
సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలతో బంగారు తెలంగాణ రాదని, సామాజిక న్యాయంతోనే అది సాధ్యమని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో జరిగిన పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు.
సామాజిక అంతరాలతో.. ఉన్నవాడు మరింత ధనవంతుడుగా.. పేదవాడు మరింత పేదవాడుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల నాడు కాంగ్రెస్ నేడు టీఆర్‌ఎస్, బీజేపీ కూడా ఒకే వైఖరితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ సాధనే సీపీఎం లక్ష్యమన్నారు. ఇందుకోసం రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment