రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టడంలేదని, వెంటనే కరువు ఎమరెన్సీ ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
ఖమ్మం రూరల్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టడంలేదని, వెంటనే కరువు ఎమరెన్సీ ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తల్లంపాడులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఇవేమీ పట్టకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని తెలిపారు.
మిషన్ కాకతీయ పేరుతో మెత్తటి పనిని మిషన్‌లతో చేయిస్తూ, ఉపాధిహామీ కూలీలతో గట్టి పని చేయిస్తున్నారని, దీంతో వారికి కూలీ గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. కరువు నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న నీటి ట్యాంకర్లను చట్ట ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచితంగా నీటి సరఫరా చేయాలన్నారు.