మూడెకరాలు ముమ్మరం!
దళితుల భూపంపిణీ ప్రక్రియ వేగవంతం
ప్రస్తుతం 24 మందికి 68 ఎకరాలు అందజేత 782 ఎకరాల భూమి కొనుగోలుకు కసరత్తు 652 ఎకరాల్లో ఎస్సీ కార్పొరేషన్ పరిశీలన పూర్తి ప్రతిపాదనలు సిద్ధం..
నక్కలగుట్ట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీ ప్రక్రియపై అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తు తం 24 మంది లబ్ధిదారుల కోసం 68 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఎస్సీ కార్పొరేషన్... ఇంకా 782 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో నర్సంపేట మండలం బానోజుపేటకు చెందిన ఏడుగురు దళిత నిరుపేద కుటుంబాలకు 21 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. వీరితోపాటు శాయంపేట మండలం కాట్రాపల్లిలో ఏడుగురు లబ్ధిదారులకు 19.33 ఎకరాలు, పర్వతగిరి మండలం వడ్లకొండలో ఆరుగురికి 17 ఎకరాలు, నర్మెట మండలం అమ్మాపురంలో నలుగురికి 10.07 ఎకరా ల భూమిని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఇచ్చిం ది. జిల్లాలో ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్లు మంజూరు చేసింది. అరుుతే జిల్లాలో భూమి కొనుగోలును పర్యవేక్షించిన అప్పటి జేసీ పౌసుమిబసు ఈ పథకంపై కొంత నిర్లిప్తతను వ్యవహరించడంతో ఆమెపై విమర్శలు వ్యక్తమయ్యూరుు.
ప్రక్రియ వేగవంతం చేయూలి : కడియం
జిల్లాలోని వివిధ పథకాల పురోగతిపై ఈనెల 9న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లాలో దళితులకు భూ పంపిణీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. ఈ పథకం అమలులో జిల్లా వెనుకపడిందని, 782 ఎకరాల భూమి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయూలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మండలాలు, గ్రామాలవారీగా సర్వే చేపట్టారు. ఇప్పటివరకు 23 మండలాల్లో 652 ఎకరాల భూమిని పరిశీలించిన అధికారులు కొనుగోలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణీత ధరలకు, భూమి యజమానులు చెబుతున్న ధరలకు మధ్య చాలా మేరకు వ్యత్యాసం ఉంది. ఈ ధరలు భూమి కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.