P.Madhu
-
టీడీపీ పాలన కుంభకోణాలమయం
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉపాధి హామీలో కుంభకోణం, బియ్యంలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, చివరకు కార్పొరేట్ కాలేజీల్లో కుంభకోణం ఇలా వరుసగా ప్రతిదానిలో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఉచితంగా లభించే ఇసుకను కూడా అధికారపార్టీ నేతలు వదిలిపెట్టడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించకుండా వారి కడుపులు కొడుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రూ.1600కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క విశాఖ జిల్లాలో రూ.406 కోట్ల పనులు చేస్తే కేవలం రూ.75 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. విశాఖ జిల్లాలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి వాఖ్యలపై సీఎం నోరుమెదపరే.. ‘రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్ల లబ్ధిచేకూర్చే కాంట్రాక్టు ఇచ్చింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత కుమారుడికి, అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పయ్యావుల కేశవులు అల్లుడుకు తెలంగాణ ప్రభుత్వం మద్యం, పరిశ్రమలకు సంబంధించిన లైసెన్స్‌లు ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్తో అంటకాగుతోంది’ అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలుచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదన్నారు రిలయన్స్‌కు రూ. 3వేల కోట్ల బిజినెస్ రాష్ట్రంలోని రేషన్‌షాపులను రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని మధు గుర్తుచేశారు. 26 వేల రేషన్‌దుకాణాలను రిలయన్స్ విలేజ్ మాల్స్ పేరుతో ఆ కంపెనీకి అప్పగించి ఏటా రూ.3వేల కోట్ల బిజినెస్ ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. రేషన్ దుకాణాలను రిలయన్స్‌కు అప్పగిస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల వల్ల ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న చిన్న వ్యాపారుల పరిస్థితి రిలయన్స్ విలేజ్ మాల్స్ రాకతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు అన్ని రేషన్ షాపుల వద్ద ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వాటా 70టీఎంసీలు రావాలి – పూనాటి జిల్లాకు 70 టీఎంసీల వాటా నీరు రావాల్సి ఉన్నా ప్రభుత్వం విడుదల చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా..జిల్లాకు మాత్రం సరిగా ఇవ్వడం లేదన్నారు. సాగర్ జలాలపై ఆధారపడి జిల్లాలో 4 లక్షల ఎకరాల వరికి అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 6వ తేదీ లోగా ప్రకటన చేయకుంటే అదేరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ వల్ల 400 నుంచి 500 మంది చనిపోయారన్నారు. డెంగీ మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య పాల్గొన్నారు. -
హవాలా మోసాలపై బాబు స్పందించాలి
-
హవాలా మోసాలపై బాబు స్పందించాలి: మధు
విజయవాడ : రాష్ట్రంలో వెలుగుచూస్తున్న హవాలా మోసాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న విశాఖ, నేడు విజయవాడలో వెలుగు చూసిన హవాలా కుంబకోణాలపై చిత్తశుద్ది వుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే హవాలా మాఫియా చెలరేగి పోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపడం అంటే ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నీ ఉల్లగించడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం నెటిజెన్ల పై పెట్టిన కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నదీ, సముద్రతీర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనం నెత్తిన ఆక్వా పిడుగు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవిష్కరించారు. -
బందరు పోర్టు భూసమీకరణ జీవోను ఉపసంహరించుకోవాలి
బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా జారీచేసిన భూ సమీకరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. పోర్టుపేరుతో సుమారు లక్ష ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం 1800 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష ఎకరాలు తీసుకోడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనన్నారు. నిత్యం పారదర్శకత జపం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత భూమిని భూసమీకరణ ద్వారా తీసుకోనున్నదీ ఆ జీవోలో పేర్కొనలేదని, భూసమీకరణ వలన నష్టపోయే మత్స్యకారులు, ఇతర వృత్తిదారులకు ఎంత నష్టపరిహారం చెల్లించనున్నదో ఆ జీవోలో ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ పరిశ్రమ వస్తుంది, దానికి ఎంత భూమి అవసరమో ప్రకటించని ప్రభుత్వం ముందస్తుగా రైతుల నుంచి భూమిని లాక్కునే ప్రయత్నం భూమితో భూమితో వ్యాపారం చేయడానికేనని స్పష్టమవుతోందన్నారు. -
'బాబు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి'
కడప: ఓటుకు కోట్లు కేసులో అసలైన ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో మధు విలేకర్లతో మాట్లాడారు. బాబు ప్రమేయంతోనే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపారనేందుకు అనేక ఆధారాలున్నప్పటికీ బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు సెక్షన్ -8ను తెరమీదకు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామికంగా గెలవాలనుకుంటోందని మధు విమర్శించారు. -
కార్మిక చట్టాల సవరణలను ప్రతిఘటించండి
పట్నంబజారు (గుంటూరు): కార్మిక వీరుల బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అణుగుణంగా సవరణలు చేస్తున్నాయని, దీనిని ప్రతి కార్మికుడు ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్థానిక పట్నంబజారులోని కన్యాకపరమేశ్వరి దేవస్థానం వద్ద శుక్రవారం మే డేను పురస్కరించుకుని సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ జరిగింది. సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.నళీనీకాంత్ అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అంతు తేలుస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులు కాలరాసే విధంగా లేనిపోని చట్టాలను తీసుకుని వస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీరు కార్మికవర్గానికి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కార్మిక శక్తిని చిన్నచూపు చూసిన ప్రభుత్వాలు మట్టికరిచిపోయాయని పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కార్మికుల వేతన, పని గంటల విషయంలో ఎర్రజెండాల స్పూర్తితో సీపీఎం ఎనలేని పోరాటాల చేసిందని గుర్తు చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.భావన్నారాయణ మాట్లాడుతూ కార్మిక సంపదను ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా జెండాను ఆవిష్కరించిన నేతలు పట్నంబజారు, లాలాపేట, మార్కెట్, నాజ్‌సెంటర్, ఓవర్‌బ్రిడ్జి, శంకర్‌విలాస్, లాడ్జిసెంటర్‌ల వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు కె.శ్రీనివాస్, కె.రామిరెడ్డి, మల్లే కోటేశ్వరరావు, ముత్యాలరావు, నికల్సన్, వేమారెడ్డి, షకీలా, ఎల్.అరుణ, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ?
విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభలా నిర్వహిస్తోందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు. శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాలలో మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ అంశంలో దాటివేత దోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. రైతులు ఇప్పటికే రుణమాఫీ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ముంచి తుంచుతామంటే ఊరుకోం
వీఆర్‌పురం: పోలవరం పేరుతో జిల్లా నుంచి వేరు చేసిన ఏజెన్సీ ప్రజలను గిరిజన చట్టాలకు విరుద్ధంగా నీటముంచి..వారి బతుకులను తుంచివేసే ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని సీపీఎం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి. మధు హెచ్చరించారు. నిర్వాసిత ప్రజలకు అండగా ఉంటామన్నారు. నిర్వాసితుల విషయంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తీరును వారు తప్పుబట్టారు. రేఖపల్లిలోని ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ముంపు మండలాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన వీరభద్రం, మధు మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీపీఎం దశల వారీ పోరాటాలు చేస్తోందన్నారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలన్నదే సీపీఎం డిమాండ్ అన్నారు. దీనికి ఎంతటి పోరాటాలకైనా వేనుకాడేది లేదన్నారు. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన ప్రాజెక్టుల కింద నష్టపోయిన నిర్వాసితులకు ఎక్కడా న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. వాటి మాదిరిగానే పోలవరం నిర్వాసితులనూ చేయాలని కేంద్ర ం, ఏపీ ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. నిర్వాసితుల మెరుగైన ప్యాకేజీ కోసం తమ పార్టీ చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు నాన్ ఏజెన్సీ ప్రాంతంలో పునరావాసం క ల్పించి గిరిజన చట్టాలను కాలరాసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోందని మాజీ ఎంపీ మిడియం బాబూరావు మండిపడ్డారు. దీనిపై పార్టీ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేస్తామన్నారు. ప్రతి నిర్వాసితునికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేది లేదన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, పార్టీ ఖమ్మం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కార్యదర్శులు పోతినేని సుదర్శన్, దడాల సుబ్బారావు, సీతారామ్, నాయకులు బండారు రవికుమార్, బ్రహ్మచారి, తిలక్, శేషావతారం, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, సత్యనారాయణ, శిరమయ్య పాల్గొన్నారు. ముంపు మండలాల ప్రత్యేక కమిటీ ఎన్నిక పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాటం చేసేందుకు ముంపు మండలాల ప్రత్యేక కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తమ్మినేని, మధు ప్రకటించారు.ఈ కమిటీ కార్యదర్శిగా మిడియం బాబూరావు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే రాజయ్య, బీబీజీ తిలక్, దాకి శేషావతారం, కుంజా సీతారామయ్య, లక్ష్మయ్య కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ముర్లపాటి నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వర్లు, మడివి దుర్గారావు, పూనెం సత్యనారాయణ, కారం శిరమయ్య, సున్నం నాగమ్మ, సోయం చినబాబు, మేకల నాగేశ్వరరావు, కొమరం పెంటయ్య కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు!
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వామపక్షాలు విజయవాడ: ఎన్నికల హామీలను పదే పదే వల్లె వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపుతున్నారే తప్ప వాస్తవానికి చేసిందేమీ లేదని ఏపీ సీఎం చంద్రబాబుపై వామపక్షాలు నిప్పులు చెరిగాయి. రుణమాఫీ పేరుతో అధికారం చేపట్టిన బాబు.. ఇప్పుడా అంశంపై పలు నిబంధనలు విధిస్తూ రైతులను ఏమారుస్తున్నారని విరుచుకుపడ్డాయి. ఎన్నికల హామీలను తక్షణమే అమల్లో పెట్టాలని పది వామపక్ష పార్టీలూ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. బాబు 3 నెలల పాలన, ఎన్నికల హామీలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 24న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపాయి. సోమవారం ఇక్కడ నిర్వహించిన పది వామపక్ష పార్టీల మహాభేటీలో ఈ మేరకు తీర్మానించారు. భేటీ అనంతరం సీపీఎం పక్షాన ఆ పార్టీ ఏపీ కార్యదర్శి పి. మధు, సీపీఐ పక్షాన ఆ పార్టీ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. బాబు ప్రభుత్వం కౌలు రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీని విస్మరించిందని దుయ్యబట్టారు. 24న నిర్వహించే సదస్సులో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. వామపక్షాలన్నీ కలసి విద్యుత్ ఉద్యమం తరహాలో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. మహా భేటీలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సత్యానారాయణ మూర్తి, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకురాలు రమ, రవిచంద్ర, సీపీఎ(ఎంఎల్) నాయకులు గుర్రం విజయకుమార్, ఆర్ఎస్పీ నాయకులు జానకీరామయ్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు బి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'సమగ్ర సర్వే వెనుక వేరే ఉద్దేశాలు'
ఢిల్లీ: తెలంగాణలో సమగ్ర సర్వే వెనక వేరే ఉద్దేశాలున్నాయని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు ఆరోపించారు. బోగస్ రేషన్ కార్డులు ఏరివేసేందుకు వేరే మార్గాలున్నాయని ఆయన అన్నారు. కార్మిక చట్టాలను మార్చి హక్కులను కాలరాసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గవర్నర్ ప్రత్యేక అధికారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సమస్యపై కలహించుకోవడం కంటే కలిసి చర్చించుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని రాఘవులు వ్యక్తం చేశారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఏపి రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఏపీ సీపీఎం కార్యదర్శి పి.మధు అన్నారు. కలెక్టర్ల సమావేశంలో పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాలు చంద్రబాబు మరిచేపోయారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు అసలు మాట్లాడడం లేదని మధు విమర్శించారు.