Hari Kadiyam
-
వర్సిటీ కాంట్రాక్టు బోధకుల ఉద్యమబాట
ఉద్యోగాల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో విధుల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ బోధకులు ఉద్యమబాట పట్టారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,639 మంది అసిస్టెంట్ ప్రొఫెస ర్లు, 482 మంది పార్ట్‌టైమ్ కాంట్రాక్టు లెక్చర ర్లు రెండు రోజులుగా ఆందోళనల్లో పాల్గొం టున్నారు. మూడు నెలల క్రితమే వీరు ఈ డిమాండ్లపై ఆందోళన చేపట్టగా.. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి చొరవ తీసుకుని.. సంఘాల నేతలతో చర్చించి ఆందోళనకు తాత్కాలికంగా చెక్ పెట్టారు. దీంతో కొంత కాలంగా ఉద్యమం సద్దుమణిగింది. తాజాగా మరోమారు విధుల బహిష్కరణకు దిగడం తో వర్సిటీల్లో గందరగోళం నెలకొంది. కమిటీ నివేదిక రాకముందే.. వర్సిటీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీక రణపై ప్రభుత్వం ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో కమిటీ సభ్యులు వర్సిటీల్లో పరిస్థితులపై పరిశీలన చేపట్టారు. అయితే ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని చర్చల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆలోపు ఎలాంటి నియామకాలు చేపట్టమని పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టు బోధకులు ఆందోళన వీడి విధుల్లో చేరారు. తాజాగా వర్సిటీల్లో వెయ్యి పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో కాంట్రాక్టు బోధకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక రాకముందే నియామకాల ప్రక్రియ ఏలా చేస్తారంటూ ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వేతనాలు పెంచే అం శాన్ని మాత్రమే పరిశీలిం చాలని కమిటీ సూచించి నట్లు సమాచారం. అయితే పూర్తిస్థాయి నివేదిక ఇంకా సమర్పించాల్సి ఉంది. ఆరు డిమాండ్లతో ఆందోళనలు... కాంట్రాక్టు బోధకులు ఆరు డిమాండ్లతో ఆం దోళన చేపట్టారు. టీయూటీఏసీ, ఓయూసీ ఏపీ, ఓయూటీఏసీ, టీయూపీటీటీఏ సం ఘాలు సంయుక్తంగా నిరసనలు చేపడుతు న్నాయి. ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్ కాగా, యూజీసీ నిబంధనల ప్రకారం వర్క్‌లోడ్ ఆధారంగా పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సుప్రీం ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఐదేళ్ల తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా పరిగణించాలనే డిమాండ్లతో ఉద్యమాన్ని చేపట్టారు. డిమాండ్లు సాధిం చుకునే వరకు ఉద్యమిస్తామని బోధకులు ప్రకటిస్తుండడంతో బోధన ఎలా సాగుతుం దోనని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
⇒ రాష్ట్రంలో మొదటిది ప్రారంభించిన తుమ్మల ⇒ హాజరైన కడియం, చందూలాల్ పరకాల: రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తో ఈ క్యాంపు కార్యాలయాలను నిర్మించా రు. కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రద్ధ తీసుకొని రూ.69 లక్షల ఖర్చుతో నివాసం, కార్యాలయ భవన పనులను ఐదు నెలల్లోనే పూర్తి చేయించారు. 2,800 గజాల స్థలంలోని 4,530 చదరపు అడుగుల్లో అధునాతన సౌకర్యాలతో భవనా న్ని రెండంతస్తుల్లో నిర్మించారు. కార్యక్ర మంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మదుసుదనాచారి, పర్యాటక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం బాగుందని కొనియా డారు. ఇలాంటి భవనాలనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యాలకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెలు, మేకల పెంపకదారుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
వర్ధన్నపేట.. అభివృద్ధి బాట
కొత్త సంస్థలన్నీ ఈ నియోజకవర్గంలోనే తాజాగా నాలుగు విద్యా సంస్థలు {పభుత్వానికి ప్రతిపాదనలు ఆరు నెలల్లోపే కార్యకలాపాలు వరంగల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్‌కు గుర్తింపు పెరుగుతోంది. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ప్రభుత్వం మన జిల్లాకే కేటాయిస్తోంది. ఇలా.. జిల్లాకు మంజూరు చేసిన దాదాపు అన్ని విద్యా సంస్థలూ వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయి. నగరానికి సమీపంలో ఉండడంతో పాటు సర్కార్ భూములు కూడా అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం కొత్తగా ప్రకటించే విద్యా సంస్థలు వర్ధన్నపేట పరిధిలోనే నిర్మాణం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల జిల్లాలో మూడు రోజులు పర్యటించిన సందర్భంగా వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీంట్లో భాగంగా జిల్లాకు వ్యవసాయ కాలేజీ, పత్తి పరిశోధన కేంద్రం, వెటర్నరీ కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, గిరిజన యూనివర్సిటీలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటించిన దాదాపు అన్ని విద్యా సంస్థలూ వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే నాలుగు విద్యా సంస్థలు ఈ సెగ్మెంట్లోనే ఏర్పాటు చేసేలా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రతిపాదనలు రూపొందించారు. ఆరు నెలల్లోపే కొత్త విద్యా సంస్థలన్నీ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా మామునూరులోనే వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. మామునూరులో ప్రస్తుతం ఉన్న పశుసంవర్థక పరిశోధన సంస్థ సమీపంలోనే వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెటర్నరీ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ గొర్రెలు-మేకలు, గేదెలు, కోళ్ల పరిశోధన సంస్థలు ఏర్పాటు కానున్నాయి.హన్మకొండ మండలం ఆరెపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం(ఆర్‌ఏఆర్‌ఎస్) ఉంది. ఇప్పటికే పలు వ్యవసాయ పరిశోధన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే వ్యవసాయ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రధాన వ్యవసాయ పంటగా ఉన్న పత్తి పరిశోధన కేంద్రాన్ని ఆర్ఏఆర్ఎస్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వ్యవసాయ విద్యా, పరిశోధన సంస్థలకు ఆరెపల్లి కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థలానికి అదనంగా 300 ఎకరాల స్థలాన్ని సమీపంలో గుర్తించారు. సిద్ధాపురం, అర్వపల్లి మధ్యలోని ప్రభుత్వ స్థలాలను సైతం వ్యవసాయ పరిశోధనల కోసం కేటాయించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హన్మకొండ మండలం మడికొండ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు కేంద్రంగా మారుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్ని మడికొండ-రాంపూర్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. టీఎస్ఐఐసీ పరిధిలోని 18 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌పీఎస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భవనాల నిర్మాణం జరిగేలోపే హెచ్‌పీఎస్ ప్రారంభమవుతోంది. కొత్త భవనాలు సిద్ధమయ్యే వరకు హనన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో హెచ్‌పీఎస్ తరగతులను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, హెచ్‌పీఎస్ బాధ్యులు నిర్ణయించారు. హైదరాబాద్‌కు అనుబంధంగా పలు జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మడికొండ సమీపంలో ఐటీ రంగం అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటోంది. మడికొండలో నిర్మాణం పూర్తయిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. ఇన్ఫోసిస్ సంస్థ జిల్లాలోనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక శిక్షణ కేంద్రం జిల్లాకు వస్తే మడికొండలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని కొత్త విద్యా సంస్థలు నెలకొల్పేందుకు మామునూరులో అనువైన స్థలాలు ఉన్నాయి. మామునూరులోని పశుసంవర్థక పరిశోధన సంస్థల సమీపంలో ప్రస్తుతం 390 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. దీంతో మరిన్ని విద్యా సంస్థలు ఇక్కడే నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సైనిక్ స్కూల్ సైతం మామునూరు పోలీసు క్యాంపు సమీపంలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంతో తృప్తి కలిగిస్తోంది గొప్ప చరిత్ర, ఉద్యమ నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లాకు గతంలో తగిన గుర్తింపు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి మారింది. విద్యతోనే అభివృద్ధికి అడుగులు పడతాయి. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త విద్యా సంస్థలన్నీ వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఏర్పాటు కానుండడం చెప్పలేనంత సంతోషంగా ఉంది. - అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే -
విద్యాకేంద్రంగా ఓరుగల్లు
కొత్తగా నాలుగు విద్యా సంస్థలు సీఎం హామీలు ఆరు నెలల్లోనే అమలు ఇది నాకెంతో గర్వంగా ఉంది ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ : వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కొత్తగా నాలుగు విద్యా సంస్థలు జిల్లాలో ఏర్పాటవుతున్నాయని... విద్యా మంత్రిగా ఇది తనకు గర్వంగా ఉందని చెప్పారు. వ్యవసాయ కాలేజీ, పత్తి పరిశోధన కేంద్రం, పశుసంవర్థక కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరం(2016-17) నుంచి మొదలవుతాయని చెప్పారు. నాలుగు విద్యా సంస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామన్నారు. కొత్త విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ సంస్థలకు అనువైన స్థలాల ఎంపిక కోసం ఉన్నతాధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం పరిశీలించారు. నాలుగు సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌజ్‌లో ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 4, 5, 6 తేదీల్లో వరంగల్ జిల్లాలో పర్యటించారు. 6న అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలో నెలకొల్పాల్సిన సంస్థలపై ప్రతిపాదనలను ఇస్తే పెద్ద మనసుతో వెంటనే అంగీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలపై అభిమానంతో వ్యవసాయ కాలేజీ, పత్తి పరిశోధన కేంద్రం, పశుసంవర్థక కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే 2016 జూన్-జూలై నుంచే తరగతులు జరుగుతాయి. ఈ విద్యా సంస్థలను నెలకొల్పేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు నగరం చుట్టుపక్కల ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీ అధికారులతో కలిసి పరిశీలించాం. హన్మకొండ మండలం మామునూర్లో పశుగణన కేంద్రం వద్ద ఉన్న 120 ఎకరాల భూమిలో పశుసంవర్థక కాలేజీని ఏర్పాటు చేసేందుకు వెటర్నరీ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదించనున్నాము. ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్)కు ప్రతిపాదిస్తున్నాము. ఇక్కడే పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నాము. సిద్ధాపూర్-అర్వపల్లి మధ్యలో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వ్యవసాయ కాలేజీకి, పత్తి పరిశోధన కేంద్రానికి ఈ భూములను ఇవ్వనున్నాము. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)ను మడికొండ-రాంపూర్ మధ్యలో ఏర్పాటు చేయనున్నాము. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో ఉన్న 18 ఎకరాల్లో హెచ్‌పీఎస్‌ను ఏర్పాటు చేసేందుకు సొసైటీ సభ్యులు అంగీకరించారు. వెంటనే నిర్మాణం చేపట్టేందుకు హెచ్‌పీఎస్ సొసైటీకి సులభ వాయిదా పద్ధతులపై చెల్లించేవిధంగా రూ.15 కోట్ల రుణం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశాము. హెచ్‌పీఎస్‌లో వచ్చే విద్యా సంత్సరంలోనే తరగతులు ప్రారంభించనున్నారు. తాత్కాలికంగా హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్ భవనాన్ని హెచ్‌పీఎస్ వారికి అప్పగించాలని నిర్ణయించాము. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రకారం విద్యా సంస్థల ఏర్పాటుపై ఆరు నెలల్లోనే హామీలు అమలు చేయనున్నాము’ అని కడియం శ్రీహరి తెలిపారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, జెడ్పీటీసీ సభ్యులు పాలకుర్తి సారంగపాణి, కె.సుభాష్‌గౌడ్, పార్టీ నాయకులు ఎల్లావుల లలితయాదవ్ పాల్గొన్నారు. -
‘నూతనం’... కావాలి అభివృద్ధి పథం
గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అభివృద్ధి పథంలో మరింత ముందడుగు వేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను మంత్రులు, అధికారులు, ప్రజలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోవాలన్నారు. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా వ్యవహరించాలన్నారు. ప్రజలు సోదరభావంతో, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... అందరికీ అంతా మంచి జరగాలని అభిప్రాయపడ్డారు. తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన తెలంగాణ పోలీసులను గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. శాంతిభద్రతలను సమర్థంగా అదుపులో ఉంచుతున్నారని కొనియాడారు. ఇదే ఒరవడిని మునుముందు కూడా కొనసాగించాలని సూచించారు. గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కె.మధుసూదనాచారి, ఏపీ శాసనమండలి చైర్మన్ డా.ఎ.చక్రపాణి, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, అడిషనల్ డీజీ సుదీప్లక్టాకియా, సీఐడీ ఏడీజీ సత్యనారాయణ్, హైదరాబాద్ సిటీ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఐపీఎస్‌లు పూర్ణచందర్రావు, సౌమ్యామిశ్రా, ఎం.కె.సింగ్, రమేష్‌రెడ్డి, ఈష్‌కుమార్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ లతో పాటు వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఉన్నారు. -
రూ. 2,500 కోట్లు ఇవ్వండి
♦ కరువును ఎదుర్కొనేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న సర్కారు ♦ సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం.. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ♦ ఢిల్లీకి వెళ్లిన మహమూద్ అలీ, కడియం, పోచారం, హరీశ్‌రావు ♦ నేడు కేంద్ర వ్యవసాయ మంత్రితో భేటీ.. ప్రధానిని కలిసే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కమ్ముకున్న దుర్భర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ. 2,500 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. అందులో తక్షణ సాయంగా రూ.1,000 కోట్లను వెంటనే మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనుంది. దీనిపై ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనుంది. తాగునీరు, పశుగ్రాసం, పంటల పెట్టుబడి రాయితీ అవసరాల దృష్ట్యా తగిన సాయం అందించాలని కోరనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లారు. ఈ మంత్రుల బృందం బుధవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్‌ను కలసి ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేయనుంది. తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరనుంది. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు వారు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. సమగ్ర వివరాలతో నివేదిక.. రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాల పరిస్థితిపై అందిన నివేదికలతో ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందించింది. దీన్ని కేంద్రానికి అందించనుంది. తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్ర కరువు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని మంత్రుల బృందం కోరనుంది. కరువుపై మంత్రుల ఉపసంఘం రాష్ట్రంలో కరువు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మంగళవారం మంత్రు ల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వ్యవహరిస్తారు. మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. -
ష్..!
వరంగల్ : బిహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు జరుగుతాయని భావించిన ఆశావహులకు నిరాశ మిగిలింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలు జోరును కాస్త తగ్గించాయి. ప్రధాన పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఎన్నికలు దూరంగా ఉన్నాయనే సమాచారంతో కొంచెం వెనక్కి తగ్గుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది లేనప్పుడు ఇప్పుడే హడావుడి ఎందుకనే ధోరణిలో అధిక మంది నేతలు ఉన్నారు. కొందరు మాత్రం ఎన్నికలు ఆలస్యమవడాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తమ ప్రాధాన్యతను చెప్పి టిక్కెట్ వచ్చేలా వ్యూహాలు అమలు చేసుకుంటున్నారు. సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీల ముఖ్యనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. జూన్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జూన్ 11న లోక్‌సభ స్పీకర్ జూన్ 11న కడియం రాజీనామాను ఆమోదించారు. నాటి నుంచి వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. టిక్కెట్‌పై పలువురి ఆశలు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్కు ఈ ఎన్నిక పెద్ద సవాలుగా మారనుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక, రాజకీయ వ్యూహం.. వంటి విషయాల్లో టీఆర్ఎస్ అధిష్టానం కొంత స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుకు పరీక్షగా మారనున్న ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని నేతలకే టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి కాకుండా గతం నుంచి పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది పూర్తిగా టీఆర్ఎస్ అధినేత నిర్ణయం ప్రకారమే జరుగుతుందని గులాబీ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు చెబుతున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి క్రియాశీలంగా ఉన్న బోడ డిన్న, పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి, జోరిక రమేశ్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్లతోపాటు ఒయాసిస్సు విద్యా సంస్థల అధినేత జన్ను పరంజ్యోతి గులాబీ పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాలవారీగా పార్టీ ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి కార్యక్రమాలు చేపడుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యమవుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఇటీవల కార్యక్రమాలను తగ్గించారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం వెతుకుతోంది. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఎవరైనా తెరమీదకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ వరంగల్ ఉప ఎన్నికలో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఉప ఎన్నిక నిర్వహణలో స్పష్టత లేకున్నా కార్యక్రమాల నిర్వహణలో మాత్రం బీజేపీ క్రీయాశీలంగానే వ్యవహరిస్తోంది. పార్టీకి చెందిన కీలకమైన నేతలు తరుచు వరంగల్ జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాగానే ఉన్నా అభ్యర్థి విషయంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతిని బరిలో దించాలని స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు కొత్త రవి, సోద రామకృష్ణ, చింతా సాంబమూర్తి, రిటైర్డ్ పోలీస్ అధికారి రామచంద్రు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ తదితర నేతలు బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తటస్థులను బరిలో దించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాల ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా ఉప ఎన్నిక నిర్వహణ ఆలస్యమవుతుండడంతో వ్యూహాల అమలు విషయంలో రాజకీయ పార్టీలు స్తబ్దుగానే వ్యవహరిస్తున్నాయి. -
దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయూలి
‘ఎర్రబెల్లి’ బఫూన్లా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు కల్మశం లేని ఈ నవ్వులు వసివాడారుు. కపటుల దాడితో గాయపడ్డారుు. ర్యాగింగ్ భూతం వికృత చేష్టలకు విసిగివేశారారుు. తుదకు ఉసురుతీసుకున్నారుు. హన్మకొండకు చెందిన దుర్గాబారుు, మురళీకృష్ణ దంపతుల గారాల పట్టి రిషితేశ్వరి.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ రూపంలో శ్రుతిమించిన సీనియర్ల రాక్షసత్వాన్ని తాను కనుమూయడం ద్వారా ప్రపంచం కళ్లకు కట్టింది. ఇది మనం మేల్కొనే సమయం. ర్యాగింగ్‌ను అంతం చేయూల్సిన తరుణం హన్మకొండ: టీడీపీకి దమ్ముంటే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేయూలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు సవాల్‌విసిరారు. టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి బఫూన్ల వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రవీందర్రావు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంత వెలిగిపోతుందో ఆపార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంతో తెలిసిపోరుుందన్నారు. దయాకర్‌రావు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అక్రమాలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బయటపెట్టారని తెలిపారు. కడియం రాజీనామా చేస్తే టీఆర్ఎస్లో చేరొచ్చని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆత్రుతతో ఉన్నారని, ఆయన టీఆర్ఎస్లోకి రావడం ఎన్నటికీ కుదరదన్నారు. పేదలకు మంజూరైన ఇళ్ల బిల్లులు కాజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లులు ఇవ్వాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎక్కడ పుట్టగతులు లేకుండా పోతాయోమోనని టీడీపీ విమర్శలు చేస్తుందని అన్నారు. సమావేశంలో నాయకులు గుడిమల్ల రవికుమార్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, మరుపల్లి రవి, చింతల యాదగిరి. నయిముద్దీన్, ఎల్లావుల లలితా యాదవ్, ఎడవెల్లి కృష్ణారెడ్డి, జన్ను జకార్యా, కె.వాసుదేవరెడ్డి, పోగుల రమేష్ పాల్గొన్నారు. -
మూడెకరాలు ముమ్మరం!
దళితుల భూపంపిణీ ప్రక్రియ వేగవంతం ప్రస్తుతం 24 మందికి 68 ఎకరాలు అందజేత 782 ఎకరాల భూమి కొనుగోలుకు కసరత్తు 652 ఎకరాల్లో ఎస్సీ కార్పొరేషన్ పరిశీలన పూర్తి ప్రతిపాదనలు సిద్ధం.. నక్కలగుట్ట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీ ప్రక్రియపై అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తు తం 24 మంది లబ్ధిదారుల కోసం 68 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఎస్సీ కార్పొరేషన్... ఇంకా 782 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో నర్సంపేట మండలం బానోజుపేటకు చెందిన ఏడుగురు దళిత నిరుపేద కుటుంబాలకు 21 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. వీరితోపాటు శాయంపేట మండలం కాట్రాపల్లిలో ఏడుగురు లబ్ధిదారులకు 19.33 ఎకరాలు, పర్వతగిరి మండలం వడ్లకొండలో ఆరుగురికి 17 ఎకరాలు, నర్మెట మండలం అమ్మాపురంలో నలుగురికి 10.07 ఎకరా ల భూమిని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఇచ్చిం ది. జిల్లాలో ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్లు మంజూరు చేసింది. అరుుతే జిల్లాలో భూమి కొనుగోలును పర్యవేక్షించిన అప్పటి జేసీ పౌసుమిబసు ఈ పథకంపై కొంత నిర్లిప్తతను వ్యవహరించడంతో ఆమెపై విమర్శలు వ్యక్తమయ్యూరుు. ప్రక్రియ వేగవంతం చేయూలి : కడియం జిల్లాలోని వివిధ పథకాల పురోగతిపై ఈనెల 9న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లాలో దళితులకు భూ పంపిణీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. ఈ పథకం అమలులో జిల్లా వెనుకపడిందని, 782 ఎకరాల భూమి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయూలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మండలాలు, గ్రామాలవారీగా సర్వే చేపట్టారు. ఇప్పటివరకు 23 మండలాల్లో 652 ఎకరాల భూమిని పరిశీలించిన అధికారులు కొనుగోలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణీత ధరలకు, భూమి యజమానులు చెబుతున్న ధరలకు మధ్య చాలా మేరకు వ్యత్యాసం ఉంది. ఈ ధరలు భూమి కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.