![Nomophobia, Toxic, Justice: The 2018 Words Of The Year - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/2/Phones_Searching.jpg.webp?itok=fFM5FEZA)
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: టాక్సిక్, నోమోఫోబియా, మిస్‌ఇన్ఫర్మేషన్, సింగిల్–యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి. ‘టాక్సిక్’ అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు ఆక్స్‌ఫోర్డ్ సంస్థ వెల్లడించింది. విషపూరితమైన అనే అర్థం వచ్చేలా టాక్సిక్ పదాన్ని వాడతారని పేర్కొంది. ఈ ఏడాదికి గానూ టాక్సిక్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిందని పేర్కొంది. ఇక ‘జస్టిస్’ పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌లో వెతికారని ‘మరియమ్ వెబ్‌స్టర్’ అనే సంస్థ వెల్లడించింది.
‘సింగిల్ యూజ్’ అనే పదాన్ని తమ డిక్షనరీలో ఎక్కువ మంది వెతికినట్లు కొలీన్స్ సంస్థ ప్రకటించింది. 2013వ సంవత్సరం నుంచి ఈ పదం అర్థం కోసం వెతికిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగినట్లు పేర్కొంది. ‘మిస్‌ఇన్ఫర్మేషన్’ అనే పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌ను సంప్రదించారని ‘డిక్షనరీస్.కామ్’ అనే సంస్థ ప్రకటించింది. సమాచారం సరైనదా? కాదా? అని సరిచూసుకోకుండా వేగంగా వ్యాప్తి చెంది, తప్పు దోవ పట్టించే విషయాన్ని మిస్ ఇన్ఫర్మేషన్ అనే పదానికి అర్థంగా వివరించింది.
‘నోమోఫోబియా’ అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయపడటం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయని వెల్లడించింది. ఎక్కువ మంది వాడే పదాలను ట్రాక్ చేసే ‘గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్‌ఎమ్) ఈ ఏడాది రెండు పదాలను టాప్ వర్డ్స్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment