ప్రధానితో ఏం మాట్లాడారో పవన్‌ చెప్పాలి  | CPM Leader BV Raghavulu Demand To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ప్రధానితో ఏం మాట్లాడారో పవన్‌ చెప్పాలి 

Published Sun, Nov 13 2022 4:31 AM | Last Updated on Sun, Nov 13 2022 4:31 AM

CPM Leader BV Raghavulu Demand To Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని మోదీని కలిసిన పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్‌లో రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెబుతున్నారని.. అసలు ఆ సమావేశంలో పవన్‌ ఏం మాట్లాడారో చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు బీవీ రాఘవులు శనివారం విజయవాడ వచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తనను పిలిపించుకుని ప్రధాని మాట్లాడారని చెబుతున్న పవన్‌... ఆ వివరాలను చెప్పాలన్నారు. వారి కలయిక వ్యక్తిగత రహస్యమైతే చెప్పనవసరం లేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement