధాలు లేదా టీకాల అత్యవసర వినియోగం కోసం ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కరోనాకు సరైన చికిత్స లేకపోవడం, మరోవైపు కొత్త స్ట్రెయిన్ గుర్తింపు నేపథ్యంలో ఆయా దేశాలు కోవిడ్ టీకాలకు అత్యవసర అనుమతులు ఇస్తున్నాయి. ఇలాంటి అత్యవసర అనుమతులు పొందిన వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకుంటారు. అలాగే సదరు టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందుగానే వివరిస్తారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు. అతి త్వరలో ముందుగా నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో టీకాను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఆదివారం రోజు డీసీజీఐ పత్రికా సమావేశం నిర్వహించనుంది. ఇందులో టీకాల అనుమతిపై వెల్లడించే అవకాశం ఉంది. -
కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశంలో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతి నిచ్చింది. పంపిణీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉందిని భావిస్తున్నారు. (గుబులు రేపుతున్న కొత్త కరోనా, ఎన్ని కేసులంటే) దేశంలో పంపిణీకిగాను దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ 30 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధం చేస్తోంది. భారత్‌లో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించను న్నామని సీరం ఇప్పటికే ప్రకటించింది.మరో పక్క దేశంలో యూకేకు చెందిన కొత్త కరోనా వేరియంట్ స్ట్రెయిన్ ఉనికి ఆందోళన రేపుతోంది. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కొత్త వైరస్ బాధితుల సంఖ్య 29కి చేరింది. అటు కొత్త వేరియంట్‌ను కూడా ఎదుర్కొనే సామర్ధ్యం తమ టీకాకు ఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
2 డోసుల వ్యాక్సిన్ రూ. 1,000కే!
ముంబై, సాక్షి: వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ దేశీయంగా అందరికీ అందుబాటులోకి రాగలదని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరికల్లా తొలుత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న కార్యకర్తలకు అందించనున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పూనావాలా తెలియజేశారు. ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలందరికి విక్రయించే వీలున్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులు, తుది క్లినికల్ పరీక్షల ఫలితాలు ఆధారంగా రెండు డోసేజీల ఈ వ్యాక్సిన్ గరిష్టంగా రూ. 1,000 ధరలోనే లభించే వీలున్నట్లు తెలియజేశారు. వెరసి 2024కల్లా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధానంగా సరఫరా సమస్యలు, బడ్జెట్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, ప్రజల ఆసక్తి వంటి అంశాలు ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. ఈ అంశాల నేపథ్యంలో 2024కల్లా దేశంలోని 80-90 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ లభించవచ్చని అంచనా వేశారు. వ్యాక్సిన్ తయారీపై ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకాతో ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. కారు చౌకగా.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందిస్తూ.. 5-6 డాలర్ల స్థాయిలో వెలువడవచ్చని హెల్త్‌కేర్ రంగ దేశీ కంపెనీ సీరమ్ సీఈవో పూనావాలా చెప్పారు. దీంతో దేశీయంగా రెండు డోసుల వ్యాక్సిన్ రూ. 1,000 గరిష్ట ధరలో లభించవచ్చని తెలియజేశారు. నిజానికి దేశీ ప్రభుత్వం వ్యాక్సిన్లను భారీ పరిమాణంలో కొనుగోలు చేయనుండటంతో ఇంతకంటే తక్కువ ధరలోనూ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే 3-4 డాలర్లకు సైతం ప్రభుత్వం వ్యాక్సిన్లను సమకూర్చుకునే వీలున్నదని వివరించారు. ఇది కోవాక్స్ ధరలకు సమానమని చెప్పారు. నేడు వినిపిస్తున్న పలు ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కారు చౌకగా వ్యాక్సిన్లను అందించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పెద్దవయసు వారిలోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. యువతతోపాటు, వయసుమీరిన వారిలోనూ ఒకేస్థాయిలో టీసెల్స్, రోగనిరోధక శక్తి పెంపు వంటివి వ్యాక్సిన్ ద్వారా కనిపించినట్లు తెలియజేశారు. అనుమతులు లభించాక ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు యూకే, యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థల నుంచి ఎమర్జెన్సీ అనుమతులు లభిస్తే.. దేశీయంగానూ వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు పూనావాలా తెలియజేశారు. అయితే అత్యవసర అనుమతి ద్వారా హెల్త్‌కేర్ నిపుణులు, వర్కర్లు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే వ్యాక్సిన్లను అందించే వీలున్నట్లు వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో భద్రపరచవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల డోసేజీల తయారీపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా జులైకల్లా 40 కోట్ల డోసేజీలు అవసరమవుతాయని అంచనా వేశారు. -
ఆక్స్ఫర్డ్ టీకా.. అందరికీ కష్టమే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో నిర్దిష్టమైన అంచనాల్లేవు కానీ... ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్ని దేశాలకు ఎన్ని డోసులు అవసరమవుతాయి, ఎన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ ముందే కొనుగోలు చేసుకుంటాయి, ఎన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ కూడా దొరక్క అవస్థలు పడతాయన్న దానిపై మాత్రం అంచనాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డు (జీపీఎంబీ) ఇచ్చిన నివేదిక ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా మొత్తం తయారయిన వ్యాక్సిన్ డోసుల్లో కేవలం 12 శాతం మాత్రమే 50 శాతం ప్రపంచానికి అందుబాటులో ఉంటాయట. ప్రపంచంలోని ఐదారు దేశాలు మిగతా 88 శాతం డోసులు కొనుగోలు చేసేస్తాయట. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలతో ఆయా దేశాలు ఒప్పందాలు కూడా చేసేసుకున్నాయని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది. భారత్‌కే ఎక్కువ జీపీఎంబీ నివేదిక ప్రకారం తొలిదశలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే కోవ్యాక్స్ (భారత్‌లో ఆక్స్ఫర్డ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో విడుదల చేస్తారు) డోసుల్లో సింహభాగం భారతదేశానికి అవసరపడుతాయి. ఎంతగా అంటే మొత్తం తయారయ్యే వ్యాక్సిన్లలో 41శాతం డోసులు మనం కొనుగోలు చేసి సమకూర్చుకోవాల్సిందే. ఈ మేరకు భారత్‌తో పాటు పలు దేశాలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత్ తర్వాత యూరోపియన్ యూనియన్, ఆ తర్వాత అమెరికా, చైనా, బ్రెజిల్, యూకే, ఆస్ట్రేలియా దేశాలు... ఎక్కువ డోసులు అవసరమయ్యే, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం ఈ ఆరు దేశాలు, ఈయూ కలిపి మొత్తం తయారయ్యే వ్యాక్సిన్ డోసుల్లో 88 శాతం తీసుకుంటే, ఇక మిగిలిన 50 శాతం ప్రపంచానికి అందుబాటు లో ఉండేది 12 శాతమేనంట. ఇదే నిజమైతే కోవిడ్ మహమ్మారిని అంతం చేయడం జరిగే పనికాదని, వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చుకోలేని దేశాల్లో ఇది మరింత ప్రబలి వ్యాక్సిన్లు సమకూర్చుకున్న దేశాలపైనా ప్రభావం చూపుతుందని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది. అందుకే తాము కోవ్యాక్స్ పేరుతో ప్రపంచంలోని పేద, మధ్య తరగతి దేశాలకు తగినన్ని వ్యాక్సిన్ డోసులు పంపేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. -
73 రోజుల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్..
పూణే: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి ఆశలు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పైనే ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా మూడో దశ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. కాగా ఆక్స్‌ఫర్డ్‌తో దేశీయ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ విడుదల తేదీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీరమ్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 73 రోజులలో భారత్‌లో విడుదల కానుందని తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగినట్లు సీరమ్ తెలిపింది. ప్రజలకున్న సందేహాలను తీర్చేందుకు త్వరలో ఐసీఎమ్ఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ వెబ్సైట్ ద్వారా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.ఇటీవల సీరమ్ సంస్థ బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో వ్యాక్సిన్‌ను వేగవంతంగా తయారు చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇటీవలే కరోనాను నివారించేందుకు ప్రపంచంలోనే మొదటిసారిగా రష్యా వ్యాక్సిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కానీ రష్యా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు చేయకుండానే మార్కెట్లో విడుదల చేశారని కొన్ని దేశాలు ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: ‘మురుగు నీటి ద్వారా వైరస్ వ్యాప్తి జరగదు’ -
‘ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పంపిణీ’
న్యూఢిల్లీ: ప్రభుత్వం ద్వారానే దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందుతుందని.. ఎవరూ ప్రైవేట్‌లో కొనాల్సిన అవసరం లేదంటుంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ). కరోనా వ్యాక్సిన్ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ద్వారానే దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించింది. అంతేకాక దేశ జనాభా కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామార్థ్యం తమ సొంతం అన్నది సీరమ్. ఆదివారం సీరమ్ సీఈఓ అదార్ పూనవాలాకి, మరో పార్సీకి మధ్య జరిగిన ట్విటర్ సంభాషణ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. రోని స్క్రూవాలా అనే పార్సీ.. అదార్‌ను ఉద్దేశిస్తూ.. ‘పార్సీ సమాజంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పటికే ప్రపంచంలో అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి ఒక లాబీ పనిచేస్తోంది. కాబట్టి పార్సీల కోసం కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై అదార్ స్పందిస్తూ.. ‘సమాజానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తాం. ఈ గ్రహం మీద ఉన్న పార్సీలను కవర్ చేయడానికి మా ఒక్క రోజు ఉత్పత్తి సరిపోతుంది’ అంటూ సరదాగా స్పందించారు. (అక్టోబర్–నవంబర్‌లో టీకా) ఈ క్రమంలో సోమవారం అదార్ మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత దేశ ప్రజలు ఎవరూ దీన్ని బహిరంగ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తాం అని తెలిపారు. అంతేకాక నిన్న జరిగిన ట్విటర్ సంభాషణ కేవలం ఇద్దరు పార్సీ మిత్రుల మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ మాత్రమే’ అన్నారు. ఆక్స్ఫర్డ్ దాని భాగస్వామి ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ విజయవంతమైన తర్వాత.. దాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం కోసం ఎస్ఐఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆక్సఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు అదార్ తెలిపారు. మూడవ దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి కోరుతూ ఎస్ఐఐ ఇప్పటికే దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఎస్ఐఐ కరోనా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పూణే, ముంబైలలో ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తోంది. (దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు) రెండు నెలల పాటు కొనసాగబోయే ట్రయల్స్‌లో భాగంగా ఆగస్టు చివరి నాటికి పూణే, ముంబైలలో 4,000 నుంచి 5,000 మందికి టీకా ఇంజెక్ట్ చేయనున్నట్లు ఎస్ఐఐ గత ప్రకటనలో తెలిపింది. గత వారం వ్యాక్సిన్ పరీక్ష ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంతృప్తికరమైన పురోగతిని సాధించడంతో.. తరువాతి ట్రయల్స్ కోసం ఎస్ఐఐ డీసీజీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. -
ఆక్స్ఫర్డ్ కంటే మనమే ఫస్ట్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి తీవ్రమైన లక్షణాలతో ఐసీయూలో ఉన్న రోగులపై కార్టికో స్టెరాయిడ్ ప్రయోగించి సత్ఫలితాలు సాధించినట్లు ఆక్స్ఫర్డ్ వర్సిటీ 4 రోజులక్రితం అంతర్జాతీయ వేదికగా ప్రకటించింది. కార్టికో స్టెరాయిడ్ రకానికి చెందిన డెక్సామెథజోన్ మందుతో ఐసీయూలో ఉన్న పేషెంట్లు వేగంగా కోలుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయా న్ని ఆక్స్ఫర్డ్ ప్రకటించడం కంటే ముందే భారత్.. కరోనా చికిత్సలో కార్టికో స్టెరాయిడ్ వినియోగిస్తోంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఈ డ్రగ్‌ను వినియోగించవచ్చనే సూచనల్ని బట్టి చూస్తే ఆ క్రెడిట్ భారత్‌కే దక్కుతుందని భారత వైద్యుల అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. కార్టికో స్టెరాయిడ్ రకానికి చెందిన మిథైల్ ప్రిడ్నిసలోన్ మందును తమిళనాడులోని ఆస్పత్రులు 2 నెలల క్రితం నుంచే ఐసీయూలోని పేషెంట్లకు వినియోగిస్తున్నారు. తొలుత చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఈ డ్రగ్‌ను వినియోగించగా..ఆ తర్వాత మద్రాస్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఎక్కువ మందిపై ప్రయోగించారు. చెన్నైలో 35 వేలకు పైగా కేసులు నమోదైనా.. మరణాల రేటు 1.1% మాత్రమే. ఈ ఆస్పత్రుల్లో కార్టికోస్టెరాయిడ్ డ్రగ్ తీసుకున్న పేషెంట్లు అత్యధికులు త్వరితంగా కోలుకున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోనూ ఐసీయూలో ఉన్న కొందరు పేషెంట్లపై ఈ డ్రగ్‌ను వినియోగించారు. దీంతో వారంతా త్వరితంగా కోలుకున్నట్టు గుర్తించారు. ఈ డ్రగ్ పనిచేస్తుందిలా.. సాధారణంగా శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే ప్రధాన అవయవాలపై వేగంగా దాడిచేస్తుంది. రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో సైటోకైన్లు విడుదలవుతాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో విడుదలైతే దుష్ప్రభావాలు మొదలవుతాయి. రోగం తాలూకు లక్షణాలు క్రమంగా పెరగడంతో పేషెంట్లను ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఐసీయూ పేషెంట్లపై కార్టికోస్టెరాయిడ్ రకానికి చెందిన మిథైల్ ప్రిడ్నిసలోన్ను ప్రయోగించారు. ఈ మందు సైటోకైన్ల దూకుడును తగ్గిస్తుంది. ఫలితంగా రోగి త్వరితంగా కోలుకుంటాడు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రకం డ్రగ్‌ను పరిశీలన– పరిశోధన (అబ్జర్వేషన్ స్టడీ)లో భాగంగా ప్రయోగించినట్లు మద్రాస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ ఎల్.పార్థసారథి తెలిపారు. పేషెంట్ రక్తంలో ఇన్ఫెక్షన్ నమూనాలను పరిశీలించాక ఈ మందును పామ్ (పీఏఎల్‌ఎం) థెరపీలో ప్రయోగిస్తున్నామని, దీంతో పేషెంట్లు త్వరగా కోలుకున్నారన్నారు. పేషెంట్ స్థితి ఆధారంగా డ్రగ్ డోసు పెంచుతామని, ఈ మందు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 24 గంటల నుంచి 36 గంటల వరకు పనిచేస్తుందని ఆయన వివరించారు. నేరుగా ఊపిరితిత్తులపైనే ఈ మందు పనిచేస్తుండటంతో దీన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. డెక్సామెథజోన్ శరీరంలో 36 గంటల నుంచి 48 గంటల పాటు పనిచేస్తుందని, మిథైల్ ప్రిడ్నిసలోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవన్నారు. మరణాల రేటు తక్కువగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకిన రోగులు త్వరగా కోలుకునేలా చేయడంతో పాటు మరణాల రేటును తగ్గించడంలోనూ వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కార్టికో స్టెరాయిడ్ శాశ్వత పరిష్కారం కానప్పటికీ రోగి కోలుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్న చెన్నైలో తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అక్కడి మరణాల రేటు 1.1% ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా వరకు మాత్రమే పరిశీలిస్తే 1.2% డెత్ రేట్ ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు మొదలుపెట్టే నాటికే చెన్నై, హైదరాబాద్‌లో ఈ మందుపై అబ్జర్వేషన్ స్టడీ ప్రారంభించినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల (నిజామాబాద్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు. -
కంటి ఆకారంలో విద్యార్ధులు
-
2018లో ఎక్కువగా వెతికిన పదాలివే
న్యూఢిల్లీ: టాక్సిక్, నోమోఫోబియా, మిస్ఇన్ఫర్మేషన్, సింగిల్–యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి. ‘టాక్సిక్’ అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు ఆక్స్‌ఫోర్డ్ సంస్థ వెల్లడించింది. విషపూరితమైన అనే అర్థం వచ్చేలా టాక్సిక్ పదాన్ని వాడతారని పేర్కొంది. ఈ ఏడాదికి గానూ టాక్సిక్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిందని పేర్కొంది. ఇక ‘జస్టిస్’ పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్సైట్లో వెతికారని ‘మరియమ్ వెబ్‌స్టర్’ అనే సంస్థ వెల్లడించింది. ‘సింగిల్ యూజ్’ అనే పదాన్ని తమ డిక్షనరీలో ఎక్కువ మంది వెతికినట్లు కొలీన్స్ సంస్థ ప్రకటించింది. 2013వ సంవత్సరం నుంచి ఈ పదం అర్థం కోసం వెతికిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగినట్లు పేర్కొంది. ‘మిస్ఇన్ఫర్మేషన్’ అనే పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌ను సంప్రదించారని ‘డిక్షనరీస్.కామ్’ అనే సంస్థ ప్రకటించింది. సమాచారం సరైనదా? కాదా? అని సరిచూసుకోకుండా వేగంగా వ్యాప్తి చెంది, తప్పు దోవ పట్టించే విషయాన్ని మిస్ ఇన్ఫర్మేషన్ అనే పదానికి అర్థంగా వివరించింది. ‘నోమోఫోబియా’ అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయపడటం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయని వెల్లడించింది. ఎక్కువ మంది వాడే పదాలను ట్రాక్ చేసే ‘గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్‌ఎమ్) ఈ ఏడాది రెండు పదాలను టాప్ వర్డ్స్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. -
ఆన్లైన్లో ఆక్స్ఫర్డ్ తెలుగు డిక్షనరీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ప్రపంచ భాషల కార్యక్రమంలోకి తెలుగు కూడా చేరింది. తెలుగు ఆన్లైన్ డిక్షనరీ జ్టి్టpట://్ట్ఛ.్ఠౌజౌటఛీ ఛీజీఛ్టిజీౌn్చటజ్ఛీట. ఛిౌఝ అందుబాటులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ సంస్థ 2015 సెప్టెంబర్‌లో ‘ఆక్స్ఫర్డ్ గ్లోబల్ లాంగ్వేజెస్’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలకు సంబంధించి లెక్సికో గ్రాఫికల్, ఇతర భాషా వనరులను ఆన్లైన్లో అందు బాటులోకి తేవటమే ఈ ప్రాజెక్టు ధ్యేయం. ‘‘ఆక్స్ఫర్డ్ ప్రపంచ భాషల్లోకి తాజాగా తెలుగు చేరడం పట్ల సంతోషంగా ఉన్నాం. తెలుగు భారత్‌లో నాలుగో అతిపెద్ద భాష’’ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ డైరెక్టర్ జూడీ పియర్సల్ పేర్కొన్నారు. -
రోహింగ్యా.. రోదన: సూచీకి షాక్..
లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల ఆక్రందన కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న మయన్మార్ అనధికార ప్రభుత్వాధినేత ఆంగ్‌సాన్ సూచీకి ఆక్స్ఫర్డ్ సిటీ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆమెకు గౌరవసూచకంగా ప్రదానం చేసిన 'ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్' బిరుదును వెనుకకు తీసుకుంది. మయన్మార్ నియంత పాలనలో ప్రజాస్వామ్యం కోసం పోరాడినందుకు 1997లో ఆక్స్ఫర్డ్ కౌన్సిల్ ఆమెకు ఈ గౌరవాన్ని ప్రకటించింది. మంగళవారం భేటీ అయిన కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆమెకు ప్రకటించిన గౌరవ బిరుదును వెనుకకు తీసుకుంది. ఆమె ఈ గౌరవానికి ఇక ఎంతమాత్రం అర్హురాలు కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సిటీ కౌన్సిల్ చరిత్రలో ఇది అసాధారణ చర్య అని కౌన్సిల్ లీడర్ బాబ్ ప్రైస్ తెలిపారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన సూచీకి ఆక్స్ఫర్డ్ నగరంతో మంచి అనుబంధం ఉంది. 1964-67 మధ్య ఇక్కడే సెయింట్ హ్యుగ్ కాలేజీలో చదివిన ఆమె.. కొంతకాలం ఇక్కడ కుటుంబంతో కలిసి నివసించారు కూడా. ఇటీవల సెయింట్ హ్యూగ్ కాలేజీ ప్రవేశమార్గంలో ఉన్న ఆమె చిత్రాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలోనే సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలైన రోహింగ్యాల దుస్థితి కొనసాగుతోంది. ఇక్కడ తలపెట్టిన ఆర్మీ ప్రేరేపిత హింస, సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే 50వేలకుపైగా మంది రోహింగ్యాలు నిరాశ్రయులయ్యారు. శరణార్థులుగా పొరుగు దేశాలకు వలస పోతున్నారు. -
ఆమె పెయింటింగ్‌ను ఆక్స్‌ఫోర్డ్ తీసేసింది
లండన్ : మయన్మార్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభ నేపథ్యంలో ఆక్స్‌ఫోర్డ్ కాలేజీ ఆ దేశ సలహాదారు, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూచీ పెయింటింగ్‌ను ప్రజల సందర్శన నుంచి తీసేసింది. ప్రధాన ద్వారం వద్దనున్న నోబెల్ గ్రహీత సూచీ పెయింటింగ్‌ను తొలగిస్తున్నట్టు సెయింట్ హు కాలేజీ గవర్నింగ్ బాడీ గురువారం నిర్ణయించింది. కొత్త విద్యార్థులు రాబోతున్న క్రమంలో ఆమె పెయింటింగ్‌ను ప్రధాన ద్వారం నుంచి కాలేజీ తీసేసింది. 1999 నుంచి కాలేజీ ప్రధాన ద్వారంలో ఆమె పెయింటింగ్ చాలా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆంగ్ సాన్ సూచీ ఆ కాలేజీ నుంచే అండర్ గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. 2012లో ఆంగ్ సాన్ సూచీ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 1964 నుంచి 1967 మధ్యలో రాజకీయ, తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రాలను ఆ కాలేజీలోనే అభ్యసించారు. తన 67వ జన్మదిన వేడుకలను కూడా సూచీ అక్కడే చేసుకున్నారు. కానీ ఇటీవల రోహింగ్యా మైనార్టీల విషయంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు విమర్శనాత్మకంగా మారింది. మయన్మార్ మిలటరీ దళాల నుంచి రోహింగ్యాలు తీవ్ర దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ నెల మొదట్లో తమకు కొత్త పేయింటింగ్ గిఫ్ట్‌గా వచ్చిందని, ఈ క్రమంలో ఆంగ్ సాన్ సూచీ పెయింటింగ్‌ను స్టోరేజ్‌లోకి తరలిస్తున్నట్టు సెయింట్ హు కాలేజీ తెలిపింది. అయితే కాలేజీ ఈ కారణం చెబుతున్నప్పటికీ, సరియైన కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఆమె పెయింటింగ్‌ను తొలగించే నిర్ణయం తీసుకునే గవర్నింగ్ బాడీలో కళాశాల సభ్యులు, ప్రిన్సిపాల్ ఉన్నారు. 1991లో ఆంగ్‌సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమానం వచ్చింది. -
నాలుగు గంటల్లోనే ట్రక్కు తయారు చేయొచ్చు!
డ్రైవర్ రహిత వాహనాన్ని తయారు చేయాలని చాలామంది ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇన్నాళ్లకు ఆ కల నెరవేరే టైమ్ దగ్గరపడింది. ప్రస్తుతం డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు డ్రైవర్ రహిత ట్రక్ డిజైన్లను లండన్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. తేలికపాటి మెటీరియల్, ఇంజన్‌ను ఉపయోగించడం వల్ల వాహనం బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే 2020లోగా లండన్‌లోని రోడ్లపై ఈ వాహనాలు తిరుగుతాయని తయారీదారులు ధీమాగా చెబుతున్నారు. ఇవి ఎలాగూ ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో హానికర ఉద్గారాలు వెలువడవు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటిని ఒక్క వ్యక్తి కేవలం నాలుగు గంటల్లోనే తయారు చేయగలడు. భవిష్యత్తులో సరుకుల రవాణాకు ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఈ ట్రక్కుల తయారీ కోసం వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో కర్మాగారాన్ని నిర్మించే పనిలో పడ్డారు తయారీదారులు. ఈ వాహనాలు తొలి 100 మైళ్లు ఎలాంటి ఉద్గారాలు లేకుండా సాగుతాయి. ఆపై బ్యాటరీ డ్యూయల్ మోడ్ దానంతట అదే యాక్టివేట్ అయి 500 మైళ్ల వరకు ప్రయాణం చేస్తాయట. ఆక్స్‌ఫర్డ్‌లోని చార్జ్ ఆటోమోటివ్ అనే కంపెనీ దీనిని తయారు చేస్తోంది.