గాంధీభవన్‌లో మాట్లాడుతున్న కొప్పుల రాజు. చిత్రంలో ఆరేపల్లి, భట్టి
• దళితులకు మూడెకరాల భూ పంపిణీలో టీఆర్‌ఎస్ మోసం
• టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో కొప్పుల రాజు
సాక్షి, హైదరాబాద్: భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిస్తా మని మోసం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఊరూరా ఎండ గట్టాలని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితునికే తొలి అవకాశం దక్కుతుందని ప్రకటించిన కేసీఆర్.. తానే సీఎం కుర్చీలో కూర్చున్నారని, దళితుల అవకాశాన్ని తీసుకుని వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. మంగళ వారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్‌తోపాటు రాజు పాల్గొన్నారు. రాజు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయి నా దళితులకు మూడెకరాల భూ పంపి ణీపై పురోగతి లేదన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేసిందన్నారు. సమాజంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా పేదలె క్కువగా ఉన్న దళిత సామాజిక వర్గానికే అవకాశాలు రావాల్సి ఉంటుందని, సంక్షే మ పథకాలను అమలు చేయకపోతే ఎక్కు వగా నష్టపోయేదీ ఎస్సీ లేనన్నారు. నష్ట పోయిన దళిత జాతి పక్షాన కాంగ్రెస్ పోరా టం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయికి వెళ్లాలని.. భూమిలేని, ఇళ్లురాని దళి తులతో దరఖాస్తులు ఇప్పించాలన్నారు. గ్రామ స్థాయిలో ఎస్సీ సెల్ కార్య వర్గాన్ని పూర్తి చేయాలని, వీటితోనే పార్టీకి బలమైన పునాదులు ఏర్పడతాయ ని చెప్పారు.
ప్రచారమే కీలకం
రాజకీయాల్లో ప్రచారమే కీలకమని.. దేశ స్వాతం త్య్ర పోరాటం నుంచి ఇప్పటివరకు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ప్రచారం చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో కొప్పుల రాజు సూచించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్లు రవితో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.