
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై సీరియస్ అయ్యారు. పార్టీ మార్పుపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. నేను ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఉద్దేశ్యపూర్వకంగా కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాది కాంగ్రెస్ రక్తం.. నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంలేదని స్పష్టం చేశారు. బుధవారం అంతా తాను సోనియాగాంధీతోనే ఉన్నానని తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment