పోలీసు రాజ్యం ద్వారా అభివృద్ధా: రాఘవులు | BV Raghavulu comment on special status | Sakshi
Sakshi News home page

పోలీసు రాజ్యం ద్వారా అభివృద్ధా: రాఘవులు

Published Sat, Jan 28 2017 11:07 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

BV Raghavulu comment on special status

తిరుపతి: ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన ఆందోళనలను చంద్రబాబు ప్రభుత్వం అణచివేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తప్పుబట్టారు. పోలీసు రాజ్యం ద్వారా అభివృద్ధ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నిరంకుశత్వం ద్వారా ముందుకుపోవాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై లేఖలు రాసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ నుంచి బయటపడి.. ప్రెస్‌మీట్లవరకు రావడం మంచిదేనని రాఘవులు వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని ఎంత పట్టుకున్నారో మోదీ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement