బివి రాఘవులు
ఢిల్లీ: తెలంగాణలో సమగ్ర సర్వే వెనక వేరే ఉద్దేశాలున్నాయని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు ఆరోపించారు. బోగస్ రేషన్ కార్డులు ఏరివేసేందుకు వేరే మార్గాలున్నాయని ఆయన అన్నారు. కార్మిక చట్టాలను మార్చి హక్కులను కాలరాసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గవర్నర్ ప్రత్యేక అధికారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సమస్యపై కలహించుకోవడం కంటే కలిసి చర్చించుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని రాఘవులు వ్యక్తం చేశారు.
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఏపి రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఏపీ సీపీఎం కార్యదర్శి పి.మధు అన్నారు. కలెక్టర్ల సమావేశంలో పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాలు చంద్రబాబు మరిచేపోయారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు అసలు మాట్లాడడం లేదని మధు విమర్శించారు.