'కిరణ్ రాజకీయ అజ్ఞాని' | Kiran Kumar Reddy political illiterate, says komatireddy venkat reddy | Sakshi
Sakshi News home page

'కిరణ్ రాజకీయ అజ్ఞాని'

Published Tue, Nov 19 2013 1:27 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'కిరణ్ రాజకీయ అజ్ఞాని' - Sakshi

'కిరణ్ రాజకీయ అజ్ఞాని'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.  కిరణ్ కుమార్ రెడ్డి ఓ రాజకీయ అజ్ఞాని అని ఆయన ఎద్దేవా చేశారు. నల్గొండలో కోమటిరెడ్డి మంగళవారం ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో కిరణ్కు ఏబీసీడీలు కూడా తెలియవని  వ్యాఖ్యానించారు.

 వచ్చే ఎన్నికల్లో కిరణ్ ఎమ్మెల్యేగా కూడా గెలువలేరని వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.  వాస్తవాలు తెలియని కిరణ్ తెలంగాణ ఏర్పడితే నక్సలిజం, సమస్యలు పెరుగుతాయంటూ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement