సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ? | AP CPM State Secretary P.Madhu takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ?

Published Fri, Oct 24 2014 11:08 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ? - Sakshi

సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ?

విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభలా నిర్వహిస్తోందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు. శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాలలో మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ అంశంలో దాటివేత దోరణి అవలంభిస్తుందని ఆరోపించారు.  రైతులు ఇప్పటికే రుణమాఫీ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement