'తెలంగాణలో విద్యుత్ సమస్యలకు బాబే కారణం'
మెదక్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడే కారణమని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రైతుల పొట్టకొట్టే విధానానికే తాము వ్యతిరేకం తప్ప...ప్రాజెక్టులకు కాదన్నారు.
కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే జీవో నెం123ను తీసుకువచ్చారన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భారీ భూ సేకరణ అవసరం లేదని బీవీ రాఘవులు చెప్పారు.