దళితులను మోసం చేసిన కేసీఆర్
దళితులను మోసం చేసిన కేసీఆర్
Published Tue, Jun 6 2017 1:23 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
► ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి
మోత్కూరు(తుంగతుర్తి) : దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించి దళిత జాతిని మోసం చేశారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని పాలడుగు గ్రామంలో మల్లిఖార్జున స్వామి జాతర సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొంత డబ్బులతో 600 మందికి వాటర్ క్యాన్లను ఉచితంగా రాజగోపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తానని ఇంతవరకు పత్తాలేదని అన్నారు. పాల కేంద్రం నిర్మాణానికి రూ. 2 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అనంతరం దత్తప్పగూడెంలో పేద కుటుంబానికి చెందిన ముక్కెర్ల అనే వ్యక్తికి సొంత డబ్బులతో రూ. 2 లక్షల వ్యయంతో నిర్మించే డబుల్‌బెడ్రూమ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన బుర్ర సైదులు, కందికట్ల వెంకన్న, బి.ఉప్పల్‌రెడ్డి, మత్స్యగిరి, నర్సింహ్మ, శ్రీశైలం, సాయిబాబా తన అనుచరులతో కాంగ్రెస్‌పార్టీలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరిగారి ప్రీతమ్, జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీ, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ వి.పూర్ణచందర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్‌చక్రవర్తి, మండలపార్టీ మాజీ అధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, ఎంపీటీసీలు ఎలుగు పార్వతమ్మ, ముద్దం జయశ్రీ, కురిమిళ్ల ప్రమీళ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement