ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
⇒ రాష్ట్రంలో మొదటిది ప్రారంభించిన తుమ్మల
⇒ హాజరైన కడియం, చందూలాల్
పరకాల: రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తో ఈ క్యాంపు కార్యాలయాలను నిర్మించా రు. కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రద్ధ తీసుకొని రూ.69 లక్షల ఖర్చుతో నివాసం, కార్యాలయ భవన పనులను ఐదు నెలల్లోనే పూర్తి చేయించారు. 2,800 గజాల స్థలంలోని 4,530 చదరపు అడుగుల్లో అధునాతన సౌకర్యాలతో భవనా న్ని రెండంతస్తుల్లో నిర్మించారు.
కార్యక్ర మంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మదుసుదనాచారి, పర్యాటక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం బాగుందని కొనియా డారు.
ఇలాంటి భవనాలనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యాలకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెలు, మేకల పెంపకదారుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.