‘సమైక్యాంధ్ర ఉద్యమ మోసగాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. సొంత వర్గాన్ని కూడగట్టుకుని రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు.
బాబు తెలంగాణలో ఓ మాట... సీమాంధ్రలో మరోమాట
ఒంగోలు, న్యూస్‌లైన్ : ‘సమైక్యాంధ్ర ఉద్యమ మోసగాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. సొంత వర్గాన్ని కూడగట్టుకుని రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. సమైక్య సింహం అనే పుస్తకాన్ని వేయించుకుని రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు..’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తెలంగాణలో ఓ మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఆయన వాదనలో నిజాయితీ లేదు..’ అని దుయ్యబట్టారు. ‘వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిణామాలు’ అనే అంశంపై ఒంగోలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వార్ రూంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈ సమైక్య సింహం ఏం చేస్తోందని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకరించి చంద్రబాబు తప్పు చేశారన్నారు.