సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. దేశ రాజధానిలో జరుగుతున్న వైఎస్‌ఆర్ సీపీ మహాధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ...‘బీజేపీకి పోయేకాలం వచ్చింది. అందుకే విజభన హామీలు అమలు చేయడం లేదు. ప్రత్యేక హోదా అంటే ప్యాకేజీనే మంచిదంటూ కేంద్రం అడుగులకు చంద్రబాబు నాయుడు మడుగులొత్తుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలా పోరాడామో, హోదా సాధన కోసం అలాగే పోరాడదాం.’ అని పిలుపునిచ్చారు.
తాడోపేడో తేల్చుకోవాల్సిందే..
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ సీపీ మహాధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి ఢిల్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇంత జరుగుతుంటే చంద్రబాబు అసెంబ్లీలో ఉండటం సరికాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ పోరాటాన్ని తాను అభినందిస్తున్నానని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment