పూణే: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి ఆశలు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పైనే ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా మూడో దశ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. కాగా ఆక్స్‌ఫర్డ్‌తో దేశీయ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విడుదల తేదీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీరమ్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 73 రోజులలో భారత్‌లో విడుదల కానుందని తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగినట్లు సీరమ్ తెలిపింది.
ప్రజలకున్న సందేహాలను తీర్చేందుకు త్వరలో ఐసీఎమ్‌ఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.ఇటీవల సీరమ్ సంస్థ బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో వ్యాక్సిన్‌ను వేగవంతంగా తయారు చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇటీవలే కరోనాను నివారించేందుకు ప్రపంచంలోనే మొదటిసారిగా రష్యా వ్యాక్సిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కానీ రష్యా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు చేయకుండానే మార్కెట్‌లో విడుదల చేశారని కొన్ని దేశాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
చదవండి: ‘మురుగు నీటి ద్వారా వైరస్ వ్యాప్తి జరగదు’
Comments
Please login to add a commentAdd a comment