BV Raghavulu
-
ఏపీ బడ్జెట్.. ఓన్లీ కోతల బడ్జెట్: బీవీ రాఘవులు
-
తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు: బీవీ రాఘవులు
-
లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు. ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇక కామన్ సివిల్‌కోడ్ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్ సివిల్‌కోడ్ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.ఉత్తమ పార్లమెంటేరియన్ మన ఏచూరి : అంబటిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారన్నారు. సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు. సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు. -
ఇక్కడ బీజేపీకి ఒక్క ఎంపీ సీటూ రావొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తొందని... మతోన్మాద వాతావరణాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీ ఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం జరగ్గా ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గద్దెదించడం తక్షణ రాజకీయ కర్తవ్యమన్నారు. బీజేపీలో ఉంటే నీతిపరులు లేదంటే అవినీతిపరు లు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019లో వచ్చిన ఫలితాలు రావేమోననే భయంతోనే బీజేపీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిందని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ అప్రజాస్వామికం: ఎస్ వీరయ్య ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం అప్రజాస్వామికమని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవితో పాటు కరువు ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా కు రూ. 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరిన వీరయ్య.. మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్ల మెంటు ఎన్నికల్లో సీపీఐ వైఖరిని ప్రకటించాలని ఆయన కోరారు. అవసరమైతే సీపీఐ, సీపీఎం సంప్రదించుకుంటాయని, వర్తమాన రాజకీయ పరిణామాలను చూసి ఎవరికి మద్దతివ్వాలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వీరయ్య వెల్లడించారు. -
రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలు కాకుండా ఆటంకాలు కల్పిస్తోందని విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిందించారు. తెలంగాణలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలి అదే విధంగా ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను సైతం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. దాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని అప్పుడే దేశ సమైక్యతను కాపాడుకోగలమన్నారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని నిందించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టుపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారనీ వారికి నచ్ఛిన వారిని న్యాయమూర్తులుగా నియమించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను సైతం కేంద్రం తొక్కిపెడుతోందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిసిత్థుల్లో రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీపై బీఆర్ఎస్ గట్టిగానే పోరాటం చేస్తోంది: తమ్మినేని ప్రజాసమస్యల కంటే మతచిచ్చురేపడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ’భాగ్యలక్ష్మి దేవాలయం పేరుతో విద్వేషాలు పెంచడం, సచివాలయం గుమ్మటాలు నిజాంకాలం నాటి కట్టడాలుగా ఉన్నాయనీ, మసీదులు తవ్వితే శవాలు వస్తే వారికి, శివలింగాలు వస్తే మాకు’ అంటూ బండి సంజయ్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ గట్టిగానే పోరాటం చేస్తోందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. తెలంగాణపై బీజేపీ గురిపెట్టిందని, అందుకే కేంద్ర మంత్రులు, ప్రధాని ఇక్కడికి వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందన్నారు. 17 నుంచి జన చైతన్య యాత్రలు బీజేపీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 17 నుంచి చేపట్టే జనచైతన్య యాత్రలో ప్రసంగాలతోపాటు విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. 17న వరంగల్‌లో మొదటి యాత్రకు ముఖ్యఅతి«థిగా సీతారాం ఏచూరి, 23న ఆదిలాబాద్‌లో రెండోయాత్రకు రాఘవులు, 24న నిజామాబాద్ లో మూడో యాత్రకు విజయరాఘవన్, 29న హైదరాబాద్‌లో ముగింపు సభకు ప్రకాశ్కరత్ ముఖ్యఅతిధిగా హాజరవుతారన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు తిరిగేలా బస్సు యాత్ర ప్రణాళికను రూపొందించామని తమ్మినేని చెప్పారు. -
ప్రధానితో ఏం మాట్లాడారో పవన్ చెప్పాలి
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీని కలిసిన పవన్ కల్యాణ్ భవిష్యత్‌లో రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెబుతున్నారని.. అసలు ఆ సమావేశంలో పవన్ ఏం మాట్లాడారో చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు బీవీ రాఘవులు శనివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తనను పిలిపించుకుని ప్రధాని మాట్లాడారని చెబుతున్న పవన్... ఆ వివరాలను చెప్పాలన్నారు. వారి కలయిక వ్యక్తిగత రహస్యమైతే చెప్పనవసరం లేదన్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తాము సమర్థిస్తున్నామని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. అయితే అవి పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు లోబడి పనిచేయాలని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు వంటి ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థికభారం మోపుతోందని విమర్శించారు. ప్రజలపై పడే భారం గురించి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా సమర్థించేరీతిలో వ్యవహరిస్తోందని చెప్పారు. సంఘ్ పరివార్ శక్తులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నించటంలేదని, మౌనంగా ఉంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని, విద్యుత్తు ప్లాంట్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని చెప్పారు. నరేంద్రమోదీ పాలనతో బీజేపీ ప్రజల నుంచి వేరుపడిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. -
కేంద్రం సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తోంది: బీవీ రాఘవులు
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం దేశంలో సమాఖ్య వ్యవ స్థను ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎం తెనా ఉందన్నారు. సుందరయ్య విజ్ఞానకేం ద్రంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో రాజకీయ ముసాయిదా తీ ర్మానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనం తరం మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కు లను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను అవమానిం చే విధంగా మోదీ పార్లమెంట్లో మాట్లా డడం సరైంది కాదన్నారు. ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. మతం పేరుతో ఓట్లను సాధించేందుకు ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే కర్ణాట కలో ప్రజలను రెచ్చ గొట్టి మత వివాదా నికి పురి గొలిపిందని ధ్వజమె త్తారు. ప్రజల భాష, వారి వేషధారణ, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలపై ఆంక్షలు విధిస్తూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం మట్లాడుతూ.. బీజేపీ విధానాలపై కఠినంగా ఉండాలని భావిస్తున్నామని చె ప్పారు. సీఎం కేసీఆర్‌కూడా బీజేపీకి వ్యతి రేకంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామ న్నారు. అయితే కేసీఆర్ పోడు భూముల విషయంలో అసెంబ్లీలో స్పష్టమైన హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి తప్ప.. మార్చడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు. సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్‌తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు. చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాశం జిల్లా వాసి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంకాయలపాటి శ్రీనివాసరావు (వీఎస్సార్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు ఆహ్వానితులు సహా 15 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 62 మందితో పార్టీ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. జాలా అంజయ్య అధ్యక్షతన ఐదుగురితో కంట్రోల్ కమిషన్ ఏర్పాటైంది. పార్టీ మహాసభల్లో చివరిరోజైన బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంఏ గఫూర్, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్ నరసింగరావు, సీహెచ్.బాబూరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, డి.రమాదేవి, మంతెన సీతారాం, బి.తులసీదాస్, వి.వెంకటేశ్వర్లు, పి.జమలయ్య,కె.లోకనాథం, మూలం రమేష్, ఆహ్వానితులుగా కె.సుబ్బరావమ్మ, సురేంద్ర కిల్లో ఎన్నికయ్యారు. వీఎస్సార్ ప్రస్థానం ఇలా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లిలో ఓ సామాన్య రైతు కుటుంబంలో 1960లో జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యను ప్రకాశం జిల్లాలోనే అభ్యసించారు. నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివిన ఆయన ఆ సమయంలోనే విద్యార్ధి ఉద్యమాల వైపు ఆకర్షితులై ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. యువజనోద్యమాలకు సారధ్యం వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకు వివిధ బాధ్యతల్లో పనిచేశారు. రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ రైతువాణి పత్రికను రైతుల్లోకి తీసుకెళ్లారు. ప్రజాశక్తి దినపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. దళిత్ సోషన్ ముక్తిమంచ్ (డీఎస్ఎంఎం) ఏర్పాటుచేసి వ్యవస్థాపక కన్వీనర్‌గా దేశవ్యాప్తంగా విస్తరించారు. కొంతకాలం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేశారు. ఆయన సతీమణి 1998లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. బీవీ రాఘవులు తరువాత ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రెండో వ్యక్తి శ్రీనివాసరావు. -
కేంద్ర విధానాలపై పోరాటం ఉధృతం చేయాలి
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం గ్రేటర్ విశాఖ కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ప్రస్తుత రాజకీయ–ఆర్థిక పరిస్థితులు–కర్తవ్యం అంశంపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల దేశంలో పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరిగిందని, విద్యా వ్యవస్థ కూడా దారుణంగా దెబ్బతిందన్నారు. మోడీ ప్రభుత్వం కరోనా వైరస్‌ను సాకుగా చూపి అవలంభించిన ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల వల్ల దేశంలో 10 శాతానికి పైగా నిరుద్యోగం పెరిగిందని దుయ్యబట్టారు. కొత్తగా నేషనల్ మోనటైజేషన్ పేరిట ప్రజా ఆస్తులను 40 ఏళ్ల పాటు ప్రైవేట్‌సంస్థలకు అప్పగించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, ప్రభుత్వ భూములను ప్రైవేట్‌కి కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, 78 వార్డు కార్పొరేటర్ డాక్టర్ బీ.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, అధికసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. -
మోదీ ‘రద్దు’ ప్రకటన నాటకమే
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఏ విషయంలో ఎవరికి ఎందుకు క్షమాపణ చెప్పారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. రైౖతులకు నష్టం కలిగించే నల్ల చట్టాలను రద్దు చేస్తామన్న మోదీ ప్రకటనను రైతులు నాటకంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిలతో కలసి ఎంబీ భవన్లో బీవీ రాఘవులు విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రకటనలో స్పష్టత లేదనీ, ప్రజల సానుభూతి పొందేందుకు ఒక నాటకంలా ఉందని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయం వల్ల 750 మంది రైతన్నలు బలైనందుకు మోదీ క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కాన్వాయ్‌తో రైతులను తొక్కించి చంపినందుకు ఆయన క్షమాపణ చెప్పారా అని నిలదీశారు. కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26న నిరసన కార్యక్రమాలతోపాటు విజయోత్సవాలు నిర్వహించాలని రైతాంగాన్ని కోరారు. కేసీఆర్‌పై అపవాదు రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ ప్రకటన హర్షణీయమని బీవీ రాఘవులు చెప్పారు. అప్పుడప్పుడూ ప్రజాఉద్యమాలకు మద్దతు ప్రకటించి ఆ తర్వాత నిశ్శబ్దం వహిస్తారన్న అపవాదు కేసీఆర్‌పై ఉందని, ఇప్పుడు కేంద్రంపై నికరంగా మాట్లాడి ఆ మచ్చను తొలగించుకోవాలని సూచించారు. హుజూరాబాద్ ఫలితం కారణంగానే కేసీఆర్ ఆ విధంగా స్పందించారని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ యాసంగి ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయాలని, ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా అఖిలపక్షంతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలపై దాడులకు నిరసనగా డిసెంబర్ 1న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. -
రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/అనకాపల్లి టౌన్/యలమంచిలి రూరల్/సత్తెనపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రైతులను వాహనాలతో తొక్కించి చంపిన వాళ్లను రక్షిస్తూ ప్రధాని మోదీ మానవ హక్కుల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని చెప్పారు. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విజయవాడ, సత్తెనపల్లి, అనకాపల్లి, యలమంచిలి రైల్వేస్టేషన్ల వద్ద రైలురోకో నిర్వహించారు. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రైతుసంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను చంపిన బీజేపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అనకాపల్లిలో రైలురోకో నిర్వహిస్తున్న 16 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు. -
బీజేపీ విధానాలను తిప్పికొడతాం: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు ఎదురుదెబ్బ తగిలినా ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలతో బీజేపీ విధానాలను తిప్పికొడతామన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెపె్టంబర్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని తమ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. రాఘవులు మాట్లాడుతూ, పార్టీ మహాసభల టైంటేబుల్‌ను కేంద్ర కమిటీ ప్రకటించిందని తెలిపారు. ఫిబ్రవరిలోపు శాఖ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహాసభలను పూర్తిచేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో అఖిల భారత మహాసభలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేరళలోని కన్నూరు జిల్లాలో అఖిలభారత మహాసభలను నిర్వహించబోతున్నామని తెలిపారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియలను ధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతున్నారన్నారు. వర్షపాతం మెరుగ్గా ఉండి పంటల దిగుబడి పెరిగినా, గిట్టుబాటు ధరల్లేక రైతాంగం సంక్షోభంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులు రోడ్డున పడటానికి బాబే కారణం: సీపీఎం
సాక్షి, విజయవాడ : పెట్టుబడిదారి విధానాన్ని అమలు చేసే దేశాలు కరోనా కట్టడి చేయడంలో విఫలమయ్యాయని సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సోషలిస్టు దేశాలు కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాయన్నారు. ఇందుకు క్యూబా దేశాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. నవంబర్ 7 నుంచి 15 వరకు రాష్ట వ్యాప్తంగా సీపీఎం పార్టీ రాజకీయ క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం విజయవాడలో ప్రచార ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు, వి ఉమామహేశ్వరరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం క్యాంపెయిన్‌ను బీవీ రాఘవులు జెండా ఊపి ప్రారంభించారు. చదవండి: ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. భారతదేశం 104 నుంచి సూచి 90కి పడిపోయిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకొనుగోలు శక్తి పెంచాలని సూచించారు. అంబానీ, ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రాయితీలు వారు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కరోనా కట్టడిలోవిఫలమైందని, ఆర్థిక వ్యవస్థను కుంటు పడేలా చేసిందని మండిపడ్డారు. దేశంలో ఆకలి ఆచావులు పెరిగి పోయాయన్నారు. మత కలహాలు పెరిగి, మహిళలకు రక్షణ కరువైందన్నారు. బీజేపీ కార్మికుల చట్టాలను కాల రాసిందని, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా కొత్త చట్టాలు తెచ్చారని విమర్శించారు. బీజేపీ దేశం మొత్తన్ని అమ్మేస్తుందని, కంపెనీలు, రైళ్లను ప్రవేటు పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: మతోన్మాదాన్ని బీజేపీ రెచ్చగొడుతుంది.. కార్మికుల, మహిళల, రైతుల,దళితుల, మైనార్టీల హక్కులను బీజేపీ కాలరాసింది. విద్యా వ్యవస్థ నాశనం చెసేలా నూతన విద్యా విధానంలో తెచ్చింది. రాజధాని, పోలవరం డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తుంది. రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్, వెనుకబడి జిల్లాలకు బుందేల్ కండ్ తరహా ప్యాకేజీ అంశాలలో బీజేపీ చేతులు దులుపుకుంటుంది. బీజేపీ మత కలహాలు సృష్టిస్తోంది. ట్రంప్‌ను అమెరికాలో ప్రజలు మట్టి కరిపించారు. ట్రంప్‌ను మోడీ భుజాన వేసుకుని ప్రచారం చేశారు. రాష్ట్రం బాగు కోరుకునే వారు బీజేపీని వ్యతిరేకించాలి. రాజధానికి 55 వేల ఎకరాలు అవసరం లేదని నాడే చెప్పాం. రాజధానికి 15 వేల ఎకరాలు చాలు. రాజధాని పేరుతో రియలేస్టేట్ వ్యాపారం చేశారు. చంద్రబాబు... చెప్పినా వినలేదు. రైతులు రోడ్డున పడటానికి చంద్రబాబే కారణం. రాజధాని పూర్తి కాకపోవడానికి కారణంగా చంద్రబాబే. రాష్ట్ర అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. -
‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఆదర్శ వివాహాలు సమాజంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. కులాంతర వివాహాలే కుల నిర్మూలనకు దోహదం చేస్తాయన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఏకైక కుమర్తె శిరీష, టీ 10 సీఈఓ ఎం.శ్రీనివాస్‌ల ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. యువతలో వస్తున్న మార్పును స్వాగతిస్తున్నామని, మన దేశంలో కట్నాలు పెరిగిపోయాయని, కొంత మంది తమ బ్లాక్ మనీని పెళ్లిల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే, కట్నం లేకుండా వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. భార్యాభర్తలు సమానంగా ఉన్నప్పుడే అది ఆదర్శ వివాహం అవుతుందన్నారు. నేడు ఆడపిల్లలు కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటున్నారని, ఇక్కడే కూతురు, కొడుకులను సమానంగా చూస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆదిరెడ్డి, కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ మళ్లీ వస్తే గడ్డుకాలమే: బీవీ రాఘవులు
సంగారెడ్డి టౌన్: పెట్టుబడి దారీ విధానం వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, కేంద్రంలో మరోసారి నరేం ద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు ఎలాంటి హక్కులు, రక్షణ, చట్టాలు ఉండవని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణం లో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోషలిజం – సమకాలీన కార్మిక వర్గ కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవులు మాట్లాడుతూ.. కార్మికుల శ్రమను దోచుకుంటూ, పెట్టుబడిదారుల సంక్షేమాన్ని కోరుకునే ఏ ప్రభుత్వాలూ ప్రజలు, కార్మికవర్గ శ్రేయస్సు ను కోరవన్నారు. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అది గడ్డు కాలమే అవుతుందన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
అవకాశవాద పార్టీలను ఓడించాలి
చర్ల: తెలంగాణలో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలను ఓడించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ సీపీఎం శాసనసభ అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆయన చర్ల మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలలో అవకాశవాద రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆశపడిన ప్రజానీకానికి భంగపాటే ఎదురయిందని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలన్ని వేరైనప్పటికీ, వాటి విధానాలన్నీ ఒక్కటేనని, అవన్ని ఒకే తానులోని ముక్కలని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, దళితులను టీఆర్ఎస్ బలవంతంగా వెళ్లగొట్టిందని, అంతేకాకుండా వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటీ చట్టాన్ని నీరుగార్చి తీవ్రంగా అవమానించిందని అన్నారు. పంటసాగుకు సాయం కోసం రైతుబంధు పేరిట తీసుకొచ్చిన పథకం బడా రైతులకు మాత్రమే ఉపయోపడిందని, చిన్నకారు రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. వద్ధిపేట చెక్‌డ్యాం నిర్మాణం కోసం రానున్న రోజుల్లో తమ పార్టీ పోరాడి సాధిస్తుందని అన్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావును గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావు, జిల్లా కమిటీ సభ్యుడు కొలగాని బ్రçహ్మాచారి, మండల కార్యదర్శి కారం నరేష్, సీనియర్ నాయకులు చింతూరు వెంకట్రావు, చీమలమర్రి మురళీకృష్ణ, వినోద్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వచ్చినా దోపిడీ ఆగలేదు
సాక్షి, ఇబ్రహీంపట్నం: తెలంగాణ వచ్చినా దోపిడీ ఆగడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు వీడిపోతే బడా బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వైద్య, విద్యాసంస్థల యాజమానులే లాభం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోని చంద్రుల పాలనకు తేడాలేదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఎం పార్టీ అభ్యర్థిగా పగడాల యాదయ్య నామినేషన్ దాఖలు చేసిన సోమవారం నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలు కుబేరులకే అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు తెలిపారు. ఆయా పార్టీలకు సామాజిక ఎజెండాలేదన్నారు. వీటికి ప్రత్యామ్నాయ పార్టీ రావాల్సిన అవసరంవుందన్నారు. అప్పుడే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ లక్ష్యంతో బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని, సామాజిక న్యాయం కోసం ముందుకు వెళుతుందన్నారు. ప్రజా సేవ చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న వారికే బీఎల్ఎఫ్లో సముచిత స్థానం కల్పించి సీట్లను కేటాయించినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. విద్య, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు, ఉద్యోగాలు, భూములు పొందే హక్కు చట్టప్రకారం ఉండాలన్నారు. గాలిలో మేడలు కట్టే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే యత్నాలు ఆయా పార్టీలు చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, నాయకులు కొడిగాళ్ళ భాస్కర్, గొరెంకల నర్సింహ, సామేల్, మధుసూదన్‌రెడ్డి, జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కూటమి’ దుస్థితికి దిగజారిన కాంగ్రెస్
కామారెడ్డి టౌన్: తమది 70 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్.. కూటమిగా ఏర్పడే దుస్థితికి దిగజారిందని, ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. శనివారం బీఎల్ఎఫ్ కామారెడ్డి అభ్యర్థి పుట్ట మల్లికార్జున్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్, టీడీపీలే ప్రధాన కారణమని చెప్పారు. టీడీపీకి రాష్ట్రంలో అసలు ముఖం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్.. కనీసం వెండి తెలంగాణను కూడా చేయలేదని, మట్టి తెలంగాణ చేస్తున్నాడని మండిపడ్డారు. లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న టీఆర్ఎస్.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక పాల నను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, రఫేల్ కుంభకోణం తదితర అంశాలపై స్పందించకుండా తాను లౌకకవాదినని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే రాజ్యాంగం మార్చాలని, ఆ దిశగా కేసీఆర్ ప్రయత్నం చేయకుండా మైనారిటీలను ఓట్లకోసం మోసం చేస్తున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం, లౌకికవాద పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పడిన బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
బీజేపీని ఓడించడానికి త్యాగాలకైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంకావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాఘవులు ప్రారంభోపన్యాసంచేస్తూ నాలుగేళ్ల మోదీ పాలనలో దేశం సామాజికంగా, ఆర్థికంగా ధ్వంసమైందని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపు తదితర అంశాలు దేశ ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని, దీంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోను, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయా లని సీపీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ అమలుచేస్తున్న ఆర్థిక విధానాలవల్ల రాష్ట్రాలన్నీ బిచ్చగాళ్లుగా మారిపోతున్నాయని విమర్శించారు. నాలుగేళ్ల కాలంలో అనేక కార్మిక చట్టాలకు కేంద్రం తూట్లు పొడిచిందని విమర్శించారు. డాలర్‌తో పోల్చినప్పు డు రూపాయి విలువ పడిపోతున్నదన్నారు. కుంభకోణాల్లో బీజేపీ నేతలు గతంలోని కాంగ్రెస్‌ను మించిపోయారని రాఘవులు ఆరోపించారు. రాఫెల్ దేశచరిత్రలో కనీవినీ ఎరుగని అతి పెద్ద కుంభకోణమన్నారు. అసలు ఏ రాష్ట్రంలోనూ స్థాపించని రిలయన్స్ యూనివర్సిటీకి మోదీ సర్కారు వెయ్యి కోట్లు అప్పుగా ఇచ్చిందన్నారు. సమస్యల్ని తప్పుదారి పట్టించడానికే మత వివాదాలకు తెరలేపుతోంద న్నారు. మతం, కులం పేరిట మూకదాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పెద్దనోట్ల రద్దుకు, జీఎస్టీకి మద్దతునిచ్చారని గుర్తుచేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన ఏపీ సీఎం చంద్రబాబు, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే ఎవరు నమ్ముతారని రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన మహాకూటమిలో చేరబోయేది లేదని స్పష్టం చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కేవరకూ పోరాడతామని అన్నారు. ఈ ప్రాంతం వెనుకబాటుకు కారణం కాంగ్రెస్సేనని, అలాంటి పార్టీ నేతృత్వంలోని మహాకూటమి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అవసరమైన అజెండాను రూపొందించగలుగుతుందా.. అని ఆయన ప్రశ్నించారు. -
దేశంలో దుర్మార్గపు పాలన సాగుతోంది
కామారెడ్డి టౌన్: దేశంలో దుర్మార్గపు పాలన సాగుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్లను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి రావడం కోసం దళితులు, గిరిజనులు, మహిళలకు కొన్ని తాయిలాలు ప్రకటించి మోసం చేస్తోందన్నా రు. శనివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ సభలో ఇంధన ధరల పెంపు, జీఎస్టీ, ప్రజల ఇబ్బందుల గురించి అమిత్ షా మాట్లాలేదన్నారు. సెప్టెంబర్ 17న ఏ హక్కుతో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతుందని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకు వత్తాసు.. బీజేపీ పాలనలో రూపాయి మారకం విలువ రోజు రోజుకూ క్షీణిస్తోందని రాఘవులు పేర్కొన్నారు. ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టకుండా పరోక్షంగా కార్పొరేట్ శక్తులకు వత్తాసుపలుకుతోందని విమర్శించారు. అర్థిక విధానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు తేడా లేదన్నారు. కాంగ్రెస్ అవినీతిపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ.. నాలుగున్నరేళ్లలో అవినీతిపరులను శిక్షించకపోగా.. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీలాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించారన్నారు. మాల్యా దేశం విడిచి వెళ్లడానికి మోదీకి అతి దగ్గరైన ఓ సీబీఐ అధికారి సహకరించారని మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. పార్లమెంట్ వ్యవస్థను నీరుగారుస్తున్నారు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను నీరుగారుస్తోందని రాఘవులు ఆరోపించారు. రాజ్యసభలో చర్చ జరగనీయకుండా కీలక బిల్లులను ద్రవ్యబిల్లులుగా తీసుకొచ్చారన్నారు. విప్లవ రచయితలు, ప్రజా స్వామ్యవాదులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకరించి ఆ పార్టీని ఓడించే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మతోన్మాదానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇద్దరు చంద్రులను నమ్మొద్దు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు నాయుడులను ప్రజలు నమ్మవద్దని రాఘవులు కోరారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారన్నారు. బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తామని, ఇద్దరు చంద్రులనూ ఓడిస్తామని అన్నారు. ఎన్నికల పొత్తుల విషయంలో ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మూడంచెల ఎత్తుగడ: తమ్మినేని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి మూడంచెల ఎత్తుగడ అవలంబిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, సీపీఎం భాగస్వామ్య బీఎల్‌ఎఫ్‌తో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఎక్కడైతే సీపీఎం, బీఎల్ఎఫ్ బలహీనంగా ఉన్నాయో ఆ స్థానాల్లో పోటీలో ఉండకుండా టీఆర్ఎస్ను ఓడించేందుకు ఇతర పార్టీలకు సహకరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జ్యోతి, పోతునేని సుదర్శన్, సాయిబాబు, చుక్కరాములు, భాస్కర్, వెంకట్రాములు, 31 జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. -
బీజేపీపై ఈగ వాలకుండా చూసి..ఇప్పుడేమో
ఢిల్లీ: పీడీ ఖాతాల కుంభకోణంపై విచారణ జరిపించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల పాటు బీజేపీపై ఈగ వాలకుండా టీడీపీ చూసిందని..ఇప్పుడేమో అన్నింటికీ బీజేపీయే కారణమని అంటున్నదని విమర్శించారు. అధికారంలో ఉండి రెండు పార్టీలూ కీచులాడుతున్నాయని మండిపడ్డారు. ఇదేదో జీవీఎల్ నరసింహారావు, కుటుంబరావు మధ్య వ్యవహారం కాకూడదని, పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరిగి తీరాల్సిందేనని పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో కాగ్ అనేక లోటుపాట్లను ఎత్తి చూపిందని వ్యాఖ్యానించారు. టీడీపీ రాష్ట్రంలోని గనులను దోచుకుని వచ్చే ఎన్నికలకు ఆదాయవనరుగా మార్చుకుందని విమర్శించారు. గనుల శాఖ దీనికి ఒక సాధనంగా మారిందని చెప్పారు. గనుల శాఖలో పూర్తి ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ గనుల తవ్వకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గనుల్లో అనేక మంది కూలీలు బలవుతున్నా సర్కారు చోద్యం చూస్తోందని విమర్శించారు. విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పద్ధతుల ప్రకారం ఇసుక, గనులు దోచుకుంటున్నారని ఆరోపించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మృతిపట్ల సీపీఎం ప్రగాఢ సంతాపం తెలియజేస్తోందని వెల్లడించారు. -
కశ్మీర్లో తీవ్ర గందరగోళం: రాఘవులు
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ పాలనలో తీవ్ర గందరగోళం నెలకొందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశంలో భాగంగా కశ్మీర్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు. దేశ న్యాయవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, కొలీజియం సూచించిన వ్యక్తిని సుప్రీం కోర్టు జడ్జిగా నియమించకుండా కేంద్రం జాప్యం చేస్తోందని చెప్పారు. న్యాయవ్యవస్థలో వివాదాలకు తావులేకుండా జాతీయ జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు. రైతాంగం సమస్యల మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతుల దుస్థితిని ఇంకా పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలసి ఛలో పార్లమెంటు నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో పరిస్థితులు గురించి కూడా కేంద్ర కమిటీ సమీక్షించినట్లు తెలిపారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్లు సీపీఎంను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే సీపీఎం కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడులను ఖండించాలని కోరారు. 2019 సాధారణ ఎన్నికల ఎత్తుగడలు గురించి వచ్చే సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ అన్నారని, ఇంతవరకూ ఆ ఊసే లేదని చెప్పారు. బీజేపీ, ఏఏపీపై వ్యవహరించిన తీరును కేసీఆర్ ఖండించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన నిరసన దీక్షకు కేసీఆర్ మద్దతు ఇచ్చింటే బావుండేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉందని ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని అన్నారని, మరి కేజ్రీవాల్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన లాభం చేకూరదని కేసీఆర్ గమనించాలని హితవు పలికారు. -
‘చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇపుడు నీతులు చెబుతున్నారని సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగేళ్ల బురదను ఎవరు కడుగుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీ కాళ్లు పట్టుకుని, ఇపుడు కాళ్లు లాగుతానంటున్నారన్నారు. తనకు అధికారమిస్తే 15 ఏళ్లు రాష్ట్రానికి హోదా తెస్తానన్న బాబు ఇప్పుడేం మాట్లాడుతున్నారు?.. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఎన్నో హామిలిచ్చి.. చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నారు.. మరీ ఈ నాలుగేళ్ళ నుంచి ఏం చేస్తున్నారన్నారు. ఇప్పుడు దీక్ష చేస్తే నాలుగేళ్ళగా చేసిన పాపం పోతుందా అని నిలదీశారు. రమేష్ చేసే దీక్షలో చిత్తశుద్ది లేదన్నారు. ఏ సమస్యపైనైనా దీక్షలు, నిరసనలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం తమని అరెస్టు చేస్తుందని, కానీ చంద్రబాబు దీక్ష చేస్తే ఆయన్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేస్తే ప్రజాస్వామ్యం, తాము చేస్తే అరాచకమా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇష్టమొచ్చినట్లు తినేశారని, ఇప్పుడు అమరావతిని తింటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని, గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో పెడుతోందని పేర్కొన్నారు. -
‘ప్రధాని చేసిన సూచన ప్రమాదకరం’
సాక్షి, విజయవాడ : మూడో ప్రత్యామ్నాయం(థర్డ్ ఫ్రంట్) కోసం తమ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ విధానాన్ని దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నీతి అయోగ్ సమావేశంలో జమిలీ ఎన్నికలపై ప్రధాని చేసిన సూచన ప్రమాదకరమని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరగాలో ప్రజలు నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహార శైలి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రతిపత్తి లేని సంస్థగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తామని తెలిపారు. రాజ్యాంగబద్దంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందన్నారు. తాము అడిగినప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజ్ కావాలన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం డిమాండ్ చేయడం సంతోషం అన్నారు. -
థర్డ్ ఫ్రంట్ కోసం పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు
-
పదేళ్లకు కూడా అమరావతి అభివృద్ధి చెందదు..
తెనాలి: చంద్రబాబు తీరు వల్ల వచ్చే పదేళ్లకు కూడా రాజధాని అమరావతి అభివృద్ధి చెందదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిపై పడ్డారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల కార్యాలయాన్ని సోమవారం బీవీ రాఘవులు ప్రారంభించారు. అనంతరం సీపీఎం తెనాలి డివిజన్ కన్వీనర్ ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రాఘవులు ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరిగినప్పుడే అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు. లేకుంటే ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్ర పాలకుల శ్రద్ధ అంతా ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి కాకుండా.. ఎంటర్టైన్మెంట్ మీదే ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి ముందుకు సాగాలంటే ప్రత్యేకమైన నమూనా కావాలని, అది వామపక్షాలు మాత్రమే తేగలవని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న నేరాల్లో యాభై శాతం మద్యం కారణంగానే జరుగుతున్నాయని వెల్లడైనా.. మరిన్ని మద్యం, బెల్టు షాపులకు అనుమతిస్తుండటం దారుణమన్నారు. సమావేశంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు షేక్ హుస్సేన్‌వలి, అన్నపరెడ్డి కోటిరెడ్డి, పాశం రామారావు, నెల్లూరు ప్రజా వైద్యశాల డాక్టర్ పి.అజయ్‌కుమార్, డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, దండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సింహాచలం, కంఠంనేని హనుమంతరావు, బొనిగల అగస్టీన్, ప్రధాన దాత పండా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన!
విజయవాడ: మార్పు మార్పు అంటూ కేవలం వాఖ్యలు చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కారల్ మార్క్స్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచే కొద్ది మార్క్స్ సిద్ధాంతాలపై ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..ఇటీవల మార్క్సిజంపై యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించడానికి మార్క్స్ కృషి చేశారన్నారు. అందుకే మార్క్స్‌ని ప్రపంచం గుర్తుపెట్టుకుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగడంతో యువతలో ఆగ్రహం పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని అభిప్రాయపడ్డారు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలో వైవిధ్యం వచ్చిందని, ఇదే కొనసాగితే సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సోషలిజం వల్లే రాజ్యం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. భారతదేశం సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ పోవాలని రాఘవులు పేర్కొన్నారు. వామపక్షాలకు మంచి రోజులొస్తాయి: మధు మన రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని అందరూ అంటున్నారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను యువత వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు లేవన్న చోటే వామపక్షాల ఉద్యమాలు బలపడుతున్నాయని మధు పేర్కొన్నారు. -
అభిశంసన తీర్మానం తిరస్కరణ తగదు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ప్రతిపక్షపార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడం సబబు కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి మంగళవారం మాట్లాడారు. అభిశంసన తీర్మానంపై చర్చ జరిగితే అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయని, నోటీసును ఏకపక్షంగా తిరస్కరించడం ద్వారా చర్చకు అవకాశం లేకుండా చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. రాజకీయ విధానం, పార్టీ నిర్మాణం, నాయకత్వ ఎన్నికపై మహాసభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసమే పోరాడతామని తమ్మినేని అన్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ప్రత్యేక హోదా కోసం ఏపీ గర్జిస్తోంది
-
చంద్రబాబు గెలుపు కలలోమాటే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో రగులుతున్న ఆగ్రహం చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సబ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో మార్పు గమనించి ప్లేటు ఫిరాయించి మళ్లీ హోదా నినాదాన్ని ఎత్తుకున్నా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలనకంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అతిచెడ్డ అభివృద్ధి నమూనాకు బాబు పాలన గుర్తుగా మిగిలిపోనుందని, పట్టిసీమ మొదలుకొని పోలవరం ప్రాజెక్టు వరకు ముడుపులతో అవినీతి రాజ్యమేలుతోందని, పట్టిసీమలో అవినీతిపై కాగ్ సర్టిఫై చేయడమే దీనికి తార్కాణమని అన్నారు. నాలుగేళ్లు నరేంద్ర మోదీకి, బీజేపీకి పాదసేవ చేసి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చంద్రబాబు అంటే ఎవరైనా నమ్మవచ్చు కానీ వామపక్షాలు అలా మోసపోవడానికి సిద్ధంగా లేవన్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు అసలు కనిపించడం లేదంటున్న బీవీ రాఘవులు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏమిటీ బాధ, ఇబ్బంది అని ఎప్పుడైనా అనిపించిందా? మొదట్లో రాజకీయాల్లో లోతుపాతులు తక్కువగా తెలిసేవి. ఆదర్శం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఏమిటి రాజకీయాలు ఇలా ఉన్నాయి అనిపించింది కానీ ఇప్పుడు వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాను. మనం చూస్తున్న వాస్తవాలు, వైరుధ్యాలు ఈ సమాజంలో ఉన్నవే. వాటిని ఎలా పెకిలించుకుని పోవడం, సర్దుకునిపోవడం లేక వేరు చేసుకోవడం అనేవి మనం నేర్చుకోవాలి తప్ప మనకు మనం నిరాశా నిస్పహలకు గురికావాల్సిన అవసరం లేదు. నిరాశకు గురయితే పరిష్కారం దొరకదు కదా. మనం ఆ వైరుధ్యాల్లో చురుగ్గా జోక్యం చేసుకోవడం ద్వారా, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం ద్వారా మార్పునకు కారణమవుతాం. మోదీ, చంద్రబాబు మధ్య ఏం జరిగి ఉందంటారు? నాలుగేళ్ల పాటు బీజేపీకి, మోదీకి వీరసేవ చేసిన చంద్రబాబు ఇప్పుడు వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి ఒక్క ముక్కంటే ముక్క కూడా పడని తర్వాత ప్రజల్లో నాలుగేళ్లుగా పేరుకుపోయిన ఆగ్రహం బద్ధలైపోయింది. నాలుగేళ్లు చంద్రబాబు చూపిన ఆశలిక నెరవేరవని తెలియడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఏపీలో ప్రజలు ఎంతగా దహించుకుపోతున్నారంటే, వామపక్షాల బలం ఇప్పుడు తక్కువ. కానీ వామపక్షాలు బంద్‌కు పిలుపునిస్తే జనజీవితం స్తంభించిపోయింది. ఆ ప్రజాగ్రహాన్ని తట్టుకుని నిలబడాలంటే బాబుకు ప్లేట్ ఫిరాయించక తప్పని పరిస్థితి. ఏపీలో 23 మంది, తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేశారు కదా? ఫిరాయింపు చేసినవాడు తన పదవికి రాజీనామా చేయడం కాదు. ఫిరాయించిన మరుక్షణం వారి పదవులు రద్దయిపోవాలని, అదే పరిష్కారమని తొలినుంచీ మా వాదన. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? ఈ నాలుగేళ్లూ చంద్రబాబు అధికారంలో లేకుంటే ఏపీ బాగుపడేది. ఈ నాలుగేళ్లూ రాజధాని చుట్టూ తిరిగాడు. కానీ, రాజధానే కనిపించడం లేదు. పరిశ్రమలన్నారు. భాగస్వామ్య సదస్సులన్నారు ఒక్క రూపాయి పెట్టుబడులు వచ్చింది లేదు. లేదూ బీజేపీ మతతత్వాన్ని అడ్డుకునే ప్రయత్నమైనా చేశాడా అంటే ఆ పార్టీకే నాలుగేళ్లు సేవ చేసి దానికి కొమ్ములు తెచ్చేశాడు. బీజేపీకి బలం కల్పించినవాడిగానే మిగిలిపోయాడు. ప్రత్యేక హోదా వద్దన్న బాబు.. ఇప్పుడెందుకు కావాలంటున్నారు? ఇప్పుడు ప్రజలు ప్రత్యేక హోదా గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో వారి ఆగ్రహాన్ని తట్టుకోవాలంటే హోదా జపం చేయాల్సిందే మరి. ప్రజాగ్రహాన్ని తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. దాన్ని తట్టుకోవాలంటే నేను ఎన్డీయే నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను కదా. విమర్శిస్తున్నాను కదా? అని చెప్పుకోవాలి మరి. గతంలో చంద్రబాబు ఎనిమిదేళ్ల పాలనకు, ఇప్పటి నాలుగేళ్ల పాలనకు తేడా ఏమిటి? ఉమ్మడి రాష్ట్రంలోనూ బాబు అభివృద్ధి నమూనా గొప్పగా ఏమీ లేదు. ఇప్పుడయితే అతి చెత్త నమూనాకు ఆయన పాలన గుర్తుగా ఉంది. రాజధాని, నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమల విషయంలోనే కాదు అన్నిటికంటే మించి రాష్ట్ర విభజనలోనూ బాబు నాటకాలాడాడు. అన్యాయంగా విభజన చేశారు అని ఇప్పుడంటున్నాడు. ఆ అన్యాయపు విభజనలో ఈయన పాత్ర లేదా? ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెడితే ఏం లాభం? పోలవరం ప్రాజెక్టుపై మీ అభిప్రాయం? రాజధాని, ప్రత్యేక హోదా విషయంలో మేం ఆనాడు చెప్పినవి ఏరకంగా ఇప్పుడు వాస్తవం అవుతున్నాయో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరుగుతోంది. 900 మెగావాట్ల విద్యుత్తు విషయం పక్కనపెట్టి మీరు ప్రాజెక్టు నిర్మించండి. అప్పుడు ప్రాజెక్టు ఇంత ఎత్తుకు కట్టాల్సిన పని లేదని మేం గతంలోనే చెప్పాం. కేవలం సాగునీటి కోసమే అయితే ఇంత ఎత్తు ప్రాజెక్టు అవసరం లేదు. పైగా ఇంత పెద్ద ప్రాజెక్టు వ్యవహారం కచ్చితంగా ముడుపులతో ముడిపడి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి బాబు ఎందుకు తీసుకున్నట్లు? మేమయితే తొందరగా పూర్తి చేస్తాం అని చెప్పి కేంద్రం నుంచి తీసుకున్నాడు. బీజేపీ తన చెప్పుచేతల్లో ఉంటుందని, తమ మధ్య బంధం శాశ్వతంగా ఉంటుందని అనుకుని ఉండవచ్చు. లేకపోతే కేంద్రం కాంట్రాక్టర్లకు ఇస్తే ముడుపులన్నీ వారికే పోతాయి తప్ప నా వాటా ఏమిటి అనుకుని ఉండవచ్చు కూడా. పైగా పోలవరాన్ని 2018లో, 19లో కట్టేస్తామంటున్నారు. భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 30 ఏళ్లకు లోపల పూర్తయిన చరిత్ర లేదు. పదిహేనేళ్లకు లోపల ఎస్కలేషన్ పూర్తయిన చరిత్ర లేదు. పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్ నివేదించింది. మీ అభిప్రాయం? ముడుపులకు అధికారిక ముద్ర వేసేశారని ఆనాడే మేం చెప్పాం. కాకపోతే కాగ్ దాన్ని ఇప్పుడు బయటపెట్టిందంతే. ఆ అవినీతిని సర్టిఫై చేసింది. బాబు పాలన అంటేనే అవినీతి. ఇప్పుడు అది ఇంకా ఎక్కువైంది. మరింత స్వేచ్ఛగా దోచుకోవడానికి బాబు అవకాశమిస్తున్నట్లు కనబడుతోంది. ప్రజలే కాదు టీడీపీ వాళ్లు కూడా ఇదే చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతారా? ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనబడుతోంది. అది ఓట్ల రూపంలో మారేకొద్దీ ఇతరత్రా అంశాలు వస్తాయి. పాలించే పార్టీల వద్ద డబ్బుకు కొదవలేదు కాబట్టి డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తారు. కులం కార్డు ఉపయోగిస్తారు. అఖిల భారత స్థాయిలో ఒక వాతావరణం తీసుకొచ్చి దానిలో భాగస్వాములమయ్యాం అని చెప్పి అలా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తారు. వైఎస్ జగన్‌పై, ఆయన పాదయాత్రపై మీ అభిప్రాయం? ప్రత్యేక హోదా అంశంపై జనం బాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ తొలినుంచి హోదాను కోరుకుంటున్నారు. కానీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం కదా. పాదయాత్ర ఎప్పటికీ మంచిదే. జనంని దగ్గరగా చూస్తారు. వారి సమస్యలు వింటారు. ఆ రకంగా ఎవరు పాదయాత్ర చేసినా మంచిదే. కానీ కేవలం పాదయాత్ర మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి తెస్తుందని ఇప్పుడే చెప్పలేం కదా. బాబు బీజేపీకి దూరమయ్యారు కాబట్టి మళ్లీ వామపక్షాలతో కలిసే అవకాశముందా? ఆ అధ్యాయం ముగిసిపోయింది. నాలుగేళ్ల పాటు బీజేపీకి పాదసేవ చేసి ఇవ్వాళ నేను పోరాడుతున్నాను అని చెబితే ఎవరయినా కొంతమంది మోసపోవచ్చు కానీ వామపక్షంగా మేం అలా మోసపోవడానికి సిద్ధంగా లేం. చంద్రబాబు, కేసీర్కి ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకాశముంది? ఏపీ, తెలంగాణల్లో ప్రజాస్వామ్యానికి, ఉద్యమాలకు, ప్రజాభిప్రాయానికి ఏమాత్రం విలువనిచ్చే పాలన జరగడం లేదు. కేసీఆర్ ప్రజాస్వామ్యం విషయంలో కాస్త సర్దుబాటు చేసుకుంటే, మారితే తనకు ప్రయోజనం ఉంటుందేమో కానీ బాబుకు మాత్రం పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. తెలంగాణ విషయంలో అంత స్పష్టంగా చెప్పలేను కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2HskLlP / https://bit.ly/2HH54Vj -
బీజేపీని ఓడించడమే మా లక్ష్యం: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించడమే తమ పార్టీ ప్రథమ లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మత ప్రాతిపదికన జరిగే రాజకీయాలకు సీపీఎం వ్యతిరేకమని.. వ్యక్తి స్వేచ్ఛను హరించేలా కేంద్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర నేతలు బి.వెంకట్, టి.సాగర్, రమలతో కలసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలను దెబ్బతీయాలనే ఆలోచనతోనే బీజేపీ ముందుకెళ్తోందని ఆరోపించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో పార్టీ నిర్మాణంతో పాటు రాజకీయ విధివిధానాలపై చర్చిస్తామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. జాతీయ మహాసభల ప్రాంగణానికి మహ్మద్ అమీన్నగర్గా, సభా వేదికకు కగేమ్ దాస్, సుకుమెల్ సేన్ల పేర్లు పెట్టామని చెప్పారు. 18న ఉదయం 10 గంటలకు సీపీఎం సీనియర్ నేత మల్లు స్వరాజ్యం పార్టీ జెండావిష్కరణతో ప్రారంభ సభ మొదలవుతుందన్నారు. దీనికి ఐదు వామపక్షాల జాతీయ నేతలు హాజరవుతారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు, 8 మంది సీనియర్ నేతలు మొత్తం 846 మంది హాజరవుతారన్నారు. మూడ్రోజుల పాటు 25 ముఖ్యమైన తీర్మానాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. 22న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని రాఘవులు వెల్లడించారు. -
ఎరుపెక్కిన నల్లగొండ
నల్లగొండ టౌన్: సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలకు నల్లగొండ ముస్తాబైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 4 రోజులపాటు జరిగే ఈ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్ర జెండాలు, ఎర్ర తోరణాలతో పట్టణమం తా ఎరుపుమయమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయి. ముందుగా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఐదువేల మంది రెడ్‌షర్ట్ వలంటీర్లతో కవాతు చేస్తారు. ప్రారంభ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి తదితర అంశాలతో పాటు బహుజన ఫ్రంట్ ఏర్పాటు విషయం పై చర్చించనున్నారు. ఈ సభలకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన నేతలు, 800 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. మహాసభల విజయవంతం కోసం అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. 15 రోజులుగా కళాకారులు ఆటాపాటలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఫొటో ఎగ్జిబిషన్: సభల సందర్భంగా నల్లగొండ లోని అంబేద్కర్ భవన్లో శనివారం ఫొటోలు, కార్టూన్న్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. -
ఎగుమతులు తగ్గిపోయాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.15 వేల కోట్ల ఎగుమతులు తగ్గిపోయాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్లలో ఏర్పాటు చేయాలనుకున్న డ్రైపోర్టులను మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది కేంద్రం ప్రజా బడ్జెట్‌ను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాలు దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టాయని, వ్యవసాయాన్ని విస్మరించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు నష్టాల్లో ఉన్నారని వీరిని ఆదుకునేలా గిట్టుబాటు ధర కల్పిం చే చట్టం తేవాలన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రత్యామ్నాయం కోసమే బీఎల్ఎఫ్: తమ్మినేని కేంద్ర ప్రైవేటీకరణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతోందని, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న నష్టాన్ని కూడా ప్రశ్నించలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారని తమ్మి నేని విమర్శించారు. వచ్చేనెల 4 నుంచి 7 వరకు నల్లగొండలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసమే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పాటైందని అన్నారు. బీజేపీతో, మరోవైపు ఎంఐంఎతో దోస్తీ చేస్తూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. -
సామాజిక న్యాయంతోనే బంగారు తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలతో బంగారు తెలంగాణ రాదని, సామాజిక న్యాయంతోనే అది సాధ్యమని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో జరిగిన పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. సామాజిక అంతరాలతో.. ఉన్నవాడు మరింత ధనవంతుడుగా.. పేదవాడు మరింత పేదవాడుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల నాడు కాంగ్రెస్ నేడు టీఆర్ఎస్, బీజేపీ కూడా ఒకే వైఖరితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ సాధనే సీపీఎం లక్ష్యమన్నారు. ఇందుకోసం రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళ్తామన్నారు. -
అగ్రిటెక్ సదస్సుతో ఒరిగిందేమీ లేదు: రాఘవులు
సాక్షి, విశాఖపట్టణం: విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సుతో సన్న, చిన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే సదస్సు నిర్వహించారన్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులకు చట్టరూపం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పించలేని పారిశ్రామికరణతో ప్రయోజనంలేదని, ఆహార ఉత్పత్తులను పక్కనబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. -
పోరాటాలతోనే ప్రభుత్వ సంస్థల రక్షణ
► మోదీ, బాబులకు ప్రైవేటుపైనే ప్రేమ ► రైల్వే, రక్షణ, ఓడరేవుల భూములను కారుచౌకగా కట్టబెట్టే పన్నాగం ► సీపీఎం నేత బీవీ రాఘవులు ధ్వజం ► ‘సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ విశాఖ పేరుతో ’ భారీ ర్యాలీ, బహిరంగ సభ ద్వారకానగర్ (విశాఖ దక్షిణం): ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం చూపుతున్నాయని, ఇందులో భాగంగా విశాఖలో కూడా అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ధ్వజ మెత్తారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వకపోగా రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ విశాఖ పేరుతో ’ రైల్వేస్టేషన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించేందుకు పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న విశాఖ నేడు మహా నగరంగా మారడానికి స్టీల్‌ప్లాంట్, ఓడరేవు, (పోర్టు), భెల్, రైల్వే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలే కారణమని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధారాదత్తం చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాపోరాటాలతోనే వీటిని అడ్డుకోవాలని పిలుపిచ్చారు. విశాఖతో సహా దేశంలో 42 ప్రధాన రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పేరుతో చుట్టూ ఉండే భూములు, ఆస్తులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌పరం చేశారని, మరికొన్ని మూసివేశారని చెప్పారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్మికులు పనిచేయడం లేదనే దుష్ప్రచారాన్ని ప్రభుత్వ అనుకూల మీడియాతో చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టీల్ప్లాంట్లు, హెచ్‌పీసీఎల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలు ఎంతో ప్రగతి సాధించాయంటే కార్మికులు కృషి కారణం కాదా అని ప్రశ్నించారు. సత్యం జంక్షన్ వద్ద టెక్ మహేంద్ర ఐటీ సంస్థలు నెలకొల్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్ గంగారావు మాట్లాడుతూ విశాఖ నగరంలో అభివృద్ధి పేరిట అధికంగా పన్నుల భారం మోపుతున్నారన్నారు. విశాఖలో భెల్, హెచ్‌పీసీఎల్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) ఎన్ఏడీ, నేవల్ డాక్‌యార్డు, డీఆర్డీవో, రైల్వే వంటి సంస్థల్లో లక్షా 10 వేల మంది వరకు పర్మినెంట్ ఉద్యోగులు, వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఇంకో 60 వేల మంది పదవీవిరమణ చేసిన వారు ఉన్నారని, వీటిపై ఆధారపడి లక్షాలాది మంది జనం జీవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానాలతో ఇలాంటి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించారు. సీపీఎం నగర నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఎం.జగ్గునాయుడు, పి.జగన్, పి.ప్రభావతి. పి.కోటేశ్వరరావు, కె.ఎన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర వైఫల్యాలపై ప్రచారం: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు ఈనెల 15 నుంచి జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. సెప్టెంబర్ 1వరకు ఈ కార్యక్రమాలను విస్తృతంగా సాగించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. రెండ్రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల అనంతరం ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ధోరణిని అనుసరిస్తు న్నాయన్నారు. ౖవివిధ కార్పొరేట్ సంస్థలకు 2016–17 సంవత్సరంలో రూ.1.56 లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. కానీ రైతుల అప్పులు మాత్రం పైసా మాఫీ చేయలేదన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల పనులపై సంబంధిత మంత్రులు లేకుండా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి సచివా లయాన్ని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. -
ఎస్కేయూసెట్ గడువు పెంపు
ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎస్కేయూసెట్–2017 దరఖాస్తు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. మే 5 వరకు రూ.500 అపరాధ రుసుముతో, 10 వరకు రూ.వెయ్యి అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
మహిళ లేని కేబినెట్‌తో సాధికారతా?
సీపీఎం బహిరంగసభలో బీవీ రాఘవులు ఖమ్మం: మహిళలేని కేబినెట్‌తో మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. మహాజన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఖమ్మం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఏపీలోని అమరావతిలో నిర్వహించిన జాతీయ పార్లమెంట్లో పాల్గొన్న కేసీఆర్ కుమార్తె కవిత మహిళా సాధికారత గురించి ప్రసంగించారని, తన తండ్రి కేబినెట్లో మహిళను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీపీఎం గతం లో చేసిన పోరాటాల ఫలితంగానే గత, ఇప్పటి పాలకులు ప్రాజెక్టులు పూర్తి చేశా రనే విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటై నప్పుడు రాష్ట్ర అప్పులు కేవలం రూ.60 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు అవి రూ.1.20 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. వీటితో సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ చేయ మని అడుగుతున్న కోదండరాంపై విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, అధికారంలోకి వస్తే దేవుడికి ఇస్తానన్న మొక్కులను తీర్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యాడని, అదే విధంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
పోలీసు రాజ్యం ద్వారా అభివృద్ధా: రాఘవులు
-
పోలీసు రాజ్యం ద్వారా అభివృద్ధా: రాఘవులు
తిరుపతి: ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన ఆందోళనలను చంద్రబాబు ప్రభుత్వం అణచివేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తప్పుబట్టారు. పోలీసు రాజ్యం ద్వారా అభివృద్ధ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నిరంకుశత్వం ద్వారా ముందుకుపోవాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై లేఖలు రాసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ నుంచి బయటపడి.. ప్రెస్మీట్లవరకు రావడం మంచిదేనని రాఘవులు వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని ఎంత పట్టుకున్నారో మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
బసవపున్నయ్య ప్రపంచ నేత: ఏచూరి
హైదరాబాద్: మాకినేని బసవపున్నయ్య ప్రపంచ కమ్యూనిస్టు నేత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన మంగళవారం చిక్కడపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఏచూరి ప్రసంగించారు. హోచిమిన్, స్టాలిన్, ఫిడెల్‌క్యాస్ట్రో వంటి దేశాధినేతలతో బసవపున్నయ్యకు దగ్గరి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. -
'రైతుల సమాధులపై బాబు భూ సేకరణ'
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్పీ కుంటలో తలపెట్టిన సోలార్ ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరిన సీపీఎం నేత బీవీ రాఘవులను గురువారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌పై పోలీసులు దాడి చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో సీఎం చంద్రబాబు రైతుల సమాధులపై భూములు సేకరిస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. -
ఒకేచోట అభివృద్ధి.. వెనుకబడిన ప్రాంతాలకు ఆందోళన
– వెనుకబడిన ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన – సీమకు ప్రత్యేక ప్యాకేజీ రూ. 50 వేల కోట్లు ఇవ్వాలి –బీవీ రాఘవులు – ఉభయ కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహారదీక్ష తిరుపతి తుడా: అమరావతి కేంద్రంగా ఒకే చోట అభివృద్ధి చేయాలనుకోవడం భవిష్యత్‌లో ఇబ్బంది కరమేనని సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రూ.50 వేల కోట్లు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఒక రోజు నిరాహారదీక్షను చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన బీవీ రాఘవులు మాట్లాడుతూ గత పాలకులు హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం వల్లా సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందారన్నారు. వారి ఆందోళనకు తగ్గట్టే అభివృద్ధి చెందిన హైదరాబాద్ కోల్పోయామన్నారు. ఇప్పుడూ అమరావతి కేంద్రంగా అభివృద్ధిని కేంద్రీకరణ చేస్తుండటంతో వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఆందోళనలో పడ్డారన్నారు. రాష్ట్ర విభజనతో మరింతగా నష్టపోయింన సీమ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. విభజ చట్టంలో సీమ, ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పొందుపరిచినా ఇవ్వకుండా దాటవుత దోరణితో వ్యవహరించడం అన్యాయమన్నారు. వెంకయ్య, చంద్రబాబు సీమకు ద్రోహం చేసేలా వ్యవహరించడం బాధాకరన్నారు. ప్యాకేజీ కోసం కేంద్రాన్ని అడుగుతున్నామని చెప్పి ఒక్కసారిగా ప్యాకేజీ వల్లా ఉపయోగం లేదని చెప్పడం వెంకయ్య, బాబుల దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీని తీసుకురావాల్సిన నేతలు దద్దమ్మలుగా మారిపోయారన్నారు. సీమ ప్రజలకు ఈనేతలిద్దరు తీవ్ర ద్రోహానికి ఒడిగట్టారని మండిపడ్డారు. విభజన చట్టంలోని రూ. 50 వేల కోట్లు ఇచ్చేవరకు ఉద్యమం ఆగదన్నారు. సీమ అభివృద్ధి టీడీపీ నేతలు అవసరంలేనట్టుగా ఉందన్నారు. హక్కుల కోసం అన్ని పార్టీలు కలిసిరావాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబే పెద్ద అడ్డంకిగా మారాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. దీక్షకు మద్దతు ఇచ్చిన భూమన మాట్లాడుతూ సీమ ఈస్థాయిలో వెనుకబాటుకు చంద్రబాబే కారణమన్నారు. ముఖ్యమంత్రిగా గత 9 ఏళ్లు, ఈ రెండున్నరేళ్ల కాలమే నిదర్శనమన్నారు. సీమకు వస్తున్న ప్యాకేజీలు సైతం ఇతర ప్రాంతాలకు మళ్లించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాధరెడ్డి, రాష్ట్ర సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు కుమార్‌రెడ్డి, డి.రామానాయుడు, ఏఐటీయూసీ నాయకులు కందారపు మురళి, ఆపార్టీల నగర అధ్యక్షులు చిన్నం పెంచులయ్య, సుబ్రమణ్యం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
'మోదీ విధానాలతో ఐక్యత ప్రశ్నార్థకం'
⇒ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు ⇒ సూర్యాపేటలో పార్టీ రాష్ట్రకమిటీ సమావేశాలు ప్రారంభం సూర్యాపేట: ప్రధాని నరేంద్రమోదీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో భారతదేశంలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి తిప్పికొట్టాలి.. కానీ అలా కాకుండా దేశ ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా వ్యవహరిస్తే సీపీఎం చూస్తూ ఉండదని హెచ్చరించారు. భారత పాలకులు సైన్యాన్ని అప్రమత్తం చేయడంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉడీలో ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంటే ఎన్డీయే ప్రతినిధి ప్రతిపక్షాలపై విరుచుకు పడడంలో అర్థం లేదన్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టామని.. అయినా గోప్యంగా ఉంచామని ఓ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాడులు చేసేప్పుడు నిద్రపోయి.. అయిపోయాక మాట్లాడడం మోదీ, రక్షణశాఖ మంత్రులకే చెల్లుబాటవుతుందని ఎద్దేవా చేశారు. సరిహద్దుల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరముందని బీవీ రాఘవులు సూచించారు. -
మహా అధ్యయన యాత్ర
సీపీఎం పాదయాత్రపై బీవీ రాఘవులు సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజన పాదయాత్ర బడుగు, బలహీనవర్గాల సమస్యలపై మహాఅధ్యయన యాత్రగా సాగనుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 17 నుంచి మార్చి 12 వరకు 4 వేల కి.మీ. మేర నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని.. వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో యాత్రలో పాల్గొననున్న నేతలను మంగళవారం ఎంబీ భవన్లో రాఘవులు పరిచ యం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంలో అనేక కారణాలవల్ల తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు వెనకబడ్డారని, ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడినా పాత విధానాలే కొనసాగుతున్నాయని, కార్పొరేటీకరణ మరింత వేగం పుంజుకుందన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తెలంగాణ కావాలన్న అంశంపై ఓ చర్చాపత్రాన్ని పాదయాత్ర ద్వారా సీపీఎం ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు. అర్థమయ్యేలా చెప్పండి... బంగారు తె లంగాణ అంటే ఎట్లా ఉంటుందో, దాని వల్ల ఏం మేలు జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. బడుగులు, బలహీనవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకుండా పాత విధానాలే అవలంబిస్తోందన్నారు. జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్షాన్ని పిలిచేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జిల్లాలను ప్రకటించినంతనే అభివృద్ధి జరగదన్నారు. జిల్లాల వికేంద్రీకరణ మండల స్థాయి నుంచి జరగాలన్నారు. బడుగుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో లెఫ్ట్, ప్రోగ్రెసివ్, డెమొక్రటిక్, సోషల్ ఫోర్సెస్‌ను కలుపుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా సాగుతామన్నారు. -
గోరటికి జాషువా పురస్కారం
గుంటూరు ఈస్ట్: శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజా నాట్య మండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాషువా కవిత పురస్కార ప్రధానోత్సవ సభ మంగళవారం నిర్వహించారు. ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డీన్ ఆచార్య డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, జాషువా విజ్ఞాన కేంద్రం పాశం రామారావు తదితరులు ప్రసంగించారు. జాషువా స్ఫూర్తితో గోరటి వెంకన్న తన గళంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న యోధుడని కొనియాడారు. జాషువా ఏ లక్ష్యంతో తన కలాన్ని వాడారో అదే మార్గంలో గోరటి వెంకన్న నడుస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజానాట్య మండలి రమణ బృందం జాషువా పద్యాలను ఉత్సాహ భరితమైన జానపద వాయిద్యాలతో ఆలపించారు. సభకు నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ జాషువా పురస్కార ప్రధాన సంఘ అధ్యక్షుడు ఎస్ .బాలస్వామి సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సంస్కృతి వ్యవస్థాపకుడు బాలచందర్ , ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, అభిమానులు పాల్గొన్నారు. -
బీవీ రాఘవులు అరెస్టు.. విడుదల
రైతుల ఆమోదం లేకుండా భూసేకరణ నేరం – సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఓర్వకల్లు: ప్రై వేట్ పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు రైతుల ఆమోదం లేకుండా భూములు సేకరించడం చట్టరీత్యా నేరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని శకునాల, గడివేముల, గని గ్రామాల పరిధిలో నెలకొల్పుతున్న అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం శకునాల గ్రామంలో సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. పార్టీ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాఘవులుతో పాటు జిల్లా నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాఘవులు మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులో జిల్లా కలెక్టర్ ఏడాదిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆయన నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది ఎకరాల పంట భూములు తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రాంత రైతులను సంక్షోభంలోకి నెట్టిందన్నారు. అధికారం చేతిలో ఉందని అధర్మ పాలన చేస్తే ముఖ్యమంత్రికి భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉండదన్నారు. పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తే అక్రమ కేసులు బనాయిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. పట్టాలు, పాసు పుస్తకాలు లేకపోయినా అనుభవంలో ఉన్న వారికే పరిహారం చెల్లించాలని న్యాయస్థానాలు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. ప్రయివేట్ కంపెనీలకు భూములను స్వాధీనం చేయకముందే పరిహారం చెల్లించాలన్నారు. అడుగడుగునా అడ్డంకులు రాఘవులు గ్రామానికి వెళ్లకుండా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటయింది. కర్నూలు నుంచి శకునాల వరకు అంచెలంచెలుగా కాపు కాస్తుండటంతో పసిగట్టిన రాఘవులు కర్నూలు నుంచి హుసేనాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై సభా ప్రాంతానికి చేరుకుని గంటసేపు ప్రసంగించారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే రైతులు, మహిళలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సుమారు అరగంట పాటు తోపులాట చోటు చేసుకుంది. అక్కడి నుంచి రాఘవులుతో పాటు సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి జీపులో ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌కు తరలించారు. శాంతించని రైతులు ఓర్వకల్లు స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు మొత్తం 60 మందిపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
పాలకులు పంచుకోవడానికే ప్యాకేజీ
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఆయువుపట్టు పవన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని టీడీపీ, బీజేపీ పాలకులు అంగీకరించడంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ప్యాకేజీ సొమ్మును వారు పంచుకోవడానికే అని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీడీపీ నేతలకు ప్రత్యేక హోదా ఇష్టం లేదన్నారు. అందుకే ప్రజల ఆకాంక్షను విస్మరించి ప్యాకేజీకి ఆమోదం తెలిపి నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. ఆదివారం విశాఖపట్నంలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న బీవీ రాఘవులు మాట్లాడారు. ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుందంటున్న వారు... విభజన సమయంలో పార్లమెంటులో ఐదేళ్లకు బదులు పదేళ్లు కావాలని ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి వర్గంలో కొనసాగుతూ హోదా సాధించడం టీడీపీకి సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే టీడీపీ, బీజేపీలకు రాష్ట్రంలో నూకలుండవని ఎద్దేవా చేశారు. సదరు రెండు రాజకీయంగా ఘోరీ కట్టుకోవలసిందేనని జోస్యం చెప్పారు. రాష్ట్రం విడిపోయాక రైల్వేజోన్ ఇస్తామన్నారని... కానీ ఇప్పటికీ ఈ అంశంపై ప్రకటన చేయకపోవడం ద్రోహమేనన్నారు. మాటలు కాదు.. చేతల్లో చూపాలి ప్రత్యేక హోదా గురించి మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చేసి చూపించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బీవీ రాఘవులు సూచించారు. చెగువేరా గురించి పవన్ కల్యాణ్ తరచూ ప్రస్తావిస్తాడు... ప్రశంసిస్తాడు ఆయన గుర్తు చేశారు. అయితే చెగువేరా మాటలు చెప్పలేదు.. తుపాకీతో సాయుధ పోరాటం చేశాడని చెప్పారు. చెగువేరాలా పవన్‌ను తుపాకీ పట్టుకోమని చెప్పం.. కానీ రాజ్యాంగ పరిధికి లోబడి ప్రజల పక్షాన ఆందోళనలు చేయాలని కోరారు. అమరావతి చుట్టూనే అభివృద్ధి రాష్ట్రవిభజన జరిగాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. ఇదే అంశం గతంలోనూ రాష్ట్ర విభజనకు దారితీసిన విషయాన్ని విస్మరిస్తూ మళ్లీ అదే తప్పునే చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అలాంటి ఉద్యమమే పునరావృతమవుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమ వెనకబాటుకు కారణం ఉందని, కానీ ప్రకృతి వనరులున్నా ఉత్తరాంధ్ర వెన కబడి ఉండటానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని బీవీ రాఘవులు ఆరోపించారు. -
'తెలంగాణలో విద్యుత్ సమస్యలకు బాబే కారణం'
మెదక్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడే కారణమని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రైతుల పొట్టకొట్టే విధానానికే తాము వ్యతిరేకం తప్ప...ప్రాజెక్టులకు కాదన్నారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే జీవో నెం123ను తీసుకువచ్చారన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భారీ భూ సేకరణ అవసరం లేదని బీవీ రాఘవులు చెప్పారు. -
స్వాతంత్య్ర స్ఫూర్తితోనే రాణింపు
అత్తిలి: యువతలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి రగిల్చిననాడే వా రు అన్ని రంగాల్లో రాణిస్తారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. స్థానిక ఎస్వీఎస్ఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాదం గోపాలస్వామి రచించిన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధు లు, పశ్చిమగోదావరి జిల్లా సాంస్కృతిక సౌరభాలు అనే గ్రంథాలను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా బీవీ రాఘవులు మాట్లాడుతూ చరిత్రను అశ్రద్ధ చేసే ఏ దేశమైనా చరిత్ర లేకుండా పోతుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం ఏర్పడినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ అత్తిలి కళాశాల అభివృద్ధి కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మా ట్లాడుతూ ఆచరించినవాడే ఆచార్యుడని పేర్కొన్నారు. దుబారా వ్యయాన్ని తగ్గించి, పేదల సంక్షేమానికి ఖర్చుచేయాలని సూచిం చారు. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. అనంతరం గాదం గోపాలస్వామి రచించిన రెండు గ్రంథాలను బీవీ రాఘవులు, వంక సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు. రచయిత గాదం గోపాలస్వామి దంపతులను కళాశాల తరఫున సత్కరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు దాసం గోవిందరావు, కార్యదర్శి మద్దాల నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మండెల సూర్యనారాయణ, సూరంపూడి వెంకటరమణ పాల్గొన్నారు. -
దళితులపై దాడులు అమానుషం
చించినాడ (యలమంచిలి): స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా ఇప్పటికీ దళితులపై దాడులు జరగడం అమానుషమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవలు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్న ఆయన మార్గమధ్యలో చించినాడలో కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండా ఎగురవేసి అనంతరంlకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్లే దళితులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దళితుల రక్షణకు ఎన్ని చట్టాలున్నా ప్రభుత్వ సహకారం లేనిదే ఉపయోగం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలు వారు చెప్పిన మతాన్నే ఆరాధించాలని, వారు తినే ఆహారాన్నే తినాలనే విధంగా ప్రవర్తించడం అమానుషమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని చెబుతూనే గోదావరి, కృష్ణ పుష్కరాలకు రూ.కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. పుష్కరాలకు తాము వ్యతిరేకం కాదని క్రైస్తవులు, ముస్లింల పండగలను కూడా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు అన్ని మతాల ఆచార వ్యవహారాలను సమానంగా గౌరవించాలనే సంగతిని గుర్తించాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్ఎస్), దిగుపాటి రాజగోపాల్, జిల్లా నాయకులు బి.బలరాం, సర్పంచ్ పెచ్చెట్టి సత్యనారాయణమ్మ, సొసైటీ అధ్యక్షుడు కేతా సూర్యారావు, పార్టీ మండల కార్యదర్శి బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్ పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదాకు సీపీఎం మద్దతు
-
‘అమరావతి.. మేకిన్ ఇండియా కాకూడదా?’
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి రాజధాని అమరావతిని మేకిన్ ఫారిన్‌గా మారుస్తున్నారని సీపీఎం నేత బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. రాజధాని మేకిన్ ఇండియాగా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో ‘రాజధాని నిర్మాణం- విదేశీ కంపెనీల పెత్తనం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. చైనా ప్రపంచస్థాయి నిర్మాణాలు చేస్తోందని చెబుతున్న సీఎం.. 30 ఏళ్ల క్రితం ఆదేశ పరిస్థితి ఏమిటనేది తెలుసుకోవాలన్నారు. సమస్త పనులను విదేశీ కంపెనీలకే అప్పగిస్తున్న చంద్రబాబు..దేశీయ కంపెనీలు మురికివాడల నిర్మాణానికే పరిమితమని చెప్పటం దారుణమని రాఘవులు అన్నారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు నిర్మించిన ఘనత భారతీయ కంపెనీలకు ఉందని చెప్పారు. అయినా ప్రభుత్వం వాటిని విస్మరిస్తోందని ఆరోపించారు. ఎల్అండ్టీ, షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణం కుంగిపోవడంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
ప్రారంభమైన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం
హైదరాబాద్ : సీపీఎం కేంద్రకార్యాలయంలో పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి అధ్యక్షతన పోలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాణిక్ సర్కార్, పి. విజయన్ తదితరులు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు... నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన... జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. -
'తెలంగాణలో కరువు ఎమర్జెన్సీ ప్రకటించాలి'
ఖమ్మం రూరల్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టడంలేదని, వెంటనే కరువు ఎమరెన్సీ ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తల్లంపాడులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఇవేమీ పట్టకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో మెత్తటి పనిని మిషన్లతో చేయిస్తూ, ఉపాధిహామీ కూలీలతో గట్టి పని చేయిస్తున్నారని, దీంతో వారికి కూలీ గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. కరువు నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న నీటి ట్యాంకర్లను చట్ట ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచితంగా నీటి సరఫరా చేయాలన్నారు. -
కరువుతో కకావికలం
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కరువుతో రాష్ట్రమంతా కకావికలమవుతుంటే ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కరువుతో జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సంఖ్య పెంచుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంలో లేదని ఎద్దేవా చేశారు. కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గత రెండు సీజన్లలో నూ తీవ్ర పంటనష్టం సంభవించిందని, బాధిత రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని కొందరు నీటివ్యాపారం చేస్తున్నారన్నారు. వారి ఆటలు కట్టించి ప్రజలకు తాగునీటిని అందించాలన్నారు. పశువులకు గ్రాసం అందించలేక వాటిని తక్కువ ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో సమస్యలు తాండవిస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ధర్నా అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య, తూర్పు డివిజన్ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిల్లర రాజకీయాలు మానుకోవాలి
సర్కార్‌కు బీవీ రాఘవులు హితబోధ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం సీపీఎం చేపట్టిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరువు పరిస్థితులతో జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరువుతో రైతులు నష్టపోయారని, వారికి ఇన్పుట్ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. -
మంత్రికి అర్హత ఉందా?
శిద్దాను ప్రశ్నించిన బీవీ రాఘవులు ఒంగోలు టౌన్: ‘జిల్లాలోని దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎనాడైనా ప్రశ్నించారా? కుల వివక్ష గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశారా? అవన్నీ చేయకుంటే అంబేద్కర్ విగ్రహానికి దండవేసే అర్హత లేదంటూ తప్పుకోవాలని’ అని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు హితవు పలికారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సభ గురువారం స్థానిక నెల్లూరు బస్టాండులోని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద జరిగింది. కేవీపీఎస్ నాయకుడు జాలా అంజయ్య అధ్యక్షత వహించారు. రాఘవులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయాలని ప్రయత్నిస్తే మంత్రి శిద్దా వచ్చేవరకు ఆగాలంటూ పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రస్తుతం చైర్మన్‌గా నియమితులైన కారం శివాజీ గతంలో దళితుల సమస్యల గురించి ఏవిధంగా మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. భూ బ్యాంకు పేరుతో బలవంతపు సేకరణ రాష్ట్ర ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో దళితుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తుందని బీవీ రాఘవులు విమర్శించారు. కడప, అనంతపురం జిల్లాల్లోని దళితుల భూముల్లో సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, వారి భూములు కాకుండా అగ్రవర్ణాల భూముల్లో సోలార్ లైట్లు వెలగవా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం కాలువకు సేకరిస్తున్న భూముల్లో అగ్రవర్ణాల వారికి ఎకరాకు రూ. 30లక్షలు చెల్లిస్తున్న ప్రభుత్వం, దళితులకు కేవలం రూ. 3లక్షలు మాత్రమే ఇస్తున్నారన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి బీ రఘురామ్, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, దళిత కవి కత్తి కల్యాణ్, దళిత మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పాలడుగు విజేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సుందరయ్య భవన్ నుండి సభావేదిక వరకు ప్రదర్శన నిర్వహించారు. -
బీజేపీని దూరం పెట్టండి
కేసీఆర్‌కు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సలహా సాక్షి, సంగారెడ్డి: లౌకికవాద పార్టీ అయిన టీఆర్ఎస్.. మతతత్వ బీజేపీతో జతకట్టడం తెలంగాణ ప్రజలకు మంచిదికాదని, అందువల్ల దానిని దూరం పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణకు కీడు చేసే అలాంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవద్దని సూచించారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సీపీఎం చేపట్టిన కరువు యాత్రను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలకు రాష్ట్రంలో పదవులు ఇచ్చి, కేంద్రంలో తమ నేతలకు పదవులు దక్కేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఈ ఊహాగానాలకు తెరదించేలా టీఆర్ఎస్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. బంగారు తెలంగాణ, మైనార్టీల రిజ ర్వేషన్లకు కట్టుబడి ఉన్న టీఆర్ఎస్.. బీజేపీతో దూరంగా ఉండాలని రాఘవులు సూచించారు. కరువు నివారణలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని రాఘవులు ఆరోపించారు. కరువును నివారించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లు రావన్నారు. కరువుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని సూచించారు. -
సింగపూర్ సంస్థలకు దోచిపెడుతున్న బాబు
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు రాజమండ్రి: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ వ్యాపార సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. రాజమండ్రిలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు శనివారం హాజరైన రాఘవులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను బాబు సర్కారు సింగపూర్ సంస్థల చేతుల్లో పోస్తోందని, సుప్రీంకోర్టు తీర్పు, కేంద్ర ప్రభుత్వ సూత్రాలకు వ్యతిరేకంగా స్విస్ మెథడ్ అంటోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు గనులు, గ్యాస్‌లు, ఆస్తులను ధారాదత్తం చేస్తోందని దుయ్యబట్టారు. అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు సుమారు రూ.1,200 కోట్ల రాయితీలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కార్మికులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు, నిర్వాసితులకు సర్కారు ఏ రకమైన న్యాయం చేయడం లేదన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల కోసం ప్రభుత్వ యూనివర్సిటీలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని, వాటికి నిధులు కేటాయించకుండా మూసివేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. బందర్ ఓడరేవు, భోగాపురం ఎయిర్ పోర్టు కోసం రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా లక్షలాది ఎకరాలు లాక్కుని వారిని రోడ్డున పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. -
‘శత’విధాల పోరు
సాక్షి నెట్వర్క్: కనీస వేతనం, సమస్యల పరిష్కారం కోసం వంద రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆశ వర్కర్లు తమ పోరును ఉధృతం చేయాలని నిర్ణయించారు. 100 రోజులు.. 100 మంది.. 100 కి.మీ. పేరుతో చలో హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం అన్ని జిల్లాల్లో పాదయాత్రలు ప్రారంభించారు. వామపక్షాలతోపాటు వివిధ పార్టీల నేతలు, పలు సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో పాదయాత్రను ప్రారంభించిన సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు బీవీ రాఘవులు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ఒక్కరికీ కష్టం రానివ్వమని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆశ కార్యకర్తల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బతుకమ్మ, ఇతర పథకాలకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం పరిరక్షిస్తున్న ఆశ కార్యకర్తలకు ఎందుకు జీతాలు పెంచడం లేదని నిలదీశారు. ఆశ వర్కర్లపై సీఎం, మంత్రులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్‌లో ఆశ కార్యకర్తల పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు పిట్టల దొరను తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిలా సిరిసిల్లలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో ఆల్ ఇండియూ రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆశ వర్కర్ల పాదయాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రారంభమైన పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమర వీరుల స్థూపం నుంచి సుందరయ్య పార్కు వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. నల్లగొండలో హైకోర్డు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. -
'రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం టీడీపీయే'
విభజన విషయంలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కు ప్రత్యేక హోదాపై ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోటగుమ్మం (రాజమండ్రి) : రాష్ట్రంలో ఉన్న సంపన్నులతో పాటు సింగపూర్, విదేశీ వ్యాపారులు, సంపన్నుల అభివృద్ధి కోసమే అమరావతి నిర్మాణం జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని టూరిస్టు నగరంగా మారుస్తున్నారని విమర్శించారు. ముందు కరువు జిల్లాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి - ప్రభుత్వ వ్యూహం’ అనే అంశంపై పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇక్కడి ఆనం రోటరీ హాలులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం టీడీపీయేనని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలు ప్రత్యేక హోదాపై గళమెత్తాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యాపార ఆలోచనలు తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన లేదన్నారు. ఏడాదిన్నర గడిచినా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక కాంట్రాక్టర్ భవనంలో కూర్చుని చంద్రబాబు రాజధాని జపం చేస్తున్నారు ఆక్షేపించారు. ఇప్పుడు మళ్లీ ఓడల రేవులంటున్నారని, రేవులొచ్చినా వాటిలోకి ఓడలు రావని ఎద్దేవా చేశారు. కార్మికులకు కనీస వేతనంగా రూ. 15 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పుష్కరాల్లో భారీ అవినీతి జరిగిందని, తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక కుభకోణం జరిగిందని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుక పూడిక తీతకు రూ.300 కోట్ల కేటాయింపులలో భారీ అవినీతి జరిగిందన్నారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన సొమ్మును ప్రజల నుంచి సేకరించి వారంతా జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు దువ్వా శేషుబాబ్జి, టి.అరుణ్, టీఎస్ ప్రకాష్, బీబీ నాయుడు, దళిత నాయకులు తాళ్ళూరి బాబూరాజేంద్రప్రసాద్, ఎస్.గన్నియ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజా ఉద్యమాలలో నిర్బంధం తగదు’
నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఉద్యమాలపై ఆంక్షలు పెట్టి నిర్బంధించడం తగదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వామపక్ష నేతల అరెస్టులను ఆయన ఖండించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో దివంగత నేత నర్రా రాఘవరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపును ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. -
వైఎస్ఆర్ సీపీ బంద్‌కు సీపీఎం మద్దతు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సీపీఎం మద్దతు పలికింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఈ విషయం చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో చెప్పిన బీజేపీ ఆ మాట నిలబెట్టుకోవాలని రాఘవులు సూచించారు. బీహార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్యాకేజీ ప్రకటించడం ఎన్నికల డ్రామా అన్ని విమర్శించారు. బీహార్‌కు ప్యాకేజీ ప్రకటించిన మోదీ.. ఏపీపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని రాఘవులు ప్రశ్నించారు. ఈ నెల 29న వైఎస్ఆర్ సీపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
కేంద్రంపై 'ప్రత్యేక' ఒత్తిడి తేవాలి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం కర్నూలులో ఐద్వా రాష్ట్ర నాయకురాలు టీసీ లక్ష్మమ్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఓ వైపు కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెబుతున్నా.. ముఖ్యమంత్రి ఇంకా ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం మాట మారుస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోని రెండు నదులకు జాతీయ హోదా కల్పించేందుకు సీఎం కృషి చేయాలన్నారు. రాయలసీమలో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం తీరును ప్రజలకు వివరించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాఘవులు తెలిపారు. -
చంద్రబాబుది ‘రైతు ద్రోహ దీక్ష’
సీపీఎం నేత రాఘవులు సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు ఈ నెల 2న చేపట్టేది నవనిర్మాణ దీక్ష కాదని, అది రైతు ద్రోహ దీక్ష అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఉండవల్లిలో ఆదివారం ఆయన ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, వాళ్ల నోట్లో మట్టికొట్టి రైతు ద్రోహిగా ముద్రపడిన చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేస్తారా? అంటూ దుయ్యబట్టారు. రాజధాని అంశంతో ముడిపడిన అనేక సమస్యలకు చంద్రబాబు ఈ నెల 6 భూమి పూజలోగా స్పష్టమైన ప్రకటన చేయకుంటే విజయదశమి నాడు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలోపు ప్రజా ఉద్యమం చేపట్టి ఈ ప్రభుత్వాన్ని పాతేస్తామని రాఘవులు అల్టిమేటం ఇచ్చారు. భూమి పూజను అడ్డుకుంటామని ప్రకటించారు. జగన్ దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.. రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3, 4 తేదీల్లో చేపట్టే దీక్షతో చంద్రబాబు మొండి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటనలకు పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు రావాలని కోరారు. -
భూ సేకరణ ఆపకుంటే ఉద్యమం: సీపీఎం హెచ్చరిక
న్యూఢిల్లీ: ఏపీ నూతన రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న భూసేకరణను తక్షణం ఆపాలని, లేకుంటే తాము ఉద్యమిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, భూసేకరణ చట్టం గురించి పోలిట్‌బ్యూరోలో చర్చించినట్లు తెలిపారు. ఈ ఉదయం పోలిట్‌బ్యూరో సమావేశం ముగిసిన తరువాత రాఘవులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం అన్యాయంగా భూ సేకరణ చేస్తోందన్నారు. భూ సేకరణకన్నా ల్యాండ్ పూలింగ్ మంచిదన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడంలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో ఉంటే, ప్రజాప్రతినిధులను తెలంగాణలో ఉంచారన్నారు. పోలవరం ముంపు మండలాలపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని రాఘవులు చెప్పారు. -
'ప్రత్యేక హోదాపై మాట మార్చొద్దు'
కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మారుస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన ఆయన పార్టీ సభ్యులు, సానుభూతిపరుల సమావేశంలో మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే.. తమ ప్రభుత్వం వస్తే పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ నేత వెంకయ్య నాయుడు గతంలో పార్లమెంట్ సమావేశాల్లో చెప్పినట్టు గుర్తు చేశారు. గుర్తు లేకపోతే పార్లమెంట్ రికార్డులు, వీడియోలను పరిశీలించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మతిలేక మాట్లాడి ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు, చేనేతలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ పాల్గొన్నారు. -
హక్కులను కాలరాస్తున్న కేంద్రం
హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతోపాటు మతోన్మాద చర్యలకు పాల్పడుతోందన్నారు. కార్పొరేట్, మతోన్మాద శక్తులు కలసి రాజ్యాన్ని ఏలుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పోరాడాల్సిన అవసరముందన్నారు. హక్కుల సాధనకు పోరుబాట మేడే సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, మేడే స్ఫూర్తితో దీనికి వ్యతిరేకంగా దీక్షపూని పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు, తర్వాత చేసిన వాగ్దానాలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జ్యోతి, బి. వెంకట్, సాగర్, జాన్‌వెస్లీ, ఎస్.రమ, చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
విశాఖలో ఏపీ, తెలంగాణ కమిటీల సంయుక్త నిర్వహణ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (సీసీఐ(ఎం)) 21వ జాతీయ మహాసభలు మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో విజయవాడలోను, 2002లో హైదరాబాద్‌లోను ఈ మహాసభలు జరిగాయని తెలిపారు. ఈ సభల్ని పార్టీ ఏపీ, తెలంగాణ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్థానిక పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఐదురోజులు జరగనున్న ప్రతినిధుల సభలకు 900 మంది ప్రతినిధులు హాజర వుతారని తెలి పారు. ప్రతినిధుల సభలో రాజకీయ సమీక్షా నివేదిక, రాజ కీయ తీర్మానం, రాజ కీయ నిర్మాణ నివేదికలతో పాటు దేశంలో ప్రజలెదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణల గురించి చర్చించి తీర్మానాలు చేస్తామని వివరించారు. 19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఆర్కే బీచ్‌లో నిర్వహించే బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, మహాసభల మీడియా కమిటీ ఇన్చార్జి ప్రొఫెసర్ బాబీవర్ధన్, కన్వీనర్ బి.ఎస్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‘పట్టిసీమ’కు నిధుల వెనుక కుట్ర విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు కాకుండా పట్టిసీమ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం వెనుక భారీ కుట్రే ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆయన ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీటిని అందించడం కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులు నిధులు లేక నిర్మాణ దశలోనే ఆగిపోయాయని, వాటికి కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయిం చకుండా, నీటిపారుదల శాఖలోని సీనియర్ ఇంజనీర్లు సైతం వృథా అని చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడం దారుణమని విమర్శించారు. -
'పట్టిసీమ ఖర్చుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి'
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిపై దృష్టి పెట్టడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఏపీ రాజధానిపై మాత్రమే దృష్టి సారించడం వల్ల మిగతా ప్రాంతాలు వెనుకబడతాయన్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ ఉద్యమాలకు బీజంపడే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పెట్టే ఖర్చుతో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయోచ్చన్నారు. -
వామపక్షాలు సంఘటితం కావాలి
దోమలగూడ: వామపక్షాల మధ్య సైద్దాంతిక విభేధాలు ఉన్నప్పటికీ అంగీకరించిన అంశంపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ కమ్యూనిస్టు, వామపక్షాల ఐక్యతకు సీపీఎం కృషి చేస్తుందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గురువారం చిక్కడపల్లిలోని హోటల్ సాయికృపలో ఎంసీపీఐ (యు) 3 వ అఖిల భారత మహాసభల్లో భాగంగా మూడవ రోజు కమ్యూనిస్టుల ఐక్యతపై సదస్సు నిర్వహించారు. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యు) జాతీయ ప్రధానకార్యదర్శి కుల్దీప్సింగ్, పోలిట్‌బ్యూరో సభ్యులు రాజన్, ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సిపిఐఎంఎల్ కమిటీ సభ్యులు కొల్లిపర వెంకటేశ్వర్రావు, ఎస్‌యూసిఐ నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్షాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాల్లో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని అనుకున్న స్థాయిలో ప్రతిఘటించలేక పోతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా యువత వామపక్ష ఆలోచనా విధానం, అభ్యుదయ భావాలకు ఆక ర్షితులు కాలేకపోతున్నారన్నారు. పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గాల కొమ్ముకాస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో నైతిక విలువలు కలిగిన కమ్యూనిస్టు, వామపక్షాలు ఏకమై ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నారు. గౌస్ మాట్లాడుతూ దేశంలో బూర్జువా పార్టీలు ఒకరి బలహీనతలను మరొకరు సొమ్ము చేసుకుంటూ అధికారాన్ని సాధించుకుంటున్నారన్నారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటేనే వారిని ఎదుర్కోవడం సాధ్యపడుతుందన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు వామపక్షాల ఐక్యత తప్పనిసరిగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపి కిషన్, ఎం వెంకట్‌రెడ్డి, మద్దికాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాంతీయ అసమానతలకు మళ్లీ ఆజ్యం
హైదరాబాద్: 'ఏ ప్రాంతీయ వాదమైతే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందో మళ్లీ అదే ప్రాంతీయ అసమానతలకు దారితీసేలా చంద్రబాబు అభివృద్ధి నమూనా ఉంది. చంద్రబాబు రాజకీయంగా దూరదృష్టితో ఆలోచించడం లేదు. కొత్త రాష్ట్రం మళ్లీ ముక్కలు కాకూడదు' అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. తామేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, వాళ్లు తమను అర్థం చేసుకుంటారన్నారు. ఆదివారం నుంచి సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగనున్న తరుణంలో రాఘవులు శుక్రవారం ఇక్కడి ప్రకృతి చికిత్సాలయంలో 'సాక్షి ప్రతినిధి'తో మాట్లాడారు. 1997 డిసెంబర్ నుంచి 2014 మార్చి వరకు ఉమ్మడి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన రాఘవులు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి తెలుగుదేశం అభివృద్ధి నమూనా సామాన్యులకు ఉపయోగపడేలా లేదు. రాజధానికి భూసమీకరణే దీనికి ఉదాహరణ. వేలాది ఎకరాల భూమిని సేకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ అధికారులు 1,015 ఎకరాలు చాలంటుంటే 30 వేల ఎకరాలు కావాలని మంత్రులంటున్నారు. ఇదంతా ఎవరికోసం? కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఎంత నష్టం జరిగిందో హైదరాబాద్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాల్సింది. విజయవాడ రాజధానిలోనూ కోటి మంది జనాభా ఉండేలా నగరం ఎం దుకు? ఇంత జనాభా ఒకేచోట ఉండాలం టే బాబే చెప్పినట్టు ఒక్కొక్కరు పది మందిని కనడమో లేక పెద్దఎత్తున వలసల్ని ప్రోత్సహించడమో చేయాలి. ఎక్కడికక్కడ అభివృద్ధి చేయడానికి బదులు మళ్లీ కేంద్రీకృతం చేస్తే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. రాష్ట్రం మళ్లీ ముక్కలవకుండా చూడాలి. బాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు.. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలు. ముందు వాటిని అభివృద్ధి చేయాలి. దీనికి బదులు అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే తిప్పితే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు బయలుదేరతాయి. బాబు నమునాతో సామాజిక న్యాయం లేకుండా పోయింది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చెల్లాచెదురుగా ఉన్న గిరిజనుల అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు. సికిల్ అనీమియా(సాక్షిలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ), రక్తహీనత, మలేరియా వంటి వ్యాధులు ప్రబలినా పట్టించుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీకి బదులు కేంద్రం ముష్టి రూ.350 కోట్లు ఇస్తే అదేమని అడగడానికి నోరురాని చంద్రబాబు ఐదు కోట్ల మందికి ఏదో చేస్తాడని భావించలేం. బూర్జువా పార్టీలతో కలసి పోటీచేయం.. మున్ముందు బూర్జువా పార్టీలతో, అదే భావజాలమున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేయం. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, కలయికకే ప్రాధాన్యం. ప్రజాసమ స్యలపై ఎవరితోనైనా కలిసి పోరాటం చేస్తాం. కమ్యూనిస్టులు కలిస్తే పెద్ద శక్తే. దానిని గౌరవిస్తాం. ముందు రాజకీయ ఏకీభావం ఉండా లి. ఐక్యమై మళ్లీ విచ్ఛిన్నం కాకూడదు కదా.. ప్రజలకు ఆ విషయం తెలుసు... ఓట్లు, సీట్లు లేని పార్టీలు నిజమైన ప్రతిపక్ష పాత్ర ఏం పోషిస్తాయంటున్నారు కొందరు. సీట్లు లేనిమాట నిజమేగానీ చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది మాత్రం కమ్యూనిస్టులే.. ప్రజలకు ఆ విషయం తెలుసు. పోరాటాలపై మహాసభల్లో కార్యాచరణ చంద్రబాబు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచుతామంటున్నారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధించారు. రుణమాఫీ పెద్ద గోల్మాల్ అయింది. కౌల్దార్లకు, డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వాటిని విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోరా టాల పై కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొం దిస్తాం. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర తొలి మహాసభలు జరుగుతున్నాయి. సమర్థ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కృషి చేస్తాం. -
'కరకట్టను కేంద్రమంత్రులే ఆక్రమించారు'
విజయవాడ: కృష్ణానది కరకట్టను ఎంపీలు, కేంద్రమంత్రులే ఆక్రమించారని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీ వీ రాఘవులు ఆరోపించారు. కరకట్ట అక్రమణలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన బుధవారం విజయవాడంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్రాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే సహించేది లేదని బీవీ రాఘవులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా హెచ్చరించారు. -
‘రాజధాని’ పేరుతో భారీ కుంభకోణం
భూ మార్పిడిలో రైతులకంటే రాజకీయ, కార్పొరేట్ శక్తులే లాభపడ్డారు: రాఘవులు ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలి సీఆర్డీఏ చట్టంలో లొసుగులు.. నిబంధనలపై ప్రజలతో చర్చించాలి సింగపూర్ బ్యాంకులో ఉన్న డబ్బును రీసైకిల్ చేయడానికే అక్కడి నిపుణులకు రాజధాని నిర్మాణం అప్పగించారా? చంద్రబాబుకు రాష్ట్రంలోని మేధావులు, నిపుణులు కనిపించడంలేదా? సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పేరుతో గ్రామాల్లో జరిగిన భూముల క్రయవిక్రయాల్లో భారీ కుంభకోణం ఉందని, దానిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని జోన్లో భూములు అమ్ముకున్న రైతులకు దక్కింది అతి తక్కువ ధర అని చెప్పారు. మధ్యవర్తులు, రాజకీయ నేతలు, కార్పొరేట్ శక్తులకు మాత్రం భారీ లాభం కలిగిందన్నారు. సీపీఎం నేత మాకినేని బసవపున్నయ్య శత జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ ‘రాజధాని నిర్మాణం పాలన కోసమా? ప్రతిష్ట కోసమా?’ అనే అంశంపై జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టాన్ని అనేక లొసుగులతోనే అసెంబ్లీలో ఆమోదించారని అన్నారు. ఇది కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా, ఈ ప్రాంత ప్రజలు, రైతులకు నష్టం కలిగించేలా ఉందన్నారు. ప్రజల నుంచి డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేస్తామని ఆ చట్టంలో తెలిపారన్నారు. దీనివల్ల ఇక్కడి ప్రజలు పన్నులు చెల్లిస్తే వాటి ద్వారా జరిగే అభివృద్ధి ఫలాలను పెద్దలు అనుభస్తారని తెలిపారు. ఈ చట్టం వల్ల గ్రామ పంచాయతీలు హక్కులు కోల్పోతాయన్నారు. కనీసం నిబంధనలనైనా ప్రజల్లో చర్చకు పెట్టి లోపాలు సవరించాలని కోరారు. ప్రపంచంలో విఫలమైన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఆ పేరుతో భూస్వాములకు మేలు చేసి చిన్న రైతులు చితికిపోయేలా చేస్తున్నారని అన్నారు. రాజధాని ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజల జీవనానికి భరోసా ఇవ్వాలని చెప్పారు. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ టెక్నికల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కేఎం లక్ష్మణరావు మాట్లాడుతూ అవినీతి, ఆశ్రీత పక్షపాతానికి తావివ్వకుండా అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం జరగాలని చెప్పారు. రాజధానికి మహానగరం అవసరం లేదన్నారు. అన్ని మౌలిక సౌకర్యాలు ఉండే పాలన కేంద్రం సరిపోతుందన్నారు. డాక్టర్ ఎస్.సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ ఆంజనేయులు, కేఎస్సీ బోస్, జి.విజయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సింగపూర్‌లో ఉన్న నల్ల డబ్బును రీసైకిల్ చేయడానికేనా? సింగపూర్ బ్యాంకులో ఉన్న నల్ల డబ్బును రీ సైకిల్ చేసుకోవడానికే ఆ దేశ నిపుణులకు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారా అంటూ చంద్రబాబును రాఘవులు ప్రశ్నించారు. సింగపూర్, జపాన్ నిపుణుల సహకారంతో రాజధాని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబుకు మన రాష్ట్రంలోని మేథావులు, నిపుణులు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో, దేశంలోని నిపుణులతో కూడా రాజధాని బ్లూప్రింట్‌ను తయారు చేయాలని చెప్పారు. ఈ నిపుణులు, సింగపూర్ నిపుణుల ప్లాన్లను పరిశీలించి, ఏది మంచిదైతే దానిని అమలు చేయాలని కోరారు. -
CRDA బిల్లులో మార్పులు తేవాలి: బివి రాఘవులు
-
సామాన్యుడి కడుపు నిండే పాలన కావాలి:బీవీ రాఘవులు
భీమవరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఉందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రజలకు కావలసింది సింగపూర్, మలేషియా తరహా పాలన కాదని చెప్పారు. సామాన్యులు కడుపు నిండా తిండితినే పాలన కావాలని రాఘవులు అన్నారు. ** -
27న సీపీఎం నేత బీవీ రాఘవులు రాక
భీమవరం టౌన్ : భారత కమ్యునిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న భీమవరంలో నిర్వహించే వార్షికోత్సవ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరవుతారని జిల్లా కార్యదర్శి మంతెన సీతారామ్ చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1964లో కలకత్తాలో జరిగిన మహాసభలో పార్టీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ప్రజల సమస్యలపై పోరాడుతోందన్నారు. గ్రామ, మండల, పట్టణ మహాసభలను ఇప్పటికే పూర్తి చేసుకున్నామని, డిసెంబర్ 10, 11 తేదీల్లో తణుకులో జిల్లా మహాసభ నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు విశాఖపట్నంలో అఖిల భారత 21వ మహాసభ జరుగుతుందన్నారు. నూతన కమిటీలను ఏర్పాటుచేసుకుని రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఒక విధానానికి కట్టుబడి పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రధానంగా కార్మికులు, కౌలు రైతులు, పేద రైతులు, ఉపాధి హామీ పథకం, దళితుల, గిరిజన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోందన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి మసిపూసి రైతులను మోసం చేస్తోందన్నారు. బియ్యం లెవీ శాతాన్ని 75 నుంచి 25 శాతానికి కుదించడం రైతులను నష్టాలపాలు చేయడమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జేఎన్వీ గోపాలన్, డివిజన్ కార్యదర్శి బి.సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఏపీ సర్కార్‌పై మండిపడ్డ రాఘవులు
-
'కార్పొరేట్ శక్తుల చేతిలో చంద్రబాబు కీలుబొమ్మ'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం నేత బీవీ రాఘవులు మండిపడ్డారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఏ రాజధాని కూడా 30 వేల ఎకరాల్లో నిర్మాణం జరగలేదని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తుల చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారని రాఘవులు ఆరోపించారు. ఇంతకు ముందు ప్రపంచ బ్యాంక్ చేతిలో కీలుబొమ్మగా చంద్రబాబు వ్యవహరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా మీడియా దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని కోసం 17 గ్రామాల ప్రజల పొట్టకొట్డడం సరికాదని ఆయన అన్నారు. ఏపీ రాజధాని, కార్పొరేట్ శక్తుల కోసం కేంద్రం సైతం భూసేకరణ చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తోందని రాఘవులు విమర్శించారు. గ్రామాలంటే రైతులే కాదు.. అన్ని వృత్తుల వారు ఉంటారని ఆయన అన్నారు. Follow @sakshinews -
'ఎన్టీఆర్ సుజల స్రవంతి' ప్రమాదకరం
కాకినాడ: బహుళజాతి కంపెనీలకు మార్గం సుగమనం చేసేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. భవిష్యత్తులో ఈ పథకం ప్రమాదకరంగా మారబోతోందని హెచ్చరించారు. ఆరోగ్యం, వైద్యం ఏ విధంగా ప్రైవేట్ పరం అయ్యాయో అదే విధంగా తాగునీరు కూడా భవిష్యత్తులో ప్రైవేట్ పరం కాబోతుందని ఆందోళన చెందారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా ముఖ్యకేంద్రమైన కాకినాడ వచ్చిన బీవీ రాఘవులు విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్న తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. కరెంట్ కోసం చంద్రబాబు చెప్పేవన్నీ బోగస్ మాటలే అని రాఘవులు ఎద్దేవా చేశారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలను ఎందుకు భాగస్వామ్యం చేయలేదని చంద్రబాబును ఈ సందర్భంగా రాఘవులు ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్ పేరుతో విజయవాడలోని డ్రైనేజీలను శుభ్రం చేస్తే సరిపోదని... రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లోని మరుగుదొడ్లను ఒక్కసారి పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు రాఘవులు సూచించారు. -
'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు'
కడప: రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించిన సెమినార్లో రాఘవులు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు వందరోజుల పాలనపై ఆయన పెదవి విరిచారు. బాబు వందరోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే ప్రకటనలు: రాఘవులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై రోజుకో ప్రకటన వెలువడుతున్న తీరుపై సీపీఎం నేత రాఘవులు అసహనం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తున్నారని రాఘవులు విమర్శించారు. అనంతపురం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ పూర్తిగా వెనకబడి ఉంది అని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి విద్య, వైద్య, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాఘవులు సూచించారు. -
'ఓట్లు, డబ్బు ఇచ్చేవాళ్లు మాట వినే రాజధాని నిర్ణయం'
-
'సమగ్ర సర్వే వెనుక వేరే ఉద్దేశాలు'
ఢిల్లీ: తెలంగాణలో సమగ్ర సర్వే వెనక వేరే ఉద్దేశాలున్నాయని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు ఆరోపించారు. బోగస్ రేషన్ కార్డులు ఏరివేసేందుకు వేరే మార్గాలున్నాయని ఆయన అన్నారు. కార్మిక చట్టాలను మార్చి హక్కులను కాలరాసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గవర్నర్ ప్రత్యేక అధికారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సమస్యపై కలహించుకోవడం కంటే కలిసి చర్చించుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని రాఘవులు వ్యక్తం చేశారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఏపి రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఏపీ సీపీఎం కార్యదర్శి పి.మధు అన్నారు. కలెక్టర్ల సమావేశంలో పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాలు చంద్రబాబు మరిచేపోయారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు అసలు మాట్లాడడం లేదని మధు విమర్శించారు. -
యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ
ఒంగోలు కలెక్టరేట్ : యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ సర్కార్ పయనిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని చెప్పిన వారం రోజులకే దేశ ప్రజలపై రైల్వే చార్జీల రూపంలో అదనపు భారం మోపారని ధ్వజమెత్తారు. సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం స్థానిక కాపు కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పూనాటి ఆంజనేయులు నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ ధరలు పెంచారంటూ కాంగ్రెస్‌ను విమర్శించిన బీజేపీ.. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రైల్వే చార్జీలు భారీగా పెంచి కాంగ్రెసుకు తమకు తేడా లేదని నిరూపించిందన్నారు. తాము అధికారంలోకి రావడం ద్వారా దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని దేశ ప్రజలను నమ్మించిన బీజేపీ ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. వందశాతం ఎఫ్‌డీఐలను రైల్వే రంగంలోకి తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తోదన్నారు.రానున్న రోజుల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజలపై మరిన్ని భారాలు మోపేందుకు కసరత్తు చేస్తోందన్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు, హిందూత్వ పరిరక్షణ ధ్యేయంగా నరేంద్రమోడీ పాలన సాగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని రాఘవులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీని ఎలాంటి నిబంధనలు లేకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముప్పరాజు కోటయ్య, ఎన్.ప్రభుదాస్, జీవీ కొండారెడ్డి, ఎస్డీ హనీఫ్‌లతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం తీర్మానించింది. ఉపాధి హామీతో పాటు ఇతర పథకాలను ఎలాంటి సవరణలు చేయకుండా అమలు చేయాలని ప్లీనరీ కోరింది. బె ల్టుషాపుల ఎత్తివేత కలే రాష్ట్రంలో బెల్టుషాపుల తొలగింపు కలేనని బీవీ రాఘవులు అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు తొలగిస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు.. సీఎం అయ్యాక ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదని విమర్శించారు. పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా బెల్ట్ షాపులను తొలగించవచ్చని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయమై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని రాఘవులు సూచించారు. ఇప్పటికే విజయవాడ - గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు రావడంతో రియల్ ఎస్టేట్‌పై ఆధారపడినవారు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంకు ఎదురైన ఓటమిపై జిల్లాల వారీగా విశ్లేషించుకోనున్నట్లు వెల్లడించారు. జూలై 19, 20, ఆగస్టు 8, 10తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో పార్టీ పనితీరు గురించి సమీక్ష జరుగుతుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహించనున్నట్లు రాఘవులు తెలిపారు. -
నారాయణ విలువ 15 కోట్లేనా?
సీపీఎం నేత రాఘవులు ఎద్దేవా హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సీపీఎంపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తిప్పికొట్టారు. అసందర్భ, నిరాధార ఆరోపణలు మానాలని హితవు పలికారు. నారాయణకు ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్లాలని, లేదా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలన్న తమ జాతీయ విధానానికి అనుగుణంగానే వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, జేఏస్పీ, మహాజన సోషలిస్టు పార్టీలకు మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. ఖమ్మంలో తమ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం డబ్బులకు అమ్ముడుపోయారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. సీపీఐ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేస్తోందన్నారు. ఎన్నికలకు సంబంధించి సీపీఎం, సీపీఐల మధ్య ఎటువంటి పొత్తు లేదని రాఘవులు స్పష్టం చేశారు. తమ పార్టీ పోటీ చేసిన 13 స్థానాల్లో సీపీఐ తన అభ్యర్ధులను బరిలోకి దింపిన విషయం నారాయణకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. నారాయణ మాదిరిగా చౌకబారు విమర్శలు చేసి ప్రజలకు వినోదాన్ని పంచాలనుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు. నారాయణ విలువ 15 కోట్లేనా? అని ఎద్దేవా చేస్తూ సుమారు 150 కోట్లన్నా ఉంటుందనుకుంటున్నానని చమత్కరించారు. కాంగ్రెస్‌తో జత కట్టినందుకు సీపీఐని ఓడించమని వందసార్లయినా చెబుతామన్నారు. -
బాబు గజమోసగాడు: రాఘవులు
కర్నూలు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన కర్నూలులో పలుచోట్ల మాట్లాడుతూ సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల తన పాలనలో ఏమి చేసినట్లని ప్రశ్నించారు. అప్పట్లో బాబుతో పాటు 200 మంది ఎమ్మెల్యేలు సింగపూర్‌కు వెళ్లి షికారు చేసొచ్చారే కానీ సాధించిందేమీ లేదన్నారు. ఆయన చేతికి అధికారం వస్తే సింగపూర్ కాదు.. క్షవరం చేస్తారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఓటమి ఖాయమని తేలిపోవడంతో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ వర్గీయులను సీఎం చేస్తానని ప్రకటించారన్నారు. ఆయనకు స్వార్థం లేకపోతే అదే ప్రకటన సీమాంధ్రలోనూ చేయాలని డిమాండ్ చేశారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. కాలకూట విషం కక్కే బాబు, మోడీల జోడీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి కాగా.. లేఖ ఇచ్చిన చంద్రబాబు రెండో ద్రోహి.. అందుకు మద్దతిచ్చిన బీజేపీ మూడో ద్రోహిగా అభివర్ణించారు. -
కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణను మూసేస్తారు
‘ప్రాణహిత’ను ఎందుకు జాతీయ హోదా కల్పించలేదు: రాఘవులు కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణను మూసేస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం ఆయన రోడ్‌షో ఆయన మాట్లాడారు. తెలంగాణను వాచ్‌డాగ్‌లా చూసుకుం టామని పలుకుతున్న కాంగ్రెస్‌వారు హైదరాబాద్‌లో హెచ్ఎంటీని ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఇన్నేళ్లు కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆత్మహత్యలు, నిరుద్యోగానికి కారణమయ్యూరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లుగా.. తెలంగాణలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు కేటాయించి, నీటి వనరులు లేని దేవాదుల, ఇతరప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కూడా కేటాయించకుండా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఆరేళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గుంటే 30వ తేదీ ఎన్నికల లోపు ప్రాణ హిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2007లోగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని, తపాస్‌పల్లి లాంటి రిజర్వాయర్లను మూడో దశ కింద పూర్తి చేస్తామని ప్రకటించిన పొన్నాల.. 2014 వరకు కూడా ఎందుకు పూర్తి చేయలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామని గొప్పలు చెపుతున్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించలేదని రాఘవులు ప్రశ్నించారు. -
సుత్తి కొడవలి.. నక్షత్రం!
* ప్రజలు, పార్టీ ప్రయోజనాలే లక్ష్యం * ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం * పార్టీ పనులే ప్రాణం; చట్టసభలకు దూరం ప్రొఫైల్ పేరు: బీవీ రాఘవులు, తల్లిదండ్రులు: పున్నమ్మ, వెంకట సుబ్బయ్య, ఊరు: ప్రకాశం జిల్లా పెదమోపాడు, పుట్టిన తేదీ: 01-06-1954 చదువు: ఎంఎ హిస్టరీ, ఇష్టం: పుస్తక పఠనం, భార్య: ఎస్.పుణ్యవతి, కుమార్తె: సృజన, ప్రస్తుత నివాసం: హైదరాబాద్ పార్టీలో పదవి: సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు (2014 మార్చి 8 వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి తప్పుకున్నారు) ‘కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. అలా అని పార్టీ నాయకులు ఎటుపడితే అటు కొట్టుకుపోకూడదు. మార్క్సిజం అజేయం. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు శాపనార్ధాలు సరిపోవు. పోరాటమార్గమే అందుకు శరణ్యం’ ఎ.అమరయ్య: బోడపాటి వీర రాఘవులు అలియాస్ బీవీఆర్. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పెద మోపాడుకు చెందిన రాఘవులు కమ్యూనిస్టు ఉద్యమం మహోధృతంగా సాగుతున్న రోజు ల్లో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1954 జూన్ 1న జన్మించారు. తల్లిదండ్రులు బొడపాటి వెంకట సుబ్బయ్య, పున్నమ్మ దంపతులు. పాఠశాల విద్యను కందుకూరులో, ఇంటర్మీడియెట్‌ను గుంటూరులోని ఏసీ కాలేజీలో పూర్తి చేశారు. వ్యవసాయంపై మక్కువతో బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో డిగ్రీలో చేరారు. కాకపోతే మధ్యలోనే ఆపేశారు. కారణమేంటో ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు. ఆ తరువాత కావలిలో బీఏలో చేరారు. అది 1975 జూన్ చివరి వారం. బీఏ చివరి సంవత్సరం చివరి పరీక్ష రాసి కళాశాల నుంచి బయటపడే సమయానికి దేశమంతా అల్లకల్లోలం. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. సరిగ్గా ఈ దశలోనే ఆయన జీవితం మలుపు తిరిగింది. అప్పటి వరకు వామపక్ష విద్యార్థి సంఘాలతో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు పటిష్టమయ్యాయి. సీపీఎంలో పూర్తికాలపు కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పురిటిగడ్డ అయిన నెల్లూరు వెళ్లారు. సీపీఎంలో క్రియాశీలంగా.. ఎమర్జెన్సీ వల్ల సీపీఎంలో అప్పటికే నాయకులుగా ఉన్న వాళ్లు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరికొందరు జైళ్ల పాలయ్యారు. దీంతో నెల్లూరులోని పార్టీ కార్యాలయం బాగోగుల్ని చూసే బాధ్యత తీసుకున్నారు. కార్యాలయంలోనే ఉండి కొన్నిసార్లు రహస్యంగా మరికొన్నిసార్లు బహిరంగంగా కార్యకలాపాలు సాగించారు. పోలీసుల నిఘా, వేధింపులు, అరెస్టులు ఎక్కువ కావడంతో పార్టీ నాయకత్వమే రాఘవుల్ని విశాఖపట్టణానికి పంపించింది. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా.. పార్టీకి పనికి వస్తారని గుర్తించిన కార్యకర్తలను అవసరాన్ని బట్టి ఆయా రంగాల బాధ్యతలు అప్పగిస్తుంటాయి కమ్యూనిస్టు పార్టీలు. దానిలో భాగంగానే విశాఖపట్నం చేరిన రాఘవులు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లిషు డిప్లొమాలో చేరారు. ఆ తరువాత ఎంఏలో జాయినయ్యారు. విద్యార్థిగా అక్కడ విద్యార్థి ఉద్యమానికి నడుంకట్టారు. ఆయన నాయకత్వ లక్షణాలను గుర్తించిన పార్టీ 1979లో భారతీయ విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)కు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. తొలిసారి పూర్తిస్థాయి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అక్కడే ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీలో చేరారు. సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శిగా.. అదే సమయంలో విశాఖపట్నం జిల్లా సీపీఎం కార్యదర్శి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన స్థానం లో వచ్చిన మరోనాయకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో పార్టీకి కొత్త కార్యదర్శి కావాల్సి వచ్చింది. రాఘవుల్ని ఆ పదవి చేపట్టాలని పార్టీ ఆదేశించింది. దాంతో రాఘవులు తన ఆర్థిక శాస్త్ర పరిశోధనకు విరామం ఇచ్చి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల్ని చేపట్టారు. ఈ కాలంలోనే ఆయన తన సహకార్యకర్త అయిన పుణ్యవతిని పెళ్లి చేసుకున్నారు(ప్రస్తుతం ఆమె సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా, పార్టీ అనుబంధ సంస్థ సీఐటీయూ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు). పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. 1983లో విశాఖ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయిన రాఘవులు ఆ తర్వాత ఎన్నడూ తిరిగిచూడలేదు. 1988 నవంబర్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యత చూస్తూనే 1994 అక్టోబర్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఏడాది గడవక మునుపే 1995 ఏప్రిల్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. ఈ పదవిలో కొనసాగుతుండగానే ఆయన 1997 డిసెంబర్లో నల్లగొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పదహారేళ్లకు పైగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇటీవలే తన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌లో పి.మధుకు, తెలంగాణలో తమ్మినేని వీరభద్రానికి అప్పగించారు. పార్లమెంటరీ ఎన్నికలకు దూరంగా.. మూడు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. చట్టసభల ప్రతినిధిగా వెళ్లేందుకు ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం లేకనో, పార్టీ కార్యదర్శిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేకనో.. ఆ దిశగా ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. వ్యక్తిత్వం, నడత, పార్టీ ప్రయోజనాలే ప్రమాణికంగా ముందుకు సాగే రాఘవులు టీడీపీతో పొత్తులప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. మరోవైపు అదే పార్టీ నేత చంద్రబాబుపైన అవినీతి ఆరోపణల చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ వెనుకాడలేదు. ప్రజలు, పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారు. అసంఖ్యాక సంఘాలను స్థాపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు. భూ పంపిణీతోనే బడుగులకు న్యాయమన్నారు. విద్యుత్ చార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమంలో ముందు నిలిచారు. ఫలితంగా 2005లో రాఘవులును పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. పార్టీకే అంకితం శ్రామికవర్గ శ్రేయస్సే మిన్నగా భావించే రాఘవులు అవసరమైతే కార్మికవర్గ బలహీనతలను సైతం విమర్శించేవారు. సొంత ఆస్తులకు దూరంగా ఉండే రాఘవులు తన వాటాగా వచ్చిన ఆస్తిపాస్తుల్నీ పార్టీకే ఇచ్చివేసినట్టు చెబుతారు. పార్టీయే సర్వస్వంగా పార్టీ కార్యాలయమే నివాసంగా భావించే రాఘవులు దంపతులకు ఒక కూతురు. పేరు సృజన. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఎ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నారు. సింపుల్.. ప్లెయిన్.. అండ్ స్ట్రెయిట్‌ఫార్వర్డ్. ఆయన గురించి చెప్పమంటే ఈ ఒక్క ముక్కలో చెప్పొచ్చు. సాదాసీదా ఆహార్యం, ముక్కుసూటి వ్యవహారం ఆయన స్పెషాలిటీ. మార్క్సిజం ఆయన మతం. సమసమాజం ఆయన లక్ష్యం. చెప్పేదేదో స్పష్టంగా ‘కొడవలి’తో కోసినట్లుగా.. సూటిగా ‘సుత్తి’ లేకుండా.. పెదవులపై చిరునవ్వు చెరగకుండా.. చెప్పేస్తారు. ఆయన మాట్లాడుతుంటే ఒకసారి విప్లవకారుడిలా, మరోసారి వేదాంతిలా, ఇంకోసారి మేధావిలా అనిపిస్తారు కానీ రాజకీయ నాయకుడిలా అస్సలు అనిపించరు. ఆయనే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంతవరకు సీపీఎంకు పర్యాయపదంగా నిలిచిన బీవీ రాఘవులు. -
మోడీ వస్తే అంబానీలకే మేలు
వృత్తి దారులకు సబ్‌ప్లాన్ అమలు చేయాలి: రాఘవులు హైదరాబాద్, నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే అంబానీలకే మేలు జరుగుతుంది కాని బీసీలకు కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు.తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు పేర్కొనడం ప్రజలను మభ్యపెట్టటానికేనని విమర్శించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘మత్స్యకారుల జీవనోపాధి రక్షణకై ప్రత్యామ్నాయ విధానాలకే ఓటు వేయాలని, అభ్యుదయ వామపక్షాల అభ్యర్ధులను గెలిపించాలనే’ బుక్లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ వృత్తిదారులకు సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పుడే వారి అభివృద్ది జరుగుతుందని అన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ తప్ప.. ఎవరైనా ఓకే!
తెలంగాణ సీపీఎం నిర్ణయం సీపీఐతో సమన్వయం తప్పనిసరి వైఎస్సార్సీపీ, పవన్, టీఆర్ఎస్ సహా ఎవరైనా పర్లేదు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టు కట్టాలనే దానిపై సీపీఎం తెలంగాణ కమిటీ తేల్చుకోలేకపోయింది. పార్టీ జాతీయ విధానానికి అనుగుణంగా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర శక్తుల్ని ఏకం చేసేందుకు ప్రయత్నించాలని భావించింది. పొత్తులపై స్పష్టత రానందున పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కోసం వేచి ఉండాలని నిర్ణయించింది. సీపీఎం తెలంగాణ ప్రాంత నేతలు, క్రియాశీల కార్యకర్తల సమావేశాన్ని బుధవారమిక్కడ నిర్వహించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ సీతారాములు, నాగయ్య, చుక్కా రాములు, మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సామాజిక కోణం, సమగ్రాభివృద్ధి, పార్టీ నిర్మాణం, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు తదితర అంశాలను చర్చించారు. ప్రభావశీలిగా ఎదగాలి: ప్రస్తుతం తామున్న ఆత్మరక్షణ దశ నుంచి ఏడాదిలోగా ప్రభావిత దశకు ఎదగాలని తమ్మినేని పిలుపిచ్చారు. స్థానిక సంస్థల మొదలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సీపీఐతో సమన్వయానికి కృషి జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర శక్తులయిన వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, పవన్‌కళ్యాణ్, కిరణ్ పార్టీ సహా ఎవరొచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. ఇవేవీ కుదరకపోతే ఒంటరి పోరుకైనా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ నిర్మాణమే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని మధు చెప్పారు. -
ఏమో పీఎం అవుతారేమో !
హైదరాబాద్: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుంభకోణాలపై యుద్ధం చేసినందు వల్లే ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో స్వల్పకాలంలోనే అధికారంలోకి వచ్చిందని.. పరిస్థితి ఇలాగేవుంటే ఆ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు వెల్లడించారు. అయితే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీలే అధికారంలో ఉంటాయని స్పష్టంచేశారు. గురువారం రాత్రి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో ‘ఆమ్ఆద్మీ పార్టీ గెలుపు-ఒక పరిశీలన’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాన్ని, మతాన్ని, డబ్బు, మద్యాన్ని పక్కనబెట్టి ఆమ్ఆద్మీ పార్టీని గెలిపించారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో వామపక్షాలు కూడా కరెంటు,నీటి సమస్యలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రజలు ఆప్‌కు దగ్గరకావడం నూతన ప్రచార సాధనాలను వినియోగించడంతోపాటు ఎక్కువగా మీడియాను ఉపయోగించారని చెప్పారు. మాజీఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనలో వ్యత్యాసం లేకపోవడం వల్లే ప్రజలు విసుగుచెంది ప్రత్యామ్నాయంగా ఆప్‌ను గెలిపించారన్నారు. పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ కన్వీనర్ డాక్టర్ రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పురేందరప్రసాద్ పాల్గొన్నారు. -
మరిన్ని విభజన ఉద్యమాలు ఖాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జీవోఎం చేసిన సిఫార్సులు అరకొరగా ఉన్నాయని, ఇవి మరిన్ని విభజన ఉద్యమాలకు బీజం వేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటుల్లో బిల్లు చర్చకు వచ్చిన సందర్భంలో తాము వ్యతిరేకిస్తామని, దీంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తామన్నారు. శుక్రవారం ఆయన సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసే ఆందోళన కార్యక్రమాలు ఖరారు చేస్తామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయనే తాము ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడంలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై జీవోఎం ఎలాంటి సిఫార్సులు చేయలేదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు వెయ్యి కోట్లు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమకు పెద్ద ప్రాజెక్టు ఒకటి ఇవ్వాలన్నారు. కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి ఏర్పాటు చేసిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, విభజనకు సంబంధం ఉందన్నారు. ఆ ట్రిబ్యునల్ గడువు రెండు సంవత్సరాలు పొడిగించి నూతన రాష్ర్టం ఏర్పాటు వల్ల ఏర్పడే వివాదాలు కూడా పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రకటించకుండా చూడాలని, ఆ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్షంలో అదే విషయాన్ని చెప్తామన్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించి వెంటనే వివాదాన్ని పరిష్కరించాలన్నారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ నియంత్రణ సంస్థ త్వరలో చేపట్టబోయే బహిరంగ విచారణను మూడు నెలలు వాయిదా వేయాలన్నారు. మండేలాకు జోహార్లు నల్లజాతి ప్రజల హక్కుల కోసం పోరాడిన నెల్సన్ మండేలా మృతికి సీపీఎం రాష్ట్ర కమిటీ తరఫున రాఘవులు జోహార్లు అర్పించారు. -
రావణ కాష్టాన్ని ఆర్పండి: సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాష్ట్రం రావణకాష్ఠంలా మారింది. దీన్నిలా తగలబడనివ్వొద్దు. వెంటనే పరిష్కారం చూపాలి. విభజన వల్ల పరిష్కారమయ్యే సమస్యలకన్నా ఉత్పన్నమయ్యేవే చాలా ఎక్కువ. కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి’’ అని కేంద్ర మంత్రుల బృందాన్ని సీపీఎం కోరింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డిలతో కూడిన బృందం బుధవారం ఉదయం జీవోఎం సభ్యులతో భేటీ అయింది. అనంతరం రంగారెడ్డితో కలిసి రాఘవులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, మంత్రులు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీలకు తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటు వివరించామన్నారు. ‘‘నాలుగేళ్లుగా సమస్యను నానబెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పాలన స్తంభించింది. మంత్రివర్గం రెండు ముఠాలై యుద్ధ శిబిరాల్లా నడుస్తోంది. ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించే నాథుడు కనబడటం లేదు. అభివృద్ధి కుంటుపడింది. ఇంకా మీరు ఈ సమస్యని సాగదీసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటే ప్రజలు క్షమించరని జీవోఎంకు చెప్పాం. ఏదో ఒక నిర్ణయం చెబుతామని గతంలో చెప్పి కూడా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈసారైనా నాటకాలు కట్టిపెట్టి పరిష్కారం చూపుతారా లేదా అని నిలదీశాం’’ అన్నారు. రెండే అడిగారు... పోలవరం, భద్రాచలం డివిజన్‌ను విడదీయడంపై జీవోఎం తమను అభిప్రాయం కోరిందని రాఘవులు వెల్లడించారు. ‘ప్రస్తుత డిజైన్‌లో పోలవరం ప్రాజెక్టు గిరిజనులను, విలువైన భూముల్ని ముంచేస్తుంది. కాబట్టి డిజైన్ మార్చాలన్నాం. ఇక రాష్ట్రాన్నే విడదీయొద్దని మేమంటున్నప్పుడు ఖమ్మం జిల్లాను విడదీయాలని కోరబోమని చెప్పాం. జీవోఎం ముందు నాలుగు ప్రధాన సమస్యల్ని లేవనెత్తాం. సమైక్యంగా ఉన్నా, విభజించినా వెనకబడిన ప్రాంతాలు, జిల్లాల సమస్య ముఖ్యమైనది. అందుకే సమైక్య రాష్ట్రంలో కూడా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్ట సూచనలు చేశాం. వాటిని జీవోఎం సభ్యులు సావధానంగా విన్నారు’ అని చెప్పారు. " సీపీఎం లేవనెత్తిన నాలుగు అంశాలు... 1. సాగునీటి సౌకర్యాలకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు ప్రాతిపదికగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు వర్తించే ప్రాజెక్టుల పరిపూర్తికి అయ్యే ఖర్చునంతా కేంద్రం భరించాలి. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లిలను కేంద్ర నిధులతో పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ త్వరగా పూర్తి చేయాలి. 2. సామాజిక తరగతులు, దళితులు, ముస్లింలు, గిరిజనుల వెనకబాటే పలు ప్రాంతాల వెనకబాటుతనానికి ముఖ్య కారణం. వారి అభ్యున్నతికి, విద్యాపరంగా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 3. చిత్తూరు నుంచి ఆదిలాబాద్ దాకా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న పశ్చిమ ప్రాంత మండలాల్లో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్ని అదనంగా ఏర్పాటు చేయాలి. 4. కోస్తా తీరంలో ఓడరేవులకు పనికొచ్చే కేంద్రాలెన్నో ఉన్నా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి. రాయలసీమలో కూడా అన్ని సదుపాయాలతో ఒకట్రెండు ప్రాంతాల్లో పారిశ్రామికంగా, విద్యాపరంగా, సేవాపరంగా అభివృద్ధికి ప్రభుత్వరంగంలో కాంప్లెక్సుల స్థాపనకు చర్యలు తీసుకోవాలి జీవోఎంకు సీపీఎం బృందం సమర్పించిన నాలుగుపేజీల వినతిపత్రంలోని ఇతర ముఖ్యాంశాలివి... * కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేదు. అందుకే న్యాయమైన పద్ధతిలో రాష్ట్రానికి అదనపు నికర జలాలను కేటాయించేలా ఎగువ రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందాలు కుదర్చాలి * అక్షరాస్యతలో బాగా వెనకబడిన ప్రతి మండలంలోనూ కనీసం రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో విద్యా కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలి * హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థలన్నింటినీ అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలి * ముస్లిం ప్రాబల్య పట్టణాల్లో వారికోసం ఆధునిక, లౌకిక విద్యనందించే విద్యా కాంప్లెక్సులు నెలకొల్పాలి * అభివృద్ధిని ఉత్తర తెలంగాణ, రాయలసీమల్లోని పలు జిల్లాలకు వికేంద్రీకరించాలి. ఆయా కేంద్రాలను మార్కెట్లతో సంధానిస్తూ ఆధునిక రవాణా మార్గాలు నిర్మించాలి * రాష్ట్రంలోని గ్యాస్, బొగ్గు ఉత్పత్తుల్లో రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యమిస్తూ కేటాయింపులను కేంద్రం తిరిగి నిర్ణయించాలి -
బీజేపీ, కాంగ్రెస్‌లను అడ్డుకోవాలి: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడిదారులు, కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాసే పార్టీలను 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజల పై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే విదేశీపెట్టుబడులు, సామాన్యుల నడ్డివిరిచే ఆర్థిక సంస్కరణలు అమలు వేగవంతంగా జరుగుతాయని.. అందుకే ప్రాంతీయ పార్టీలు, ఇతర శక్తులు పుంజుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందని చెప్పారు. ఆయన గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ నార్త్‌జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆర్థిక సంక్షోభం - ప్రత్యామ్నాయాలు - లౌకికవాదం ప్రాధాన్యత’ సదస్సు, అలాగే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రూపంలో మతతత్వ ప్రమాదం ముంచుకొస్తోందని, దాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చిన్న రాష్ట్రాలుంటేనే తమ పని సులభమవుతుందని పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు కోరుకుంటున్నాయని తెలిపారు. సమైక్య రాష్ట్రం ఉన్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఎప్పటికీ ప్రజా సమస్యలు ఉంటాయని, వాటి కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత వామపక్షాల భుజాలపైనే ఉందని చెప్పారు. అందుకోసం వామపక్ష కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడి ప్రజల సమస్యలు మరింత తీవ్రమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న యూపీఏ రాష్ట్ర విభజన అంశంపై జీవోఎం తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి కేవలం ఐదు పార్టీలనే పిలవాలనే నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీవీ రాఘవులు విమర్శించారు. సమైక్యాంధ్ర కోరుతున్నాయని సీపీఎం, వైఎస్ఆర్సీపీలను... నివేదిక ఇవ్వలేదని టీడీపీని అఖిల పక్షానికి పిలవకపోవడంపట్ల తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి చెప్పకుండా, మంత్రుల బృందానికి రెండు నివేదికలిచ్చిన కాం గ్రెస్ పార్టీని ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పాటూరి రామయ్య, సంఘం జాతీయ నేత సునీత్ చోప్రా, త్రిపుర మంత్రి భానులాల్సాహు, సారంగధర పాశ్వాన్, సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ నార్త్‌జోన్ కమిటీ కార్యదర్శి డీజీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సమైక్యాంధ్ర మోసగాడు : రాఘవులు
బాబు తెలంగాణలో ఓ మాట... సీమాంధ్రలో మరోమాట ఒంగోలు, న్యూస్‌లైన్ : ‘సమైక్యాంధ్ర ఉద్యమ మోసగాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. సొంత వర్గాన్ని కూడగట్టుకుని రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. సమైక్య సింహం అనే పుస్తకాన్ని వేయించుకుని రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు..’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తెలంగాణలో ఓ మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఆయన వాదనలో నిజాయితీ లేదు..’ అని దుయ్యబట్టారు. ‘వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిణామాలు’ అనే అంశంపై ఒంగోలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వార్ రూంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈ సమైక్య సింహం ఏం చేస్తోందని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకరించి చంద్రబాబు తప్పు చేశారన్నారు. -
ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయాలి: రాఘవులు
కొణిజర్ల: ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వారు పంటలు నష్టపోవడానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తీగలబంజర, సింగరాయపాలెం గ్రామాల్లో అకాల వర్షాలకు తడిచిన పత్తి చేలను, లాలాపురంలో అడ్డదిడ్డంగా ఎదిగిన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంక్రాంతి నరసయ్య మాట్లాడుతూ.. ఏపీ సీడ్స్ వారు పంపిణీ చేసిన విత్తనాలలో దాదాపు 50 శాతం నకిలీ విత్తనాలు ఉండడంతో సగం పంట ముందుగానే ఈనిందని, మిగిలింది పొట్ట దశలో ఉందని, దీంతో పంట నష్టపోవాల్సి వ స్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు నాణ్యమైనవనే నమ్మకంతో రైతులు కొనుగోలు చేశారని, ప్రభుత్వమే వారిని మోసం చేస్తే ఇక దిక్కెవరని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో ఏపీసీడ్స్ విత్తనాలు కొనుగోలు చేశారని, వీరంతా నష్టపోయారని అన్నారు. పంటలు పరిశీలించిన అధికారులు 10 నుంచి 15 శాతం మాత్రమే విత్తనలోపం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చే శారు. పంటల పరిశీలన నివేదికలు ఇవ్వమని అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం సిద్దిక్‌నగర్, తీగలబంజరలో తడిసిన పత్తి చేలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంటల నష్టంపై నిపుణులతో కమిటీ వేసి అంచనాలు తయారు చేయించాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. తడిసిన పత్తిని ఎలాంటి ఆంక్షలు లేకుండా సీసీఐ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతుల రుణాలు రద్దు చేసి రబీకి తిరిగి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మీ దిగజారుడు ముందు నేనెంత?
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు రాసిన లేఖపై సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా స్పందించారు. రాఘవులు దిగజారుడు రాజకీ యం ముందు తానెంత అని శనివారం రాసిన బహిరంగలేఖలో ఆరోపించారు. ‘తాను ప్రస్తావించిన అంశానికి సూ టిగా సమాధానం చెప్పకపోగా డొంకతిరుగుడు జవాబులు చెప్పేందుకే సమయం కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయాన్ని ప్రస్తావించినపుడు అలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నప్పటికీ బహిరంగ రహస్యాన్ని సూటిగా చెప్పటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పార్టీగా మేము చెప్పిన అభిప్రాయం ప్రజలు ముందు ఉంది. ఆ ప్రకటనతో మీరు విబేధించారు. ఎవరు నిజాయితీగా మాట్లాడింది భవిష్యత్తులో తెలుస్తుంది’ అని నారాయణ తన లేఖలో పేర్కొన్నారు. -
వామపక్షాల లేఖల యుద్ధం
హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. లేఖల యుద్ధం ముదురుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణల మధ్య లేఖ యుద్దం సాగుతోంది. రాఘవులు నిన్న రాసిన లేఖకు నారాయణ ఈరోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. నారాయణ తనతో పాటు తన పార్టీ పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని రాఘవులు రాసిన లేఖలో దుయ్యబట్టారు. నారాయణ తన స్థాయి మరిచి విమర్శలకు దిగి అసత్యాలు, దిగజారుడు మాటలు మాట్లాడవద్దని హితవుపలికారు. వైఎస్సార్సీపీతో సర్దుబాట్లపై చర్చలకు తానే ప్రత్యక్ష సాక్షినన్నట్లు మాట్లాడిన నారాయణ నిజాయితీ ఉన్న కమ్యూనిస్టయితే వాటిని నిరూపించాలని రాఘవులు సవాల్ చేశారు. వైఎస్సార్సీపీతో సీపీఎం రహస్యంగా సీట్ల ఒప్పందం కుదుర్చుకుంటోందని నారాయణ విమర్శించిన నేపథ్యంలో రాఘవులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేపదే లేఖలు రాసినా సీపీఎం పట్ల నారాయణ దురుసుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వామపక్షాల మధ్య ఉండాల్సిన స్థాయిలో ఈ విమర్శలు ఉండడం లేదని, వ్యక్తిగత దూషణలకు దిగి అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వల్ల నారాయణకు, ఆయన పార్టీకే తీరని నష్టమని అన్నారు.రాష్ట్రంలో అనిశ్చితి తేలేవరకు ఎన్నికల గురించి చర్చించబోమని ఇదివరకే చెప్పామని గుర్తు చేశారు. ఒంగోలులో గురువారం నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు, నిరాధార, కల్పిత ఊహాగానాలు చేయవద్దని సలహా ఇచ్చారు. దీంతో రాఘవులు లేఖకు ఈరోజు నారాయణ కూడా లేఖ ద్వారానే కటువుగా సమాధానామిచ్చారు. తాను ఒంగోలులో చేసిన ఆరోపణలకు రాఘవులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారని పేర్కొన్నారు. బహిరంగంగా చేసిన ఆరోపణను జీర్ణించుకోలేకపోయారని నారాయణ లేఖలో విమర్శించారు. నిజానిజాలు భవిష్యత్తులో తేలుతాయన్నారు. -
దేశమంటే రాహుల్, మోడీయేనా?
వామపక్షాల ఆగ్రహం 10న హైదరాబాద్‌లో బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: దేశమంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ కాదని వామపక్షాలు మండిపడ్డాయి. కుర్చీ కోసం కాట్లాడుకుంటున్న వీరిద్దరూ ప్రపంచ బ్యాంకు అనుయాయులు, రిలయెన్స్ అధినేత అంబానీ జేబులో మనుషులని ధ్వజమెత్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలే తమ పోరాట పంథా అని స్పష్టం చేశాయి. ప్రజా సమస్యలు, పోరాటాల కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారమిక్కడ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అధ్యక్షతన నాలుగు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. కె.నారాయణ, కె.రామకృష్ణ (సీపీఐ), బండ సురేందర్‌రెడ్డి, దయానంద్, నరేందర్‌రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), జానకిరాములు, ఇ.రాజేందర్, అశోక్(ఆర్ఎస్పీ), వై.వెంకటేశ్వరరావు(సీపీఎం) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓట్లు, సీట్ల వేటలో తెరమరుగైన సమస్యల్ని వెలుగులోకి తెచ్చి ప్రజల్లో చైతన్యం పెంచి ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తామని వామపక్షాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం లెఫ్ట్ నేతలు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సభకు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, అభోనీరాయ్ హాజరవుతారని నారాయణ తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్లో గ్యాస్ దోపిడీ జరుగుతోందని రాఘవులు ఆరోపించారు. కేజీ బేసిన్‌ను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. -
గాంధీ జయంతి సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలి
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైల్లో ఐదేళ్ల శిక్ష కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీపీఎం కార్యాలయంలో నాలుగు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు ఆయన పాల్గొన్నారు. రాష్ట విభజనపై చేపట్టిన సమ్మె కొనసాగిస్తారా? లేక విరమిస్తారా అనేది ఏపీఎన్జీవోలు ఇష్టమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా, పాత్రికేయులపై కేసులు పెడుతూ డీజీపీ దినేష్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్యాస్‌పై విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదించిన భూ పరిమితి కుదింపును రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం అనైతికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వచ్చే నెల 10 తేదీన ఇందిరా పార్క్ వద్ద నాలుగు వామపక్షా పార్టీల ఆధ్వర్యంఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు. -
సీకే నారాయణ మృతికి రాఘవులు సంతాపం
మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన చారుముజుందార్ ముఖ్య అనుచరుడు,మావోయిస్ట్ నాయకుడు సీకే నారాయణ మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు,మల్లేపల్లి లక్ష్మయ్యలు శుక్రవారం ఇక్కడ తీవ్ర సంతాపం తెలిపారు.గత రాత్రి ఆయన హైదరాబాద్ నగరంలోని స్వగృహంలో మరణించారు. సీకే నారాయణ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీలో దారుణ హత్యకు గురైన జార్జీరెడ్డికి సీకే నారాయణ స్వయాన పిన తండ్రి. -
పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశంపై ప్రస్తుతం సమైక్యవాదాన్ని వల్లిస్తున్న పార్టీలు స్పష్టమైన వైఖరి తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ‘వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు- సీపీఎం వైఖరి’ అనే అంశంపై ఆదివారమిక్కడి కూకట్‌పల్లిలో గ్రేటర్ హైదరాబాద్ నార్త్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అఖిలపక్షంలో విభజనకు అంగీకరించిన పార్టీలు జూలై 31 తరువాత నుంచి సమైక్య ఉద్యమంలో పాల్గొనడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రాజకీయ అవకాశవాదం కోసమే సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తూ సమైక్యవాదం ఎత్తుకున్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమానికి డబ్బులు ఇస్తున్నారని అనడం సబబు కాదన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఉద్యమం జరిగిందని ఇక్కడ డబ్బులు ఇచ్చి ఉంటే అక్కడా ఇస్తున్నట్టేనన్నారు. వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణతోపాటు ఉత్తరాంధ్రలోనూ ఉన్నాయన్నారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఉద్యమాలతో పరిపాలన పతనమై పక్షవాతం వచ్చిన రాష్ట్రంలా కనిపిస్తోందని పేర్కొన్నారు. -
సీపీఎం నేతలది అవకాశవాదం: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీపీఎంపైనా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుపైనా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విరుచుకుపడ్డారు. సీపీఎం నేతలు పచ్చి అవకాశవాదంతో సీపీఐపై మాటలు తూలుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు తామొక్కళ్లమే మొనగాళ్లు కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సన్నాయి నొక్కులు, కోస్తాంధ్రలో సింహగర్జనలు చేసే సీపీఎం గురించి పార్టీలు, ప్రజలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. అన్ని పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే తెలంగాణకు మద్దతు పలికినట్టు వివరించారు. ‘తెలంగాణలో ఉద్యమం జరిగినంత కాలం మౌనంగా ఉండి పర్యటనలు పరి మితం చేసుకోలేదా? 2013 జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడ్డాక సీమాంధ్ర ప్రాంతాల్లో హడావుడి పర్యటనలు చేస్తూ సమైక్యతకు తామే మొనగాళ్లమని ప్రకటించుకుంటూ సీపీఐ పైన, ఇతర ప్రజాసంఘాలపైనా విషం కక్కే ప్రసంగాలు చేస్తారా?’ అని ధ్వజమెత్తారు. -
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్) రిఫైనరీలో జరిగిన భారీ ప్రమాదంపై వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, తీవ్రంగా గాయపడిన వారందరికీ రూ.25 లక్షల పరిహారం, శాశ్వత ఉపాధి కల్పించాలని పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ నగరం చుట్టూ ఉన్న అనేక పెట్రో, రసాయనిక, ఫెర్టిలైజర్స్, ఫార్మా వంటి పరిశ్రమలలో భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కార్మికులకు రక్షణ కరువైందని విమర్శించారు. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ విభాగాలన్నీ ఉద్ధేశ్యపూర్వకంగానే బలహీన పరుస్తున్నారని పేర్కొన్నారు. -
చిచ్చు పెట్టి.. ఆత్మగౌరవ యాత్రలా?: బీవీ రాఘవులు
అనంతపురం, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనకు అనుకూలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ ఇస్తే.. సీమాంధ్రలో ఆ పార్టీ నాయకులు సమైక్య ఉద్యమాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మండిపడ్డారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు-సీపీఎం వైఖరి’ అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇరు ప్రాంత ప్రజలను విడగొట్టాలని లేఖ ఇచ్చి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారో చెప్పాలన్నారు. ఆత్మగౌరవం కాదు తెలుగు ప్రజల వైరుధ్య యాత్ర చేపట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాలను ఏమంటారు? సీమాంధ్రలో జరుగుతున్నవి రాజకీయ ఉద్యమాలైతే తెలంగాణలో జరిగిన ఉద్యమాలను ఏమంటారో చెప్పాలని తెలంగాణ నాయకులను బీవీ రాఘవులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారని.. అయితే కొందరు తెలంగాణ ప్రాంత నాయకులు వాటిని రాజకీయ నాయకులు ఉసిగొల్పి చేయిస్తున్నారని విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో చేపట్టిన ఉద్యమాలు కూడా అదే కోవకు చెందినవా అని ప్రశ్నించారు. విభజన పాపం కాంగ్రెస్‌దేనని చెప్పారు. తెలంగాణ ప్రాంత ఓట్లు, ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు విచ్ఛిన్నమైతే ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. -
108 ఉద్యోగులకు అండగా ఉంటాం
ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారికి సీపీఎం అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. కలెక్టరేట్ ఎదుట 108 ఉద్యోగుల సమ్మె శిబిరానికి ఆయన శనివారం వచ్చి సంఘీభావం తెలిపారు. శిబిరాన్నుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 108 ఉద్యోగులు గడిచిన 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, కార్మిక చట్టం అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారు’ అని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా 108 ఉద్యోగులకు 15వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలనుబట్టి ఈ 15వేలు కూడా ఏ మూలకూ చాలవని అన్నారు. రోజుకు 12 నుంచి 16 గంటలపాటు పనిచేస్తున్న ఈ ఉద్యోగులను ఇంకా ఎక్కువ చేయాలని వేధిస్తున్నారని విమర్శించారు. అందరు ఉద్యోగుల్లాగానే వీరికి కూడా ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతన చట్టం అమలు చేయాలని, వాహనాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు దిగిన ఉద్యోగులపట్ల యాజమాన్యం కక్ష సాధిస్తోందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 300మందిని తొలగించి, వారి స్థానంలో అనుభవం లేని వారిని నియమించిందని విమర్శించారు. ఒక్కొక్క 108 సర్వీస్‌కు ప్రభుత్వం 1.11లక్షల రూపాయలు ఇస్తోందని, దీనిని యాజమాన్యం సక్రమంగా ఖర్చు చేయడం లేదని చెప్పారు. దీనిపై కాగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ప్రజాసంఘాలు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదాం శ్రీనివాసరావు, ఎస్కె.జమాల్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారీ హత్యలే : బీవీ రాఘవులు ఆగ్రహం
హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యవసర సేవల విభాగమైన 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిరోజూ హత్యలు చేస్తోందని, వైద్యసేవలు అందక ప్రజలు చనిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 రోజు లుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ చేపట్టారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకూ 108 ఉద్యోగులు భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం ధర్నాచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవులు ప్రసంగించారు. ప్రభుత్వ సొమ్ముతో 108ను నిర్వహిస్తుండగా సోకు మాత్రం జీవీకే యాజమాన్యానికి దక్కుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న జీవీకే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం రూ.15 వేలు కూడా వేతనం లేకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, రాములు, భూపాల్, ఏవీ నాగేశ్వరరావు, 108 ఎంపాయీస్ నాయకులు అప్పిరెడ్డి, సూర్యనారాయణ, బలరాం, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, శంకర్ రెడ్డి, వీరస్వామి, కిరణ్, శివ పాల్గొన్నారు. 108 ఉద్యోగుల భారీ ర్యాలీ: ధర్నా సందర్భంగా 108 సిబ్బంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ 108 యాజమాన్యం 256 మందిని అకారణంగా డిస్మిస్ చేయటంతో పాటు 108 మందిని జైలుకు పంపిందన్నారు.