కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణను మూసేస్తారు
‘ప్రాణహిత’ను ఎందుకు జాతీయ హోదా కల్పించలేదు: రాఘవులు
కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణను మూసేస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం ఆయన రోడ్‌షో ఆయన మాట్లాడారు. తెలంగాణను వాచ్‌డాగ్‌లా చూసుకుం టామని పలుకుతున్న కాంగ్రెస్‌వారు హైదరాబాద్‌లో హెచ్‌ఎంటీని ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఇన్నేళ్లు కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆత్మహత్యలు, నిరుద్యోగానికి కారణమయ్యూరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లుగా.. తెలంగాణలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు కేటాయించి, నీటి వనరులు లేని దేవాదుల, ఇతరప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కూడా కేటాయించకుండా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఆరేళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గుంటే 30వ తేదీ ఎన్నికల లోపు ప్రాణ హిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2007లోగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని, తపాస్‌పల్లి లాంటి రిజర్వాయర్లను మూడో దశ కింద పూర్తి చేస్తామని ప్రకటించిన పొన్నాల.. 2014 వరకు కూడా ఎందుకు పూర్తి చేయలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామని గొప్పలు చెపుతున్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించలేదని రాఘవులు ప్రశ్నించారు.