'కార్పొరేట్ శక్తుల చేతిలో చంద్రబాబు కీలుబొమ్మ'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం నేత బీవీ రాఘవులు మండిపడ్డారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఏ రాజధాని కూడా 30 వేల ఎకరాల్లో నిర్మాణం జరగలేదని మండిపడ్డారు.
కార్పొరేట్ శక్తుల చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారని రాఘవులు ఆరోపించారు. ఇంతకు ముందు ప్రపంచ బ్యాంక్ చేతిలో కీలుబొమ్మగా చంద్రబాబు వ్యవహరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
రాజధాని కోసం 17 గ్రామాల ప్రజల పొట్టకొట్డడం సరికాదని ఆయన అన్నారు. ఏపీ రాజధాని, కార్పొరేట్ శక్తుల కోసం కేంద్రం సైతం భూసేకరణ చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తోందని రాఘవులు విమర్శించారు. గ్రామాలంటే రైతులే కాదు.. అన్ని వృత్తుల వారు ఉంటారని ఆయన అన్నారు.