భద్రాచలంటౌన్, న్యూస్‌లైన్: పట్టణ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి చింతల సూరిబాబు ఇంటిపై దాడిచేసి ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఉంచిన రూ.9లక్షలను సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సీపీఐ రాష్ట్రకమిటీ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ వియ్యంకుడు, పట్టణంలో లారీట్రాన్స్‌పోర్టును నిర్వహిస్తున్న చింతల సూరిబాబు ఇంట్లో ఓటర్ల కోసం పంపిణీ చేయడానికి నగదు ఉంచారనే సమాచారంతో ఎస్సై మురళీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో రూ.9 లక్షలతో పాటు 10 ఓటర్ల స్లిపులకు సంబంధించిన పుస్తకాలు లభించినట్లు ఎస్సై తెలిపారు. రూ 9లక్షలను సీజ్ చేసి సూరి బాబుపై కేసు నమోదు చేశామని అన్నారు. భద్రాచలంలో కాంగ్రెస్ అభ్య ర్థి కుంజా సత్యవతికి సీపీఐ మద్దతునిస్తున్న విషయం విదితమే. దీంతో ఆ నగదు విషయంలో సర్వత్రచర్చలు జరుగుతున్నాయి.
ప్రలోభాలకు గురిచేస్తే కేసులు
తిరుమలాయపాలెం: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణల మేరకు శుక్రవారం అర్ధరాత్రి తిరుమలాయపాలెం ఎస్సై ఓంకార్‌యాదవ్ సిబ్బందితో కలిసి పలు పార్టీల నాయకుల ఇళ్లపై దాడులు నిర్వహించారు.
గోపాలపురంలోని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఇంట్లో రూ.1.75లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గడుపుడి రాజా, ఇరుకుల పాటి ధనలక్ష్మి ఇళ్లల్లో కూడా దాడులు నిర్వహించినప్పటికి ఎలాంటి నగదు లభించలేదు.
తాళ్లచెరువులో సోదాలు చేసి వస్తున్న క్రమంలో గోపాలపురం వద్ద పోలీసు వాహనాన్ని గమనించిన పలువురు యువకులు రెండు క్రికెట్ కిట్లను రోడ్డు పక్కన వదిలేసి మోటార్ సైకిళ్లపై పరారయ్యారు. ఆ క్రికెట్ కిట్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా పేరుతో ఉన్న బ్యాగుల్లో క్రికెట్ కిట్‌తో ఉన్నాయి.
ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేరు టీడీపీ అభ్యర్థి మద్దినేని స్వర్ణకుమారి, నామా నాగేశ్వరరావు సోదరుడు నామా కృష్ణయ్య శనివారం అర్ధరాత్రి హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కి వచి వివరణ ఇచ్చారు.
పంట అమ్మగా వచ్చిన డబ్బని నిర్దారించిన అధికారులు: శుక్రవారం అర్ధరాత్రి టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.1.75 లక్షలు పత్తిపంట అమ్మగా వచ్చినట్లు అధికారులు శనివారం నిర్ధారించారు. ఖమ్మం వ్యవసాయమార్కెట్లో పంట అమ్మినట్లు పత్రాలను జోగుపర్తి వెంకటేశ్వర్లు మండల తహశీల్దార్, ఎంపీడీఓలకు సమర్పించాడు. దీంతో ఆ నగదును అతనికే అప్పగించారు.
కాంగ్రెస్ నాయకుల నుంచి నగదు స్వాధీనం
ఖమ్మం క్రైం: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు శనివారం ముగ్గురిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకబండబజారుకు చెందిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పారా వెంకటేశ్వర్లు.
ఆయన కారు డ్రైవర్ ఎస్.కె.జిలానీ మిషన్ ఆస్పత్రి సమీపంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రూ.11 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వెంకటగిరి గెట్ వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ వేముల సునీల్ ప్రజలకు నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.23 వేల 500 స్వాధీనం చేసుకున్నారు.
నేతల ఇళ్లపై దాడులు
Published Sun, Apr 27 2014 4:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement