nomophobia
-
స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని.. 'స్మార్ట్'గా తప్పించుకుందాం!
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. – అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. – మొబైల్ స్క్రీన్‌ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. – అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది. – కొంతమంది టాయిలెట్‌కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్‌పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. – అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది. – ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్‌గా తప్పించేద్దాం.ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే! -
తు‘ఫోను’
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని కార్తీక్ ఇంట్లో వారితో మాట్లాడటం తగ్గించేశాడు. అందరూ ఉన్నా ముభావంగా వ్యవహరించడం, వణకడం, స్థిరత్వం లేనిచూపులు, నిలకడ లేని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు కలత చెందారు. అతనిలో వస్తున్న మార్పుతో నిపుణులను సంప్రదించగా నోమోఫోబియాతో బాధ పడుతున్నాడని తేల్చారు. సకాలంలో గుర్తించి కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో అతని సమస్యను పోగొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన మాదిరిగానే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదౌతున్నాయి. నిత్యం ఫోన్లో ఆటలు, చాటింగ్ చేయడం, ఫేస్బుక్ వినియోగం, వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు రాత్రి పగలు చేయడం నోమో ఫోబియాకు గురౌతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఫోబియా బారిన పడటానికి ప్రధాన కారణం యువత చదువుతున్నా, పడుకున్నా, తింటున్నా, బస్టాప్‌లో నిల్చున్నా, ఆఫీసులో ఉన్నా, సినిమా హాలుకు వెళ్లినా, బ్యాంక్‌కు వెళ్లినా, కళాశాలకు వెళ్లినా వెంట సెల్ఫోన్లు పట్టుకుని అదే పనిగా వాటిని వాడడమేనని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం ఒక వ్యసనం ఫోన్ లేకపోతే ఏర్పడే భయాన్నే నోమో ఫోబియాగా చెబుతుంటారు. నో మొబైల్ ఫోన్ నోబియా అనే పదం నుంచి సంక్షిప్తంగా దీనికి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సెల్ఫోన్లు వాడుతున్న దేశంగా భారత్ అవతరిస్తోంది. ఈ క్రమంలో ఈ రుగ్మతకు గురవుతున్న అత్యధిక బాధితుల సరసన కూడా చేరబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది యువత ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతున్నారు. దీని తర్వాత దశ నోమోఫోబియానే అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది మధ్య పెద్ద వయస్కులు దీన్ని ఎదుర్కొంటున్నారు. నోమోఫోబియా లక్షణాలు ► మొబైల్‌ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలు అందుబాటులో లేకపోయినా, సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా ఆందోళనకు గురవుతారు. ► కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ముఖాముఖి కలిసేందుకు మానసిక సంసిద్ధత గణనీయంగా తగ్గిపోతుంది. ► ఒంటరితనం, కుంగుబాటుతో బాధపడతారు. ► బయటికి వెళ్లాల్సి వస్తే చార్జర్, పవర్‌బ్యాంక్, అదనపు డివైజ్‌లను వెంట తీసుకెళ్లాలనుకుంటారు. ► చెమటలు రావడం, వణుకుడు, ఆందోళన, తమను తామే కొట్టుకోవడం వంటివి కనిపిస్తాయి. ఇలా బయట పడొచ్చు సకాలంలో ఈ లక్షణాలను పసిగట్టి తగిన మానసిక చికిత్స ఇప్పిస్తే సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్, నెలలో ఒకరోజు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, వంటివాటికి దూరంగా ఉండటం, నిద్ర పోవడానికి ముందు వీటిని కనీసం పదిహేను అడుగుల దూరంలో ఉంచడం చేయాలి. ఫోన్ పక్కనే ఉంటే నిద్రా భంగమే. కుటుంబసభ్యులు, స్నేహితులు వీరితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల సాధారణ పరిస్థితులు సృష్టించవచ్చన్నదే నిపుణులు చెప్పేమాట. ఇటీవల ప్రధాన పట్టణాల్లో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. స్నేహితులు, బంధువులతో ఫోన్లో కాకుండా నేరుగా కలిసి మాట్లాడటం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. సెల్‌ఫోన్, కంప్యూటర్లతో చేయాల్సిన పనులకు ఒక నిర్ణీత సమయం పెట్టుకోవడం వంటివి చేయొచ్చు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ అవసరం. మరిన్ని ప్రత్యామ్నాయాలు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో సెల్ఫోన్లను నిషేధించింది. దీనిని పాఠశాలలు, కళాశాలలకే పరిమితం చేయకుండా విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన రాష్ట్రంలో కూడా ఈ విధానం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రైవేటు కార్యాలయాల్లోని యువతకు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్‌లు తప్పని సరి. అక్కడే విధులు నిర్వర్తించడానికి రెండురోజులు వారాంతపు సెలవులున్నా, ఎక్కువ మంది వాటి ద్వారా ఆయా రోజుల్లో కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. ఈ పనులకంటూ కచ్చితమైన ఒక సమయం పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. బానిసలౌతున్న యువత మొబైల్ ఫోన్లకు యువత బానిసలవుతున్నారని అంతర్జాతీయ సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం 23 శాతం యువత నోమోఫోబియాకు గురవుతున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల తర్వాత ప్రస్తుతం విశాఖపట్నంలో ఎక్కువగా ఈ కేసులు నమోదౌతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ కేసుల లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువత, విద్యార్థులు రోజలో కనీసం 31 పర్యాయాలు సెల్‌ఫోన్ చూసుకుంటున్నారు. సుమారు 3 గంటల పాటు సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారని తేలింది. పదేపదే ఈ రకమైన కాలక్షేపం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. నోమోఫోబియా బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య నుంచి దూరం చేయవచ్చు. ఆలోచనల్లో మార్పులు తీసుకురావడం, టాక్ థెరపీ, విశ్రాంతి వంటి పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించొచ్చు. నెట్ వర్క్‌ను పరిమితంగా వినియోగించుకొనేలా మార్గనిర్ధేశం చేస్తాం. ఫోన్‌కు దూరమైతే నోమో ఫోబియా దూరమౌతుంది. – శ్రీహరి, మానసిక నిపుణుడు విపరీత వినియోగంతో ఫోబియా సెల్ ఫోన్‌ను విశ్రాంతి లేకుండా అదే పనిగా వినియోగించడం వల్ల యువత అనేక రగ్మతలకు గురౌతోంది. అలాంటి కేసులు తరచూ వస్తున్నాయి. తలనొప్పి, నరాలు పట్టేయడం, స్థిరత్వం లేని మాటలు ఆడటం వంటి కేసులు వస్తున్నాయి. అన్నం తిన్నా, పడుకోవడానికి వెళ్లినా, చివరికి బాత్రూంకు వెళ్లినా సెల్‌ఫోన్ పట్టుకుని వెళ్లే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో గుర్తించిన ఇలాంటి కేసులను కౌన్సెలింగ్ కోసం రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ నాగభూషణ్‌రావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి -
2018లో ఎక్కువగా వెతికిన పదాలివే
న్యూఢిల్లీ: టాక్సిక్, నోమోఫోబియా, మిస్ఇన్ఫర్మేషన్, సింగిల్–యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి. ‘టాక్సిక్’ అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు ఆక్స్‌ఫోర్డ్ సంస్థ వెల్లడించింది. విషపూరితమైన అనే అర్థం వచ్చేలా టాక్సిక్ పదాన్ని వాడతారని పేర్కొంది. ఈ ఏడాదికి గానూ టాక్సిక్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిందని పేర్కొంది. ఇక ‘జస్టిస్’ పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్సైట్లో వెతికారని ‘మరియమ్ వెబ్‌స్టర్’ అనే సంస్థ వెల్లడించింది. ‘సింగిల్ యూజ్’ అనే పదాన్ని తమ డిక్షనరీలో ఎక్కువ మంది వెతికినట్లు కొలీన్స్ సంస్థ ప్రకటించింది. 2013వ సంవత్సరం నుంచి ఈ పదం అర్థం కోసం వెతికిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగినట్లు పేర్కొంది. ‘మిస్ఇన్ఫర్మేషన్’ అనే పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌ను సంప్రదించారని ‘డిక్షనరీస్.కామ్’ అనే సంస్థ ప్రకటించింది. సమాచారం సరైనదా? కాదా? అని సరిచూసుకోకుండా వేగంగా వ్యాప్తి చెంది, తప్పు దోవ పట్టించే విషయాన్ని మిస్ ఇన్ఫర్మేషన్ అనే పదానికి అర్థంగా వివరించింది. ‘నోమోఫోబియా’ అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయపడటం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయని వెల్లడించింది. ఎక్కువ మంది వాడే పదాలను ట్రాక్ చేసే ‘గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్‌ఎమ్) ఈ ఏడాది రెండు పదాలను టాప్ వర్డ్స్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. -
ఫోన్ లేకుండా ఎంతసేపు ఉంటారు?
స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచం తీరుతెన్నులే మారిపోయాయి. చేతిలో ఫోన్ లేకుండా.. లేదా అసలు ఫోన్ కనపడకుండా ఎంతసేపు ఉండగలరని చూస్తే, మహా అయితే కొద్ది నిమిషాలు మాత్రమేనని ఓ సర్వేలో తేలింది. 18-26 సంవత్సరాల మధ్య వయసున్నవాళ్లయితే స్మార్ట్ ఫోన్లకు మరీ ఎక్కువగా బానిసలు అవుతున్నారని, అంతకంటే చిన్నవాళ్లు, పెద్దవాళ్లు కూడా తక్కువ తినలేదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరినుంచైనా ఫోన్లు వాళ్లకు అందకుండా దూరంగా ఉంచితే, వాళ్లు విపరీతంగా ఒత్తిడికి లోనవుతున్నారట. వేరే ఫోన్ ఏదైనా ఇస్తే కాస్త ఒత్తిడి తగ్గుతోందని, అయినా తమ సొంత ఫోన్ దొరికే వరకు మాత్రం వాళ్లకు ఆందోళన ఎక్కువవుతోందని చెప్పారు. పక్క మనుషులతో మాట్లాడటం కంటే ఫోన్లు చూసుకుంటేనే ఎక్కువ సౌఖ్యంగా ఉంటున్నారని, చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులలో ఎవరో ఒకరి పక్కన పడుకున్నప్పటి కంటే దుప్పటి బాగా కప్పుకున్నప్పుడు సుఖంగా ఎలా ఉంటారో వీళ్ల పరిస్థితీ అంతేనని మానసిక వైద్య నిపుణులు విశ్లేషించారు. హంగేరిలోని యుట్వాస్ లొరాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ముఖ్యమైన వ్యక్తుల ఫొటోలు, బొమ్మల లాంటి వస్తువులతో మనుషులకు మంచి అనుబంధం ఉంటుందని, అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లు కూడా జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలలో ఒకరైన వెరోనికా కొనాక్ తెలిపారు. ఫోన్లు కేవలం ముఖ్యమైన వస్తువులే కాకుండా, మన సామాజిక సంబంధాలను కూడా కలుపుతాయని, అందుకే అవి బాగా ముఖ్యం అయ్యాయని చెప్పారు. 18-26 సంవత్సరాల మధ్య వయసున్నవారిపై చేసిన ఈ పరిశోధనలో భాగంగా వారి హృదయ స్పందనలను కూడా నమోదు చేశారు. వాళ్లలో సగం మంది వద్ద ఫోన్లు తీసుకుని వాటిని ఓ కప్‌బోర్డులో పెట్టారు. సర్వేలో పాల్గొన్నవాళ్లంతా వేర్వేరు గదుల్లో కూర్చున్నారు. వాళ్లకు ఒక ల్యాప్‌టాప్ ఇచ్చి అందులో లెక్కలు, పజిల్స్ చేయమన్నారు. మూడున్నర నిమిషాల తర్వాత.. ఫోన్లు తమవద్ద లేనివాళ్లు తమ ఫోన్ ఎక్కడుందోనని వెతుకుతూ గడిపేశారు. అదే సమయంలో వాళ్ల గుండె కొట్టుకునే వేగం కూడా బాగా పెరిగింది. ముఖాలు పదే పదే తడుముకోవడం, చేతులతో శరీరం మీద గోక్కోవడం, గోళ్లు కొరుక్కోవడం.. ఇలా ఒత్తిడికి సంబంధించిన అన్ని లక్షణాలు వారిలో కనిపించాయి. ఈమధ్య కాలంలో పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రుల కంటే ఫోన్ల మీదే వాళ్లు ఎక్కువ ప్రేమ కనబరుస్తున్నారని వెరోనికా చెప్పారు. ఫోన్ దగ్గర లేనప్పుడు కలిగే ఆందోళనకు 'నోమోఫోబియా' అని పేరు పెట్టారు. దానికి 'నో మొబైల్ ఫోన్ ఫోబియా' అని అర్థం. ప్రతి ఐదుగురిలో నలుగురికి ఈ ఫోబియా కనిపిస్తోందని పరిశోధనలో తేలింది. -
ఫోన్ లేక.. నేను లేను..
నోమో ఫోబియా.. ప్రస్తుతం విదేశాల్లో మాంచి రైజింగ్‌లో ఉన్న ఈ ఫోబియా.. మన దగ్గరా చాలా మందికి ఉండే అవకాశముంది. అందుకే దాని లక్షణాలేమిటో ఓసారి చదివేయండి. ఫోన్‌ను విడిచి ఉండలేకపోవడం.. మన మొబైల్ ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళన చెందడం.. కనెక్షన్ కట్ అవుతుందని బాధపడటం.. పలుమార్లు ఫోన్ చూసుకోవడం.. బ్యాటరీ డెడ్ అయిపోతుంటే విపరీతంగా టెన్షన్ పడటం.. ఫోన్ ఉంటే చాలు.. మిగతావారు పట్టనట్టు ఉండటం.. ఈ నోమో ఫోబియాకు సంబంధించి అమెరికాలో పలు ప్రముఖ సంస్థలు సర్వేలు కూడా నిర్వహించాయి. వాటి ప్రకారం ఈ ఫోబియా రోజురోజుకూ పెరుగుతోందట. ఆ వివరాలు ఇవీ.. -
సరికొత్త భయం.. నోమోఫోబియా!
మొబైల్ ఫోన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారా? లేదా.. స్మార్ట్‌ఫోన్‌లో డేటా ప్యాకేజి లేకపోవడం, వై-ఫై అందుబాటులో లేకపోవడం లాంటి పరిస్థితులు వస్తే అస్సలు భరించలేకపోతున్నారా? అయితే మీరు 'నోమోఫోబియా'తో బాధపడుతున్నట్లే. అవును.. ఇప్పుడు ప్రపంచంలో సరికొత్తగా వ్యాపిస్తున్న ఫోబియా ఇది. ఈ విషయాన్ని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఆనా పాల్ కొరెయా అనే అసోసియేట్ ప్రొఫెసర్, కాగ్లర్ ఇల్డిరిమ్ అనే పీహెచ్డీ విద్యార్థి కలిసి ఈ అంశంపై పరిశోధనలు చేశారు. ఈ కొత్త ఫోబియాలో కూడా నాలుగు కోణాలు ఉన్నాయట. ఇందుకోసం వాళ్లు చేసిన సర్వేలో పాల్గొన్నవారిని అడగిన ప్రశ్నలకు 1 (గట్టిగా వ్యతిరేకిస్తాను) నుంచి 7 (గట్టిగా అంగీకరిస్తాను) వరకు గ్రేడ్లు ఇవ్వాలని తెలిపారు. ఇందులో ఎక్కువ స్కోర్లు వచ్చినవాళ్లకు నోమోఫోబియా బాగా తీవ్రంగా ఉన్నట్లు లెక్కించారు. నా ఫోనుకు సమాచారం అందకపోతుంటే నేను చాలా ఇబ్బంది పడతాను, నేను కావాలనుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోతే అస్సలు భరించలేను, ప్రపంచంలో ఏం జరుగుతోంతో ఫోన్లో తెలియకపోతే చాలా నెర్వస్‌గా ఫీలవుతాను.. ఇలాంటి ప్రశ్నలను వాళ్లకు ఇచ్చారు. వీటికి అవును అని చెప్పినవాళ్లకు నోమోఫోబియా ఉన్నట్లు లెక్కించారు. కాబట్టి.. మీకు కూడా ఇలాంటి ఫోబియా ఏమైనా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి మరి!!