![BV Raghavulu Criticizing BJP And TDP - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/18/bv-raghavulu.jpg.webp?itok=36E1Huq7)
బీవీ రాఘవులు (పాత చిత్రం)
సాక్షి, విజయవాడ : మూడో ప్రత్యామ్నాయం(థర్డ్ ఫ్రంట్) కోసం తమ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ విధానాన్ని దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నీతి అయోగ్ సమావేశంలో జమిలీ ఎన్నికలపై ప్రధాని చేసిన సూచన ప్రమాదకరమని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరగాలో ప్రజలు నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహార శైలి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రతిపత్తి లేని సంస్థగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తామని తెలిపారు. రాజ్యాంగబద్దంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందన్నారు. తాము అడిగినప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజ్ కావాలన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం డిమాండ్ చేయడం సంతోషం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment