విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న రాఘవులు, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/అనకాపల్లి టౌన్/యలమంచిలి రూరల్/సత్తెనపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రైతులను వాహనాలతో తొక్కించి చంపిన వాళ్లను రక్షిస్తూ ప్రధాని మోదీ మానవ హక్కుల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని చెప్పారు. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విజయవాడ, సత్తెనపల్లి, అనకాపల్లి, యలమంచిలి రైల్వేస్టేషన్ల వద్ద రైలురోకో నిర్వహించారు.
విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రైతుసంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను చంపిన బీజేపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అనకాపల్లిలో రైలురోకో నిర్వహిస్తున్న 16 మందిని ఆర్‌పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment