వైఎస్ఆర్ సీపీ బంద్కు సీపీఎం మద్దతు | CPM support to YSRCP strike for ap special status | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ బంద్కు సీపీఎం మద్దతు

Published Fri, Aug 21 2015 4:04 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

వైఎస్ఆర్ సీపీ బంద్కు సీపీఎం మద్దతు - Sakshi

వైఎస్ఆర్ సీపీ బంద్కు సీపీఎం మద్దతు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు సీపీఎం మద్దతు పలికింది. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఈ విషయం చెప్పారు.

ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో చెప్పిన బీజేపీ ఆ మాట నిలబెట్టుకోవాలని రాఘవులు సూచించారు. బీహార్కు ప్రధాని నరేంద్ర మోదీ ప్యాకేజీ ప్రకటించడం ఎన్నికల డ్రామా అన్ని విమర్శించారు. బీహార్కు ప్యాకేజీ ప్రకటించిన మోదీ.. ఏపీపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని రాఘవులు ప్రశ్నించారు. ఈ నెల 29న వైఎస్ఆర్ సీపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement